కారణాంత రాలవల్ల ఇప్పుడే చూసాను . ఒక చెడ్డ వార్త విన్నందుకు బాదగా ఉంది .ఇప్పడి కైనా అతగాడు మారి , పిల్లల నైనా ప్రేమగా చూసుకుంటే కొంత బాధను రానురానూ మర్చి పోగలుగుతారు . ఆ భగవంతుడు సర్వదా రక్షణగా ఉండి ఆమె ఆత్మకు శాంతి కలిగించుగాక .
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, దిట్టవు పద్యరచనమునఁ బట్టణమున పట్టపగలె పలు తారలఁ జూ పెట్టిన చక్కని పూరణ మట్టె ప్రశంసింతు గోలి హనుమచ్చాస్త్రీ! * అక్కయ్యా, అది తొయ్యలికి టైపాటని నా మట్టి బుర్రకు తట్టలేదు సుమా!
సంపత్ గారూ, గతంలో మీరు ఈబ్లాగుకు పూరణలు పంపి ఉన్నారా? పంపితే మిమ్మల్ని సంపత్ కుమార్ శాస్త్రి గారుగా పొరబడ్డానా? ఇద్దరూ ఒకరే అనుకున్నాను. సందేహం వచ్చి చూస్తే ప్రొఫైళ్ళు వేరువేరుగా ఉన్నాయి. నా మతిమరుపును మన్నించండి... క్రొత్తవారైతే సంతోషం...స్వాగతం! మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చాలా బాగున్నవి. అభినందనలు. అన్నట్టు ‘చూడుఁడదే..’ చూడుమదే అయింది. విప్రనారాయణ చిత్రంలోని ‘చూడుమదే చెలియా’ గుర్తుకు వచ్చిందా? :-)
కమనీయం గారూ, ఆ పద్యాల శైలి చూస్తే సుపరిచితం అనిపించింది. పేరేమో క్రొత్తది. అందువల్ల సందేహం కలిగింది. మీకు నా అభినందనలు. * లక్ష్మీ నరసింహ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
చూడగ ధరలే ధరనే
రిప్లయితొలగించండివీడెను గనపట్టు పైన విన్వీధిని తా
రాడుచు, నేదైన కొనగ
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
వేడుకలు జరుగు చోటున
రిప్లయితొలగించండికూడిన యువకులు, సొబగుల కొమ్మల గనగా
వాడని వెలుగదె కనులన్,
జూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
వేడుకమెయి చని మేమిట
రిప్లయితొలగించండిచూడగ నక్షత్రశాల చోద్యము మెరయన్
తోడుగ వచ్చిన హితుడనె
చూడుడదే పట్టపగలె చుక్కలు పొడిచెన్
వీడె వెలుంగాకస సూ
రిప్లయితొలగించండిరీడికి సంపూర్ణ గ్రహణ లీలల వలనన్
కూడగమబ్బులతెరకలు
చూడుఁడదేపట్టపగలెచుక్కలు వొడిచెన్!
మేడెక్కి దానిపై తిరు
రిప్లయితొలగించండిగాడగ సంపూర్ణ సూర్య గ్రహణము నింగిన్
నాడు గనుపించె ; భళిరా!
చూడుడదే పట్టపగలు చుక్కలు వొడిచెన్ !
ఓడల రేవుల యొడ్డున
రిప్లయితొలగించండిచూ డు డదే పట్ట పగలె చుక్కలు వొ డి చెన్
వాడిగ విద్యుత్కాంతులు
పో డి గ నట మె ఱ యు చుండి యోడల లోనన్ .
లక్ష్మీదేవి గారూ మీ చమత్కార పూరణ బాగుంది.
రిప్లయితొలగించండివేడుకలు జరుగు చోటున
కూడిన యువకులు, సొబగుల కొమ్మల గనగా
నేడే దీపావళియని
రిప్లయితొలగించండితోడగు స్నేహితులరాకతోనమతాబుల్
వేడుకలు జరుపువేళల
చూడుఁడదే పట్ట పగలు చుక్కలు మెరెసెన్.
పాడు కాలములయనేకులు
రిప్లయితొలగించండిగోడు నొదిలి ధరణి యందు గూడుమరచీ
కీడులకై ధగధగమన
చూడుఁడదే పట్టపగలే చుక్కలు వొడిచెన్
వేడుక మీరగ సతినే
రిప్లయితొలగించండితోడుగ గొనిపోతి కొనగ తియ్యలి కిం పౌ !
మాడెడు నెండను దిరుగగ
చూడుడ దే పట్ట పగలె చుక్కలు వొ డిచెన్ !
కారణాంత రాలవల్ల ఇప్పుడే చూసాను . ఒక చెడ్డ వార్త విన్నందుకు బాదగా ఉంది .ఇప్పడి కైనా అతగాడు మారి , పిల్లల నైనా ప్రేమగా చూసుకుంటే కొంత బాధను రానురానూ మర్చి పోగలుగుతారు . ఆ భగవంతుడు సర్వదా రక్షణగా ఉండి ఆమె ఆత్మకు శాంతి కలిగించుగాక .
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కనపట్టు’ను ‘కనుపట్టు’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ ప్లానిటోరియం పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
సూర్యగ్రహణ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సూరీడుకు’ అనండి. తెరకలు...?‘తరకలు’ కదా!
*
నాగరాజు రవీందర్ గారూ,
మీరూ సూర్యగ్రహణాన్నే స్వీకరించారు పూరణకు. బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
ఓడలలోని దీపకాంతులతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
దీపావళి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జంగిడి రాజేందర్ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ ప్రయత్నం ప్రశంసనీయం. ‘కాలమున + అనేకులు’ అన్నప్పుడు యడాగమం రాదు. దానిని ‘కాలమున ననేకులు’ అంటే సరి. ‘గోడును + ఒదిలి’ అన్నారు. ‘ఒదిలి’ అనే శబ్దం లేదు. ‘గోడు వదలి’ అందాం. ‘మరచీ’ అనేది వ్యావహారికం. అక్కడ ‘మరచియున్’ అందాం.
ఇప్పుడు ఈ బ్లాగులో పద్యాలను ధారాశుద్ధితో, నిర్దోషంగా వ్రాస్తున్న కవిమిత్రులు కొందరు మొదట్లో మీకంటే ఎక్కువ తప్పులు వ్రాసినవారే. వ్రాయటం కొనసాగిస్తే క్రమక్రమంగా దోషాలు మీరే సవరించుకుంటారు. విజయోస్తు!
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘తియ్యలి కింపౌ’...?
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువుగారికి, పండితనేమాని గురువర్యులకు, మిత్రులందరికి నమస్కారములు. ఇటీవల నా ల్యాప్ టాప్ పనిచేయకపోవుటచే బ్లాగు చూడలేక పోతున్నాను.
మూడదుగుల వామనుడే
చూడగ తానాక్రమించె ముల్లోకములన్
వేడుకగా తలదాల్చెను
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
రిప్లయితొలగించండినేడే సినిమా తారలు
వేడుకగా పట్టణమున వీధుల నడచెన్
మేడెక్కి యరచె యువకులు
"చూడుఁడదే పట్టపగలె చుక్కలు వొడిచెన్"
క్షమిం చాలి " తొయ్యలి " కి బదులు " అలా పడింది .
రిప్లయితొలగించండిశ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
దిట్టవు పద్యరచనమునఁ
బట్టణమున పట్టపగలె పలు తారలఁ జూ
పెట్టిన చక్కని పూరణ
మట్టె ప్రశంసింతు గోలి హనుమచ్చాస్త్రీ!
*
అక్కయ్యా,
అది తొయ్యలికి టైపాటని నా మట్టి బుర్రకు తట్టలేదు సుమా!
రిప్లయితొలగించండి1.
నేడే సూర్య గ్రహణము
వీడెను వెలుగులు జగతిని వేగమె క్రమ్మెన్
నీడలు చిక్కగ నెల్లెడ
చూడుమదే పట్టపగలు చుక్కలు వొడిచెన్
2.నేడెన్ని యబ్బురమ్ములు
చూడమె తలక్రిందులాయె చోద్యములెన్నో
ఓడలు బండ్లాయెను మరి
చూడమదే పట్టపగలు చుక్కలు వొడిచెన్
సంపత్ గారూ,
రిప్లయితొలగించండిగతంలో మీరు ఈబ్లాగుకు పూరణలు పంపి ఉన్నారా? పంపితే మిమ్మల్ని సంపత్ కుమార్ శాస్త్రి గారుగా పొరబడ్డానా? ఇద్దరూ ఒకరే అనుకున్నాను. సందేహం వచ్చి చూస్తే ప్రొఫైళ్ళు వేరువేరుగా ఉన్నాయి. నా మతిమరుపును మన్నించండి...
క్రొత్తవారైతే సంతోషం...స్వాగతం!
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చాలా బాగున్నవి. అభినందనలు.
అన్నట్టు ‘చూడుఁడదే..’ చూడుమదే అయింది. విప్రనారాయణ చిత్రంలోని ‘చూడుమదే చెలియా’ గుర్తుకు వచ్చిందా? :-)
గురువుగారూ 2 వ పాదములో యతి సవరించుచూ
రిప్లయితొలగించండిమూడదుగుల వామనుడే
చూడగ తానాక్రమించె సురలోకములన్
వేడుకగా తలదాల్చెను
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
శంకరార్యా ! ప్రత్యేక ప్రశంసకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅంతా శంకరాభరణ మహిమ...
రిప్లయితొలగించండిశంకరార్యా,మన్నించాలి.సాంకేతిక పొరబాటు వలన మా అల్లుడిగారి (సంపత్కుమార్)జీమెయిల్ లో నా పూరణవచ్చింది.సవరించుకోమని ప్రార్థన. కమనీయం (రమణారావు)
రిప్లయితొలగించండికోడలు చేసిన పచ్చడి
వేడుకతో నారగించి వెక్కుచు పలికెన్
లేడే చంద్రుడు భువిలో
చూడు డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిఆ పద్యాల శైలి చూస్తే సుపరిచితం అనిపించింది. పేరేమో క్రొత్తది. అందువల్ల సందేహం కలిగింది. మీకు నా అభినందనలు.
*
లక్ష్మీ నరసింహ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
త్రాడో పేడో యనుచున్
రిప్లయితొలగించండిక్రీడియె శపధమును జేయ కృష్ణుని చక్ర
మ్మాడగ సూర్యుని క్రమ్ముచు:
"చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్!"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆడుచు పాడుచునహ! పూ
రిప్లయితొలగించండిబోడులు లోకసభ లోన పొందుగ జేరన్
పోడిమితో వేడిమితో
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్
చుక్కలు = stars