రారా - పోరా - తేరా - సారా
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
రారాజుఁ జేరి తమ్ముల
రిప్లయితొలగించండిపోరాటమునందుఁ జంపు ముప్పు విడువు మిం
తే రాధేయా! నీ మన
సారా యోచించి నిర్ణయమ్మును గొనుమా.
రారా భీమా! నేనే
రిప్లయితొలగించండిపోరాటమునందు గెలిచి పొగరడగింతున్
తీరా యింతే రా గను
సారాంశము, శౌరి మాయఁ జక్క బ్రతికెదో!
రారాజు, పాండవు లకట!
రిప్లయితొలగించండిపోరాటముఁ జేయ; శౌరి పూనికతో, నా
తే రారోహించియు, వచ
సా, రాజ్యము గెల్చి, ధర్మజాదుల కొసఁగెన్!
పోరా ! దుష్టుడ విడువుము
రిప్లయితొలగించండిరారా ! కన్నయ్య నన్ను రక్షింపంగన్ !
తేరా ! చీరలు యని మన
సారా పాంచాలి దలచి చక్రిని వేడెన్ !
రారాజు భీ మ సే నులు
రిప్లయితొలగించండిపోరాటము సేయు చుండ పుర హరుడ పుడున్
సా రా నిలమును జూ తును
తే రా పుము మాత ల య్య !తిరముగ నిచటన్ .
ఔరా! రాజ్యము దోచినావు కద మాయాద్యూతమే యాడి పో
రిప్లయితొలగించండిపో రామామణి నీడ్వజేసితి సభన్ మున్నీవు నద్దానికిం
తేరా శాస్తి యటంచు భీముడనిలో తీవ్రమ్ముగా మోది కా
సారాంతస్థు సుయోధనున్ దరుముచున్ జంపెన్ మహా క్రుద్ధుడై
రారాజు సోదరుల బిలిచి
రిప్లయితొలగించండిసారాంశము దెలిపి నలుదె సల కంపెన్ !
పోరాడి గెలిచి రండని
తేరా విజయమ్ము మనదె ధీరత్వము నన్ !
గురువులకు నమస్కృతులు నాకు ఒక సందేహము " త " గణము తా రా జ ' అనగా రెండు గురువులు ఒక లఘువు కదా ! మరి ఇంకొక లఘువు అనగా "యామాండవి " సారాంసము " ఇలా చివర మరియొక లఘువు గాని గురువు గాని ఉండ వచ్చునా ? ఇక కందము నందు రెండవ పాదము , రెండవ గణము జగణము ఉండ వచ్చునా ? దయచేసి తెలుప గలరు
రారాజా!విను నాదు మాటలిక రాజ్యమ్ము రక్షింపగా
రిప్లయితొలగించండిపోరాటమ్మును జేయకున్న సుఖముల్ బొందేరుగా!నా మన
స్సారాటమ్మును జెందుచుండెనిక మీ సంధిన్ గుదుర్పంగ పో
తే, రాదీ తరుణమ్ము పంచు సగమున్ ధీశాలి కౌంతేయుకున్.
శ్రీమతి రాజేశ్వరి గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఅమ్మా!
మీ ప్రశ్నలకు సమాధనములు:
(1) తగణము - గురువు గురువు లఘువు అనే 3 అక్షరములతో మాత్రమే యుంటుంది.
(2) కంద పద్యములో 1వ పాదములో (3) + 2వ పాదములో(5) కలిసి 8 గణములు ఉండును. ఇందలి 1, 3, 5, 7 గణములు జగణము ఉండరాదు. అనగా 2వ పాదములోని 2వ గణము జగణము ఉండరాదు.
స్వస్తి.
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి శుభాశీస్సులు.
మీరు పద్య విద్యలో శ్రద్ధ చూపించు చున్నందులకు అభినందనలు. సులక్షణసారము అనే పుస్తకము మీరు చదివితే చాలును. పద్యముల తీరు బాగుగా అలవడుటకు పురాతన కవుల గ్రంథములు నిత్యము చదువు చుండవలెను. అప్పుడు వాటిలోని పద్య నిర్మాణము మీకు అనుభవములోనికి వచ్చును. నన్నయ, తిక్కన, పెద్దన, పోతన, శ్రీనాథుల పద్యములను బాగుగా అలవరచుకొనండి.
స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు
పోరాదు కృష్ణ జోలికి
రిప్లయితొలగించండితేరా దగదోయి సభకు ధృతరాష్ట్ర ! సుతున్
రారాజు నాపవలె మన-
సారా యోచింపు మనెను సంజయు డంతన్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కీచకుని యింటికి వెళ్ళి సారాయి తెమ్మన్నసుధేష్ణతో ద్రౌపది :
01)
_______________________________
పోరాని పరుల యింటికి
సారా తెమ్మని పనుచుట - సరి గాదమ్మా !
రారాపు కలుగు నాకట
వారించనిచో మిగులును - వంతే రాణీ !
_______________________________
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘తేరా’.. ‘తీరా’ అయింది. టైపాటా?
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చీరలు + అని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తేరా చీరలిపుడు మన...’ అంటే సరి.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
శార్దూల వృత్తంలో మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు,
రాజేశ్వరి గారి, లక్ష్మినారాయణ గారి సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘నలుదెసలకున్ బంపెన్’ అంటే సరి.
మీ సందేహానికి నేమాని వారి వివరణ చూసారు కదా!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో టైపాటు కావచ్చు.. గణదోషం..‘మాటలిక నీ రాజ్యమ్ము’ అంటే సరి.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
చక్కని సన్నివేశాన్ని ఎన్నుకున్నారు పూరణకు. చాలా బాగుంది. అభినందనలు.
రారా సన్నుతి మునుగొని
రిప్లయితొలగించండిపోరాడగ శక్తి లేని పోలతిగ వేడన్
తేరా వలువలు నీ మన
సారా తెమ్మిచ్చి గాచ సాక్షిగ కృష్ణా