అంతర్జాల అవధానం
అందరికి నమస్కారం..
మాలిక పత్రిక తరఫున అవధానం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము.
అవధానిగా డా.మాడుగుల అనిల్ గారు వస్తున్నారు. ఆయన సంస్కృతాంధ్ర పండితుడు. తిరుమలలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ అవధాన ప్రక్రియ నిర్వహణ బాధ్యత మన కంది శంకరయ్యగారిది..
పృచ్ఛకులుగా పాల్గొనడానికి ఆసక్తిగలవారు చెప్పండి.
అవధాన ప్రక్రియ లైవ్ లో కాకుండా ఒక గ్రూపులో జరుగుతుంది. దీనివలన వేర్వేరు ప్రాంతాలలో ఉన్నవారికి, ఉద్యోగాలు చేసేవారికి కూడా అణువుగా ఉంటుంది. అవధానిగారి సమయానుకూలతను బట్టి ఈ నెల 19, 20 తేదీలలో చేయాలనుకుంటున్నాము.
ఈ అవధానం సారాంశం మొత్తం విజయదశమినాడు మాలిక పత్రికలో ప్రచురించబడుతుంది..
ఈ అవధానంలో తీసుకొనే అంశాలు.
నిషిద్ధాక్షరి - 1
దత్తపదులు - 2
సమస్యాపూరణలు -2
వర్ణన - 1
ఆశువు -1
అప్రస్తుత ప్రసంగము - 1
కవిమిత్రులు ఎవరెవరు ఏయే అంశాలలో పాల్గొనే ఆసక్తి ఉన్నదో తెలియజేయండి.
అనిల్ గారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి..
https://www.facebook.com/dr.madugulaanilkumar?ref=ts&fref=ts
(మాలిక -అంతర్జాల పత్రిక సౌజన్యంతో...)
sir! i want to participate in samasya puranam.
రిప్లయితొలగించండిఆర్యా.. నమస్సులు. నిషిద్ధాక్షరి అంశాన్ని నాకు కేటాయించ గలిగితే సంతోషము.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ అవధానంలో పాల్గొనదలచినవారు శంకరయ్యగారికి మెయిల్ కూడా పెట్టండి..
రిప్లయితొలగించండిshankarkandi@gmail.com
లేదా
editor@maalika.org
ఆర్యా !ముందుగా సమస్యను మెయిల్ చేయాలా ! లేక 19 ,20 తేదీలలో మీరు చెప్పిన సమయానికి నెట్లో ఉంచాలా.ప్రొద్దు వారి నవనందన వాసంతములాగానా ? వీలయితే నాకు దత్తపదిని కేటాయిస్తే సంతోషము.ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచాలా సంతోషకరమైన వార్త తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరన్నా ప్రేక్షకుల వలె నెట్ లో చూడడానికి ఏమన్నా అవకాశం ఉన్నదా? తెలియ జేయ ప్రార్థన.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండి"అష్టావధాని" రాంభటల్ పార్వతీశ్వర శర్మ గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
ధన్యవాదాలు. త్వరలోనే మీకు గ్రూపునుండి ఆహ్వానపు ఈమెయిల్ వస్తుంది.
కంది శంకరయ్య గారికి నమస్సులు. నేను కూడా ఈ అవధానంలో పాల్గొన దలచాను. అవకాశం ఇప్పించగలరు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ రాంభట్ల వేంకట రాయ శర్మ గారూ,
రిప్లయితొలగించండిసంతోషం. దయచేసి మీ ఇమెయిల్ చిరునామా పంపించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారికి నమస్సులు.
రిప్లయితొలగించండిఈ అవధానములో పాల్గొనదలచినాను. దయచేసి ఒక అవకాశము ఇప్పించవలసినదిగా మనవి. సమస్యాపూరణ కానీ దత్తపది కాని ఇస్తే చేయగలనని భావిస్తున్నాను.
మీకు మెయిల్ పంపినాను.