కరుణరసాత్మకంగా ఎదలోతులలో నాటుకొనే భావాలతో మంచి పద్యాలను వ్రాసిన... లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, సుబ్బారావు గారికి, కమనీయం గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * రాజశేఖరుని శర్మగారూ, మీరు నా బ్లాగును వీక్షిస్తున్నారన్నమాట. చాలా సంతోషం. ధన్యవాదాలు.
బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
రిప్లయితొలగించండిమాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!
చుక్క నీరు లేక ' చిక్కితి' విధిచేత
రిప్లయితొలగించండినాట లేదు పొలము నాటినుండి
నాటె గునప మొకటి నాగుండె దేవుడు
పగుళు లిచ్చె నాదు బ్రతుకు పొలము
జీవనము లేదు క్షేత్రము
రిప్లయితొలగించండిలావిరులై కర్షకులకు నాశలు చెల్లెన్
దేవా! నీవే గతి మా
యావేదన దీర్పవే కృపామృత వృష్టిన్
బీ ట తీ యగ ,పొల మది బీ ద రైతు
రిప్లయితొలగించండివాన లేమికి చింతించి వాన చినుకు
పడును పండును బంటలు పాట్లు తొలగు
ననుచు భావించి ప్రార్ధిం చె నవ్వరు ణుని
sastry garu baga chepparandi abhinamdanalu
రిప్లయితొలగించండిsastry garu baga chepparu abhinamdanalu
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి1.
పాప మసలె పేద,పైన ననావృష్టి
నెరియలాయె బీడు,నేల యంత
తీసికొనిన యప్పు దీర్చుట యెట్టులో
మరణమొకటె యిపుడు మార్గమేమొ.
2.
ఎండిపోయెను చేలన్ని యేమిసేతు
నేలయే కాదు హృదయమ్ము నెరియలాయె
ఎటుల జీవిక సాగునీ యేట ననుచు
పాపమా పేద రైతు లో వగచుచుండె.
రిప్లయితొలగించండి1.
పాప మసలె పేద,పైన ననావృష్టి
నెరియలాయె బీడు,నేల యంత
తీసికొనిన యప్పు దీర్చుట యెట్టులో
మరణమొకటె యిపుడు మార్గమేమొ.
2.
ఎండిపోయెను చేలన్ని యేమిసేతు
నేలయే కాదు హృదయమ్ము నెరియలాయె
ఎటుల జీవిక సాగునీ యేట ననుచు
పాపమా పేద రైతు లో వగచుచుండె.
వర్షంబించుక లేదని
రిప్లయితొలగించండికర్షకవర్గంబు బాధగాంచెను జగతిన్
హర్షంబునకై నికనఘ
మర్షణమే శరణమంచు మదిభావింతున్.
కరుణరసాత్మకంగా ఎదలోతులలో నాటుకొనే భావాలతో మంచి పద్యాలను వ్రాసిన...
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
కమనీయం గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
రాజశేఖరుని శర్మగారూ,
మీరు నా బ్లాగును వీక్షిస్తున్నారన్నమాట. చాలా సంతోషం. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాజశేఖర శర్మగారూ ధన్యవాదములు.