29, అక్టోబర్ 2012, సోమవారం

పద్య రచన - 144

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. లేగ దూ డలు దల్లులు వేగిరముగ
    ద్రాగు చుండెను జూడుడు ద ప్పి కతన
    బోరు పళ్ళెము నందలి నీరము ను, జ
    వాను దోడు చుండెను గద వాటి కొఱకు .

    రిప్లయితొలగించండి
  2. అతి పిపాస తోడ పశువు లలమటించు
    చుండగ నెడారిలో నొక్క సుజను డంత
    బోరు నీటిని తోడుచు పోసి జలము
    దాహమును దీర్చె నరరూప దైవమతడు

    రిప్లయితొలగించండి

  3. కఠినచిత్తులు సైనికుల్ గరుణలేని
    వార లనుచు భావింతురు ప్రజలు; కాని
    మానవత్వము పరిమళింపఁగఁ బశువుల
    దాహమును దీర్చుచున్నాఁడు దయను జూపి.

    రిప్లయితొలగించండి
  4. పాలిచ్చి మనుజమాత్రుల
    పాలించెడిసౌరభేయిప్రాబల్యములన్
    ఆలించి గౌరవింపుము
    ఆలలితామాతరూపమవనిన్ గనరే.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారు,

    మీ నిర్వహణలో మేము పాల్గొన్న అంతర్జాల అష్టావధానము గురించిన ఒక సంపాదకీయము ( జ్యోతిగారిచే ) ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమైనది. చాలా గర్వంగా ఉన్నదండీ.

    మన:పూర్వక ధన్యవాద శతం.
    http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/29102012/4

    రిప్లయితొలగించండి
  6. తొడలు విరుగు నట్లు పొలము దున్ని నీరు
    లేక గొంతు లెండుచు నుండ; లేచి వచ్చె
    ప్రాణములు మాకు యిపుడు నీరమును ద్రావ ;
    సైనికుడ ! దయాళువు నీవు చల్ల గుండు.

    రిప్లయితొలగించండి
  7. తిండి పెట్టక పోయిన పిండు కొనుచు
    పాలు పెరుగుల నమ్ముకు బ్రతుకు జగతి
    కడకు జలమిచ్చి నింపగ కరుణ జూపి
    జాలి లేనట్టి జనులందు మేలు గాదె !

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులారా,
    పశువుల దాహార్తిని పోగొడుతున్న సైనికుని చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను పంపిన
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యంలో ‘మాకు + ఇపుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మా కిపు డిటు’ అందాం.

    రిప్లయితొలగించండి
  9. మనుజులఁజంపెడు కర్కశు
    లనుకొంటిని'యన్న'లనంగ! నావుల కచటన్
    తనచేత బోరు నీరము
    సునిశితుడై త్రాప నేను జోతల నిడెదన్!

    రిప్లయితొలగించండి
  10. ఆలము చేయు 'జవానుడ '
    పాలన గతి చెదరకుండ బరగెద వయ్యా !
    ఆలపు మందల దప్పిని
    పాలనొసంగగ నిజముగ బాపితివయ్యా !

    రిప్లయితొలగించండి
  11. ఆలము చేయు 'జవానుడ '
    పాలన గతి చెదరకుండ బరగెద వయ్యా !
    ఆలపు మందలు జేరగ
    పాలనొసంగగ పిపాస బాపితివయ్యా !

    రిప్లయితొలగించండి
  12. సవరణ :

    తొడలు విరుగు నట్లు పొలము దున్ని నీరు
    లేక గొంతు లెండుచు నుండ; లేచి వచ్చె
    ప్రాణములు మా కిపు డిటు నీరమును ద్రావ ;
    సైనికుడ ! దయాళువు నీవు చల్ల గుండు.

    రిప్లయితొలగించండి