13, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 848 (శకుని కర్ణ దుశ్శాసనుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు.

15 కామెంట్‌లు:

 1. విష్ణు భక్తుడు భీష్ముని వినక వారు
  ముదిరి రారాజు తోగూడి మూర్ఖులైరి
  శకుని కర్ణ దుశ్శాసనుల్, సత్పురుషులు
  పాండవులు కృష్ణ భగవాను డండ యుండ

  రిప్లయితొలగించండి
 2. శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు
  శౌర్య వీర్య ధనులు ఘనుల్ సంతతమ్ము
  నండ దండలునై యుండు టదియె చాలు
  ననుచు బొంగు సుయోధను డాత్మలోన

  రిప్లయితొలగించండి
 3. వ్రాయ దుష్టచతుష్టయం రాజరాజు
  శకుని కర్ణ దుశ్శాసనుల్ ; సత్పురుషులు
  ధర్మ రాజాదులగు పాండు తనయు లౌర
  అనఘ ! వింటె భారతమును వినవలె గద

  రిప్లయితొలగించండి
 4. dhanyavadamulu sir.miru cheyu sahithyakreedalo naku melu jaruguthundani na alochana............!!!!!!!!!!!

  రిప్లయితొలగించండి

 5. శకుని కర్ణ దుశ్శాసనుల్, సత్పురుషులు
  పాండవుల నిలఁ గీడు పాల్పడఁగఁ జేసి,
  నేత దుర్యోధనునకును నెప్డు సంత
  సమ్ముఁ గల్గఁ జేయఁగఁ జూతు రిమ్ముగాను!

  రిప్లయితొలగించండి
 6. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 13, 2012 9:17:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  ఆ సుయోధను నాజ్ఞను యనుసరించి
  శకుని కర్ణ దుశ్శాసనుల్, సత్పురుషులు
  భీష్మ కుంభజ కృపులాది వీరులెల్ల
  విరటు గోగణంబులు దోచ వెడలిరకట

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  =====*=====
  కుంభ కోణముల్ జూడంగ కూర్మి వీడి
  రామ లక్ష్మణ "మూర్తులు" రాక్షసులని
  శకుని కర్ణ దుశ్శా సనుల్ సత్పురుషుల
  ని ,జనులెల్ల బల్కును నేడు నిజముగాను

  రిప్లయితొలగించండి
 8. దుర్యోధనుని స్వగతము.......

  తనదుసౌఖ్యమ్ముకోరుమాతామహుండు
  స్నేహధర్మంబుచాటుసచ్చీలరూపు
  డనుజశబ్దార్థమునకీతడమలమూర్తి
  శకుని కర్ణదుశ్శాసనుల్ సత్పురుషులు.

  రిప్లయితొలగించండి
 9. దుష్ట బుద్ధులు మఱియును దోర్బలురును
  శకుని కర్ణ దుశ్శా సనుల్, సత్పురు షులు
  పాండ వేయులు బహు నీ తి పరులు గూ డ
  అన్న దమ్ముల సఖ్యత నెన్న లేము

  రిప్లయితొలగించండి
 10. జూదమాటలల్లొ మరచి భేదములను
  వాదులాటలు లేకుండ సాదుగుంటె
  కౌరవేంద్రులల్లొ మరికొందరగునేమొ
  శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు.

  రిప్లయితొలగించండి
 11. జూదమాటలల్లొ మరచి భేదములను
  వాదులాటలు లేకుండ సాదుగుంటె
  కౌరవేంద్రులల్లొ మరికొందరగునేమొ
  శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు.

  రిప్లయితొలగించండి
 12. మంచి వారల కెన్నడు వంచ నేను
  వెన్ను గాచి యుండును కలి మిన్న గాను
  పాండు సుతులంత యడవుల పాల బడిరి
  శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు

  రిప్లయితొలగించండి
 13. శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు
  వారిఁ జూడ విడివిడిగ, బల్నరువురు
  చేరిన నొకచో చెలగును చెడుతలంపు
  లింక యా నాలుగవ వాని వంకఁ జేరి

  రిప్లయితొలగించండి
 14. సహదేవుడు గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  దుష్టునకు మిగిలిన దుష్టులు శిష్టులు గానే కనిపిస్తారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘చతుష్టయం’ అని వ్యావహారిక రూపాన్ని ప్రయోగించారు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘ఆజ్ఞను + అనుసరించి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఆనతి ననుసరించి’ అందాం.
  *
  వరప్రసాద్ గారూ,
  రావణుడికి గుడి కట్టించి పూజలు చేస్తున్న వాళ్ళూ ఉన్నారట! మీ పూరణ సమయోచితంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  అన్నట్టు... అంతర్జాల అవధానం గురించి మీకు మెయిల్ పెట్టాలంటే నా వద్ద మీ మెయిల్ చిరునామా లేదు. దయచేసి మీ మెయిల్ అడ్రస్‌ను నాకు మెయిల్ పెట్టండి (shankarkandi@gmail.com)
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  జంగిడి రాజేందర్ గారూ,
  మంచి భావంతో సమస్యను పూరించే ప్రయత్నం చేసారు. అభినందనలు.
  ‘మాటలల్లొ, ఇంద్రులల్లొ, సాదుగుంటె’ అని వ్యావహారిక పదాలను ప్ర్రయోగించారు. మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాస పూర్వాక్షరం గురులఘువులలో ఏది ఉంటే మిగిలిన చోట అదే ఉండాలి కదా. అంతే కాక ‘జూదము + ఆట’ అన్నప్పుడు పుంప్వాదేశ, టుగాగమాలు వచ్చి ‘జూదపు టాట’ అవుతుంది. నా సవరణలతో మీ పద్యం....
  జూద మాడుటలో మరచి భేదములను
  వాదులాటలు లేకుండ సాదువు లయి
  యా సుయోధనుతోడ తా మగుదురేమొ
  శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు
  శీలవంతులు ,వీరులు ,స్నేహపరులు
  ఎపుడు నామేలె కోరెడి యిష్టసఖుల
  టంచు దలపోయు రారాజు యనవరతము.

  దుష్టమంత్రాంగము నెరపు ధూర్తులైన
  శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు
  కారు,కాని వారినె నమ్ము గరము ప్రీతి
  యోగ్యత నెరుంగనట్టి సుయోధనుండు.

  రిప్లయితొలగించండి