31, అక్టోబర్ 2012, బుధవారం

పద్య రచన - 146

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. తెల్లని పిల్లీ రంగున
    మల్లియలే చెల్లనటుల మరపించితివే
    పిల్లలు కోడివి చేరెను
    తల్లిచ్చెడు వెచ్చ దనము తగిలిన దేమో !

    రిప్లయితొలగించండి
  2. కనుచో మున్యాశ్రమమున
    మను నచ్చట జీవులెల్ల మైత్రి యలర గా
    చును పిల్లి కోడి పిల్లల
    నను దృశ్యము చూడవచ్చు నచ్చటను సుధీ!

    రిప్లయితొలగించండి


  3. చూడు మల్లదె చిత్రంబు చోద్య మదియ
    కోడి పిల్లలు ,పిల్లియు కూడి యుండె
    జాతి వైరంబు లేక య జతగ యుండి
    మునుల యాశ్రమ భావంబు మొనయు చుండె

    రిప్లయితొలగించండి
  4. తెల్లపిల్లి , కోడి పిల్లల కలగల్సి
    మైత్రిఁజూపితిరుగ మైమరచితి!
    వర్గ బేధములనుపాటించు మనుజులే
    తెల్లబోవునట్లుపిల్లి దెల్ప!

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తల్లి ఇచ్చే వెచ్చదనం పిల్లి దగ్గర దొరికిందేమా అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తల్లిచ్చెడు’ అని కాక ‘తల్లి యొసగు’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    జాతివైరం మరిచి మున్యాశ్రమాలలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండే విషయాన్ని తెలుపుతున్న మీ పద్యం బాగుంది.అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    నేమాని వారి బాటలోనే మీరూ నడిచారు. పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఇటీవల అమెరికా లో జరిగినట్టుగా వచ్చిన ఓ వార్త ఆధారంగా

    పాపము, పసివి యివనుచుఁ
    జేపట్టకవదిలె పిల్లి చిత్తంబాపన్,
    జూపకనాపాటిదయను
    పాపాయినిచంపినావె పాపాత్ముండా!

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు.
    మీరు సూచించిన సవరణతో..

    తెల్లని పిల్లీ! రంగున
    మల్లియలే చెల్లనటుల మరపించితివే!
    పిల్లలు కోడివి చేరెను
    తల్లి యొసగు వెచ్చ దనము తగిలిన దేమో !

    రిప్లయితొలగించండి
  8. పూర్వ వైరమ్ము విడనాడి పిల్లి పిల్ల
    కోడిపిల్లల సఖ్యమ్ము కోరి పెంచ
    తనకు తనవారు కరువైన తప్పదంచు
    శత్రు మిత్రుడై నగుపించు జేరి బతుక

    రిప్లయితొలగించండి