14, అక్టోబర్ 2012, ఆదివారం

పద్య రచన - 141

 కృష్ణశాస్త్రి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఆకులో నాకు వైతివి యడవి దాగి
    పూవులో బూవువైతివి పులక రించి
    కొమ్మలో గొమ్మ వైతివి చెమ్మగిల్లి
    యొదిగి నునులేత రెమ్మవై ముదము గాను !


    ఇరుల గుసగుసల్ భావము లెరుక నీకు
    నలరు బాస సౌరభములు దెలియు నీకు
    నీవె శుక్ల పక్షపు గ్లౌవి నిశ్చయముగ
    ‘కృష్ణ పక్షము ' వ్రాసిన కృష్ణ శాస్త్రి !


    ఉల్లాసము హృది నెగయన్
    మల్లీశ్వరి పాటలన్ని మదినే దోచున్ !
    అల్లన గేయము లల్లుట
    జెల్లును నీకున్ గవివర ! చిత్ర మనంగ


    “జయ జయ జయ ప్రియ భారత
    జయ మమ్మా దివ్య ధాత్రి ! " జయ గీతమునన్
    అయమున భారత మాతను
    నయముగ గీర్తించి తీవు నలుగురు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి
  2. సినిమా రంగమునందు గేయకవియై శృంగార భావాఢ్య గే
    యనికాయంబు రసప్రశస్తముగ శ్రావ్యంబైన రాగాలకై
    జన సామాన్య వినోద కారకముగా శబ్దార్థ సంపత్తితో
    బొనరించెన్ మన కృష్ణశాస్త్రి యని సమ్మోదమ్మునున్ దెల్పెదన్

    రిప్లయితొలగించండి
  3. మూడవ పద్యంలోని నాలుగవ పాదంలో సవరణ :

    .....చిత్ర మనంగన్ !

    రిప్లయితొలగించండి
  4. చిత్ర రంగము నందున చేయి ద్రిప్పి
    పాట లెన్నియొ వ్రాసిన పటిమ నీ దె
    కృష్ణ పక్షపు చంద్రుడ ! కృష్ణ శా స్త్రి !
    మరల రావయ్య మమ్ముల మరులు గొల్ప .

    రిప్లయితొలగించండి


  5. "కృష్ణ" పక్షము నుండ గా కృష్ణ శాస్త్రి
    చూచితిమి చిత్ర జగతిని శుక్లపక్ష
    మదియ నేడేమొ జూడగా మాసి పోయె
    భావ కవితల పూచెట్టు వాడి పోయె.

    రిప్లయితొలగించండి
  6. రెండవ పద్యంలో మూడవ పాదమున సవరణ :

    నీవె శుక్ల పక్షపు గ్లౌవి.. = నీవె శుక్ల పక్ష శశివి...

    రిప్లయితొలగించండి


  7. భావ కవితా ప్రతీకగా భాసురమ్ము
    గా వెలింగె దేవులపల్లి కావ్యసరళి
    నవ్య కవితా రచనకు బ్రమాణికముగ
    నాత డాంధ్రమ్ము నందు బ్రఖ్యాతి గాంచె.

    కృష్ణ పక్ష తిమిర సంకీర్ణ భావ
    మూర్వశీ కింకిణీ నినదోజ్వలమ్ము
    దుర్భరప్రవాస జనిత దుఃఖ సాంద్ర
    మతని కావ్య మొక్కొక్కటి యమరమాయె.

    రిప్లయితొలగించండి


  8. భావ కవితా ప్రతీకగా భాసురమ్ము
    గా వెలింగె దేవులపల్లి కావ్యసరళి
    నవ్య కవితా రచనకు బ్రమాణికముగ
    నాత డాంధ్రమ్ము నందు బ్రఖ్యాతి గాంచె.

    కృష్ణ పక్ష తిమిర సంకీర్ణ భావ
    మూర్వశీ కింకిణీ నినదోజ్వలమ్ము
    దుర్భరప్రవాస జనిత దుఃఖ సాంద్ర
    మతని కావ్య మొక్కొక్కటి యమరమాయె.

    రిప్లయితొలగించండి


  9. భావ కవితా ప్రతీకగా భాసురమ్ము
    గా వెలింగె దేవులపల్లి కావ్యసరళి
    నవ్య కవితా రచనకు బ్రమాణికముగ
    నాత డాంధ్రమ్ము నందు బ్రఖ్యాతి గాంచె.

    కృష్ణ పక్ష తిమిర సంకీర్ణ భావ
    మూర్వశీ కింకిణీ నినదోజ్వలమ్ము
    దుర్భరప్రవాస జనిత దుఃఖ సాంద్ర
    మతని కావ్య మొక్కొక్కటి యమరమాయె.

    రిప్లయితొలగించండి
  10. కృష్ణశాస్త్రి భావగీతాల ఘనశాస్త్రి
    శేఖరించె జీవి స్వేచ్ఛకోరి
    పలుకలేడు నోట పలికించగల డాత
    డద్భుతమ్ము వ్రాత నాంధ్రషెల్లి!

    రిప్లయితొలగించండి
  11. ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
    మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
    పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
    రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.

    రిప్లయితొలగించండి
  12. ఆనవ్వుతెల్లదనమున్
    ఈనాటికివారికవిత
    లెఱుకపరుచవే?
    నానావిధగీతమ్ములఁ
    దేనెలఁగురిపించెనలర
    దేవులశాస్త్రే!

    రిప్లయితొలగించండి