8, అక్టోబర్ 2012, సోమవారం

పద్య రచన - 136

తిక్కన సోమయాజి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. తిక్కన భారతమును కడు
    మక్కువతో యనువదించి మనకందించెన్
    ఎక్కు పర్వంబులనే
    మ్రొక్కుదు నా కవికి నేను రోజుకు రోజున్

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారు,
    పద్యము బాగున్నది. పెక్కు పర్వంబులంటే సరిపోతుంది. అందించెన్, ఎక్కు దగ్గర సంధి అయిపోయి అందెంచెనెక్కు అవుతున్నది కదా!

    రిప్లయితొలగించండి
  3. గోలి వారూ,

    మూడవపాదములో గణములు సరిపోవడములేదు కదా.

    రిప్లయితొలగించండి
  4. తక్కినభారతమంతయు
    నొక్కడునై రచనజేసెనుత్కృష్టముగా
    మిక్కిలిపెక్కువమక్కువ
    తిక్కనకంజలులనిచ్చి తృప్తివడసితిన్.

    రిప్లయితొలగించండి
  5. అస్థిమాలయో ప్రియమ్ము కౌస్తుభమౌనొ
    అమ్మ పాలొ నీకు హాలహలమొ
    తీయనగును దేవ! తెలుపుమా హరిహరా!
    యనెడు తిక్కనార్యు నభినుతింతు

    మాధవుం డితండు నిత డుమాధవుండటంచు దుర్
    బోధతోడ నేల భేదముల్ వచింతు రక్కటా!
    శోధనం బొనర్చి చిత్తశుద్ధి తోడ గాంచి యా
    రాధనమ్ము చేయుడీ పరాత్పరున్ సమాదృతిన్

    భారతంబు నందు పదునేను పర్వముల్
    తెనుగు సేసితీవు తీయనైన
    పద్యరత్నములుగ బళిబళి తిక్కనా!
    వందనములు నీకు భవ్యశీల!

    రిప్లయితొలగించండి
  6. తెనుగున భారతమ్మునల తీయదనంబును నింపి నిష్ఠతో
    యనువుగ తిక్కనార్యుడిక నంతయు వ్రాయగ బూనె; శ్రద్ధతో
    మనమున భక్తి నింపుకొని మాయని ప్రీతిని రండు మీరికన్,
    చని మనమెల్ల వందనము చక్కగ జేయగ సోమయాజికిన్.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది.
    కవిత్రయములో నన్నయ్య 2-1/2 పర్వములు వ్రాసెను, తిక్కన్న 15 పర్వములు వ్రాసెను తక్కిన భాగమును వ్రాసినది ఎర్రాప్రెగడ అందురు. తక్కిన భాగమును వ్రాసినది తిక్కన కాదుకదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ భావము బాగున్నది. 2వ పాదములో మక్కువతో ననువదించి యని నుగాగమము చెయ్యాలి. యడాగమము కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అమ్మా శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. 2వ పాదము ఆరంభములో యడాగమము రాదు. మొదటి పాదము చివరలో తోన్ అనే విభక్తికి చివర "న్" ఉన్నది కదా. ననువుగ అని 2వ పాదము ప్రారంభము అవుతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    శ్రీ నేమాని వారి సవరణలకు దన్యవాదములు తెలిపుచు.
    సకల కళా వల్లభునకు ప్రణమిల్లి వారి జీవిత చరిత్రను
    --------
    కోట్టరుపు తిక్కన రచనకు శివ (యువ )కవులు
    బలికె "కవి బ్రహ్మ "యని ,మహా భారతమును
    ఖడ్గ శూరుడై జేసెను కండ కండ
    ములు ,మనుమ సిద్ధి మంత్రిత్వ మును సలుపగ
    "నుభయ కవి మిత్రుడ"ను కీర్తి నొందె ,ముందు
    యజ్ఞమును జేసి తా సోమయాజి యయ్యె
    కార్య దక్షుడై ,సంఘ సంస్కర్తగా, మ
    త కలహాల కతీతుడై దాను నిల్చె

    రిప్లయితొలగించండి
  11. అయ్యా , నిష్ఠతో అను పదము మార్చిన తరువాత చూసుకొనలేదు. మన్నించగలరు.
    ఎంతోశ్రద్ధతో మా పొరబాట్లను గుర్తించి హెచ్చరించు మీకు మేమెంతైనా ఋణపడియున్నాము.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. భారతంబున పదునైదు పర్వములను
    మించి జవమున నాంధ్రీకరించి యంత
    నుభయకవులకు మిత్రుడై యుర్విలోన
    ఖ్యాతి నందిన తిక్కన్న నభినుతింతు.

    కవికులంబున ఘనునిగా గణుతి కెక్కి
    వచనములు లేని సత్కావ్యరచన చేసి
    యనుపమంబైన కీర్తుల నందియుండె
    సుకవిపరమేష్ఠి తిక్కన్న సోమయాజి.

    మనుమసిద్ధిచేత "మామా"యటంచును
    గౌరవింపబడుచు కావ్యకన్య
    నమితమైన ప్రేమ నతని కర్పణచేయు
    తిక్కనార్యుడెంతొ ధీయుతుండు.

    హరిహరనాథుని గనుగొని
    స్థిరమతియై "కాలకూటసేవనమా? నీ
    వరయ యశోదాస్తన్యమొ
    ధరగోరెద" వనియె సవ్యధర్మము నిలుపన్.

    భగవద్భేదం బెంతయు
    తగదంచును నొక్కి చెప్పి ధర నుభయకవీం
    ద్రగణంబులకును సఖ్యము
    తగురీతిని చేయబూను ధన్యుని గొలుతున్.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారూ తిక్కనకి వందనములు ఎంతో చక్కగా పద్య రత్నంతో చెప్పారు.

    భారతంబు నందు పదునేను పర్వముల్
    తెనుగు సేసితీవు తీయనైన
    పద్యరత్నములుగ బళిబళి తిక్కనా!
    వందనములు నీకు భవ్యశీల!

    రిప్లయితొలగించండి
  14. త్రిమూర్తులలో విష్ణువే కవిత్రయంలో తిక్కన యన్న భావంతో:

    స్థితికారకుండు హరియే
    మతిమంతుండై లిఖించె మా తెల్గున భా
    రతమును తిక్కన రూపా
    న తరతరాలు కవిమిత్ర నామంబొందన్!

    రిప్లయితొలగించండి
  15. మనుమసిధ్ధి ప్రజను మంత్రివై పాలించి
    జయము తెనుగు సేసి చరిత నిలిచి
    హరిహర నిజతత్త్వ హాసమై భాసించె
    తెలుగు వాఙ్మయలయ తిక్కనార్య

    రిప్లయితొలగించండి

  16. పండిత నేమని గారికి ధన్యవాదములు.
    లక్ష్మీ దేవి గారూ ధన్యవాదములు.
    ఉదయం 8 గంటలకు విద్యుత్తు కోత, కార్యాలయమునకు వెడలు హడావిడి. తొందరలో ' ఎక్కువ ' లో 'వ ' టైపు కాలేదు.
    ఇప్పుడు సవరణ తో...


    తిక్కన భారతమును కడు
    మక్కువతో ననువదించి మనకందించెన్
    ఎక్కువ పర్వంబులనే
    దక్కెను కవి విష్ణు సముడు త్రయమున జూడన్

    రిప్లయితొలగించండి
  17. మంచి ప్రశంసలు గూర్చిరి
    యంచితముగ లక్కరాజు లౌదార్యముతో
    మించిన సంతసమున దీ
    వించెద నా మిత్రుడలర వేయేండ్లు ధరన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు.
    తిక్కన సోమయాజి గురించి అనేక మంచి విషయములను వెలుగు లోనికి తెచ్చేరు మీ పద్యములలో. చాల సంతోషము. మా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తిగారూ! శుభాశీస్సులు.
    మీ ఘంటము మళ్ళీ దర్శనమిచ్చినది. ఘంటానాదము బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. అక్కఱపడి తెలుగు భాషనందు భారతంబునే
    చక్కగాను యనువదించి జనులకందజేయగా
    ఒక్క చేతి మీద పదియు నైదు పర్వరచనకై
    తిక్కనార్యుడవతరించె, దివుజుడుగను రాఘవా !
    (అక్కఱపడి = కోరి )

    రిప్లయితొలగించండి


  21. కాకతీయుల యోరుఁగల్లున గణపతి
    దేవుని సన్నిధిఁ దిక్కయజ్వ,
    తన రచనను భారతమ్మును బఠియించి,
    మెప్పులు వడసియు, మేలి వరము
    నందియుఁ దన స్వామి నల మన్మసిద్ధిని,
    ఘను, పునా రాజ్యార్హుఁ గాను జేసి,
    స్వామి కార్యమ్మును, స్వక కావ్య వికసన
    మ్ములను మంత్రాంగానఁ బొంది, మఱియుఁ

    దెలుఁగు వారల నాల్కలఁ దిరముగాను
    నిలిచి వెలిఁగెను, జిర యశమ్ములును బొందె;
    ఘనత నందె కవిబ్రహ్మగాను! మఱియు
    నుభయ కవిమిత్రుఁడయ్యుఁ దా నుర్వి వఱలె!

    రిప్లయితొలగించండి
  22. భారతంబును దెనుగున వ్రాసి నీ వు
    తెనుగు భాషకు వన్నెను దెచ్చి నావు
    తిక్క నార్యుడ ! కవి వర ! తెలుపు చుంటి
    వంద నంబులు శత కోటి యందు కొనుము .

    రిప్లయితొలగించండి