4, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 841 (వినవలదయ్య దౌష్ట్యమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారత మెల్లకాలమున్.
ఈ సమస్యను సూచించిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. అయ్యా!
    ఈ సమస్య పాదములో చివర గణభంగము కానవచ్చుచున్నది. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    ధన్యవాదములు. సవరించాను.

    రిప్లయితొలగించండి
  3. వినవలదయ్య దౌష్ట్యమును బెంచెడు భారత మెల్లకాలమున్
    గనుమిదె యంచు దుర్మతులు జ్ఞానవిహీనులు గీత గూర్చి చే
    సిన విపరీత వాదములు చెల్లక పోయెను న్యాయ సీమలో
    వినుడు వివేక సంపదల బెంచెడు భారత మాదరమ్మునన్

    రిప్లయితొలగించండి
  4. వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారత మేల్లకాలము' న్ననుచునుదుష్ప్రచారమునుఅన్యమతస్తులు జేయుచున్ద్రు ఈ
    యనుపమ గ్రంథరాజమతియద్భుత పంచమ వేదమంచు స
    జ్జనతతి విశ్వమంతటను సంస్తుతి జేసిరి, శంక వీడుమా !

    రిప్లయితొలగించండి

  5. కనవలదయ్య దుర్మతుల కర్మము లెప్పుడు; చెప్పుచుండఁగన్
    వినవలదయ్య దౌష్ట్యమును! బెంచెడు భారత మెల్ల కాలమున్
    మనహృదయాబుధిన్ మనఁగ మంచిని; ధీరగుణమ్ము నెంతయున్!
    వినుఁడు, వినుండు భారతము విద్యలకెల్ల సువిద్య యిద్దియే!

    రిప్లయితొలగించండి
  6. కనుగొనలేకమర్మమును,కావ్యమపార్థము చేసుకొన్నయున్,
    మనమున నేమతంబయిన మానవులందరి శ్రేయమెంచునన్
    గుణమదిలేని మూఢులందరును గూసెడు కూతలఁదెల్పు వాక్యమే
    "వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారతమెల్లకాలమున్!

    రిప్లయితొలగించండి
  7. కనుగొనలేకమర్మమును,కావ్యమపార్థము చేసుకొన్నయున్,
    మనమున నేమతంబయిన మానవులందరి శ్రేయమెంచునన్
    గుణమదిలేని మూఢులందరును గూసెడు కూతలఁదెల్పు వాక్యమే
    "వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారతమెల్లకాలమున్!

    రిప్లయితొలగించండి

  8. మనమున పాపచింతనల మానక నిల్పెడి మాట లెవ్వియున్,
    జనగణమందు నైతికత సాత్త్వికభావము లుప్త మైనచో,
    మనుజుల ధర్మవర్తనపు మార్గము నెయ్యది చూపు నెప్పుడున్
    వినవలదయ్య; దౌష్ట్యమును బెంచును; భారత మెల్లకాలమున్.

    రిప్లయితొలగించండి
  9. ఘనమగు భారతంబుయన కౌరవ పాండవ యుద్ధమే కదా !
    తనయులు యన్నదమ్ములును తన్నుకులాడిన వైనమే కదా !
    అనయము నగ్రజానుజుల కంతరమందున ప్రేమ లేనిచో
    వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారతమెల్లకాలమున్.

    రిప్లయితొలగించండి
  10. వినవల దయ్య దౌష్ట్యమును బెంచును భారత మెల్ల కాలమున్
    అనునది హాస్యమే యనగ నమ్ముట కెయ్యది నిక్కమౌ ధరన్
    వినగను భారతం బనగ వీనుల విందగు కావ్య మెంచగన్
    తినగను వేము సైతమును దియ్యగ నుండదె మోద మందగన్ !

    రిప్లయితొలగించండి
  11. వినవల దయ్య, దౌష్ట్యమును బెంచును భారత మెల్ల కాలమున్
    యనుచును చెప్పుచుండ్రు తమ కన్నియు దెల్సిన వారివోలె నే
    మనగను వీలు లేదు మరి మానరు కొందరు, నారికేళమున్
    తినగను రాక పీచులని తిక్కగ జెప్పెడు వారు మూఢులే.

    రిప్లయితొలగించండి


  12. '' విన వలదయ్య దౌస్ట్యమును బెంచును భారత మెల్ల కాలమున్ ''
    అనుచును గొంద రాధునికు లజ్ఞత చేత విమర్శ జేసినన్
    ఘనమగు నీతిబోధలును,గష్ట సహిష్ణుత ,దానశీలమున్
    గనుగొన శాంతి,ధర్మమును,గర్మయె యందలి మూలసూత్రముల్.

    రిప్లయితొలగించండి


  13. '' విన వలదయ్య దౌస్ట్యమును బెంచును భారత మెల్ల కాలమున్ ''
    అనుచును గొంద రాధునికు లజ్ఞత చేత విమర్శ జేసినన్
    ఘనమగు నీతిబోధలును,గష్ట సహిష్ణుత ,దానశీలమున్
    గనుగొన శాంతి,ధర్మమును,గర్మయె యందలి మూలసూత్రముల్.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ, నారికేళమున్
    తినగను రాక, తో పోల్చటం చక్కగా ఉంది.

    వినవల దయ్య, దౌష్ట్యమును బెంచును భారత మెల్ల కాలమున్
    యనుచును చెప్పుచుండ్రు తమ కన్నియు దెల్సిన వారివోలె నే

    రిప్లయితొలగించండి
  15. (సరదాకు మాత్రమే)

    సహదేవులు సహనముగా
    బహుమారులు పోస్టు చేయు బ్లాగున పోస్టుల్
    సహనముతో చదువు వారు
    మహనీయులు మరి భరించు మా మాస్టారే !

    రిప్లయితొలగించండి
  16. మారెళ్ళ వామనులు బహు
    మారులు పోస్టులను వ్యంగమాటల తూటా
    దూరెన్ మనసున్, సత్యము
    సారుకుఁదెలియున్ దెలుపును సారును గోరన్
    (సరదా పరదా తొలగున్)

    రిప్లయితొలగించండి
  17. జనహితమెల్ల వేళలను సంయమి గాథల జెప్పు భారతమ్
    మనముల నన్ని రీతులను మాలిమి సంస్కరణంబు జేయునే!
    ’శునకము లెట్టు నేర్చు బహు సుందర కావ్యపు నవ్యరీతులన్?
    వినవలదయ్య, దౌష్ట్యమును బెంచును’; భారత మెల్లకాలమున్
    ఘనమగు సంస్కృతీగరిమ గౌరవమందగ నిల్పియుండెనే.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సహదేవుడు గారికి నమస్సులు.
    మరియు మన్నింప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులకు నమస్కృతులు.
    మళ్ళీ నిన్నటి నుండి అస్వస్థత. జ్వరం, ఒంటి నొప్పులు (ముఖ్యంగా నడుము నొప్పి). అందువల్ల మీ పూరణలను, పద్యాలను విడివిడిగా ప్రస్తావించి వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
    ఈ నాటి సమస్యకు చక్కని పూరణలను పంపిన
    పండిత నేమాని వారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సహదేవుడు గారికి,
    మారెళ్ళ వామన కుమార్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి,
    లక్ష్మీదేవి గారికి (లీవ్ అయిపోయినట్టుంది. మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు)
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు, గురువుగారికి జ్వరము త్వరగా తగ్గాలని దేవుని ప్రార్థిస్తూ
    -----
    జన వన మందు జీవనము స్వార్థము నిండెను సాధు యోగిలా
    గన వలదయ్య పెద్దలను కష్టము బంచును మానవాళికిన్
    విన వలదయ్య నీతులను, విజ్ఞత నాశన మొందు మెల్లగా
    తనయుల శాంతికై ధనము దానము జేయును వారి బల్కులన్
    విన వలదయ్య దౌష్ట్యమును బెంచును , భారత మెల్ల కాలమం
    దున నవనీత మై మనసు దోచును , మార్గము జూపు నింపుగా

    రిప్లయితొలగించండి
  21. ఘనుడగు శిక్షకుండు కడు ఘాటుగ కోరెను వింత దక్షిణన్
    కనుచును చీర దోచుటను గౌరవనీయులు స్తబ్ధులైతిరే
    రణమున ధర్మవర్తనుడు లాఘవ రీతిని బొంకులాడెనే
    వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారత మెల్లకాలమున్

    రిప్లయితొలగించండి