శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు ==========*======== కంస మామ బెట్ట కడివెడు కష్టముల్ దండ యాత్ర జేసె మొండి గాను మాయ లెల్ల జూపి మామపై బడి జంపె భక్త జనుల గాచ పరమ పురుష |
ఆర్యా! పెద్దలందరికి నమస్కారములు, హర్యానా నుండి ఆంధ్రప్రదేశ్(విజయనగరం జిల్లాకు) ట్రాన్స్ ఫర్ అయిన సందర్భంగాను, ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో లేనికారణంగాను, ఉద్యోగరీత్యా కార్యభారంవల్ల తీరిక లేని కారణంగాను, గత రెండు నెలలుగా శంకరాభరణం బ్లాగుకు దూరంగా ఉండవలసి వచ్చింది. క్షమించ ప్రార్థన.
ఖలుడా! చెల్లియు బావయన్న వరుసల్ కర్తవ్యమున్ వీడి నీ బలగర్వంబున వారి బట్టి నఘుడా బంధించి బాధింతువే పలు చిన్నారుల హత్య జేసి తివి నీప్రాణంబు పై తీపిచేన్ బలి సేతున్ నిను నాదుమోదనముతోన్ పాపత్ముడా కంసుడా
స్థిరమా జీవిత మెందుకీ మదము నీ చిత్తంబుచే నాడ దూ పిరి యా యాయువు కై సహోదరిని , ఛీ ! పీడింతువే కంసుడా మరణంబన్నది తప్పదెల్లరికి నీ మాత్సర్యముల్ నేటితో సరి నీ పాపములంతమయ్యె నసురా జన్మాంతమున్ నేనురా
శ్రీ సరస్వత్యై నమః: అందరికీ శుభాశీస్సులు. అభినందనలు.
అమ్మా రాజేశ్వరి గారు: మీ పద్యము 2వ పాదములో ఒక లఘువు ఎక్కువ యున్నది. యుండియుకి బదులుగా యుండి అని యుంచితే సరిపోతుంది. నాగరాజు రవీందర్ గారు: మీ పద్యము కృష్ణలీలలను వర్ణించుచు చాల బాగుగనున్నది.
శ్రీ సహదేవుడు గారు: మేనమామ యొక్క హింసలకి తప్పుకొని వానికి చరమాంకము పాడిన మీ పద్యము ఉత్తమముగా నున్నది.
శ్రీ సరస్వత్యై నమః: అందరికీ శుభాశీస్సులు. అభినందనలు.
అమ్మా రాజేశ్వరి గారు: మీ పద్యము 2వ పాదములో ఒక లఘువు ఎక్కువ యున్నది. యుండియుకి బదులుగా యుండి అని యుంచితే సరిపోతుంది. నాగరాజు రవీందర్ గారు: మీ పద్యము కృష్ణలీలలను వర్ణించుచు చాల బాగుగనున్నది.
శ్రీ సహదేవుడు గారు: మేనమామ యొక్క హింసలకి తప్పుకొని వానికి చరమాంకము పాడిన మీ పద్యము ఉత్తమముగా నున్నది.
వందే వృష్ణికులైక భూషణవరం వందే కృపాసాగరం
రిప్లయితొలగించండివందే భక్తమనోహరం శుభకరం వందే వ్రజారాధితం
వందే రామసహోదరం భవహరం వందే మునీంద్రస్తుతం
వందే కంసహరం పరాత్పరతరం వందే జగద్రక్షకం
కంస మామ నీకు కాలమ్ము మూడెను
రిప్లయితొలగించండిహింస బెట్టితివి గదెల్ల వారి
నిన్ను జంపి నేడు నీదు తండ్రిని జేతు
మగధ దేశ పతిగ మరల నేను.
మేనమామని జూ డక మృతుని జేసి
రిప్లయితొలగించండియవని బ్రజలను బ్రోచిన యాద వేంద్ర!
దుష్ట శిక్షణ మఱియును శిష్టు బ్రోవ
యవత రించితి వీ వయ యవని యందు .
చెల్లియ దేవకీసతిని, సిగ్గరి, నూత్నవధూటినీతడే
రిప్లయితొలగించండితల్లిని జంపబూనెనని దల్చిన కోపము తోడ నప్పుడా
నల్లని వాడు కృష్ణుడదె నాగని తోడ్కొని వచ్చి కంసునిన్
చెల్లగ జేసె, ప్రాణముల జివ్వున దీసెను ధైర్యవంతుడై.
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
రిప్లయితొలగించండి==========*========
కంస మామ బెట్ట కడివెడు కష్టముల్
దండ యాత్ర జేసె మొండి గాను
మాయ లెల్ల జూపి మామపై బడి జంపె
భక్త జనుల గాచ పరమ పురుష |
అష్టమమగు నవతారం
రిప్లయితొలగించండిబష్టమ గర్భమున బుట్టి యమ్మకు కృష్ణా!
అష్టమి రాత్రిని పితరుల
కష్టములను బాపితయ్య కంసవిదారీ!
నీ నక్షత్రము రోహిణి
కాన కతము మేనమామ కంసుని మృతికిన్
నీ నక్షత్ర ప్రభావము
కాననగును నేడును భువి కంసవిదారీ!
పలుయత్నమ్ము లొనర్చెను
ఖలుడు కదా మామ నిన్ను కడతేర్చుటకై
బలమగు గ్రుద్దులతో వ్ర
క్కలు జేసితి వాని తలను కంసవిదారీ!
దేవా! యాదవవంశమండన! హరీ!దివ్యస్వరూపా! భవత్
రిప్లయితొలగించండిసేవాభాగ్యము గల్గజేసి యెపుడున్ క్షేమంబులం గూర్చుచున్
భావస్థైర్యము సత్కృతిన్నిలుపుచున్, భాగ్యంబు లందించుచున్
గావంగావలె భక్తకోటిని సదా కంసాంతకా! కేశవా!
ఆర్యా!
రిప్లయితొలగించండిపెద్దలందరికి నమస్కారములు,
హర్యానా నుండి ఆంధ్రప్రదేశ్(విజయనగరం జిల్లాకు) ట్రాన్స్ ఫర్ అయిన సందర్భంగాను, ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో లేనికారణంగాను, ఉద్యోగరీత్యా కార్యభారంవల్ల తీరిక లేని కారణంగాను,
గత రెండు నెలలుగా శంకరాభరణం బ్లాగుకు దూరంగా ఉండవలసి వచ్చింది. క్షమించ ప్రార్థన.
ఖలుడా! చెల్లియు బావయన్న వరుసల్ కర్తవ్యమున్ వీడి నీ
రిప్లయితొలగించండిబలగర్వంబున వారి బట్టి నఘుడా బంధించి బాధింతువే
పలు చిన్నారుల హత్య జేసి తివి నీప్రాణంబు పై తీపిచేన్
బలి సేతున్ నిను నాదుమోదనముతోన్ పాపత్ముడా కంసుడా
స్థిరమా జీవిత మెందుకీ మదము నీ చిత్తంబుచే నాడ దూ
పిరి యా యాయువు కై సహోదరిని , ఛీ ! పీడింతువే కంసుడా
మరణంబన్నది తప్పదెల్లరికి నీ మాత్సర్యముల్ నేటితో
సరి నీ పాపములంతమయ్యె నసురా జన్మాంతమున్ నేనురా
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
అభినందనలు.
శ్రీ మిస్సన్న గారు: కంస మామకు కాలము మూడింది అన్నారు. ఉత్తమమైన పద్యము.
శ్రీ సుబ్బా రావు గారు: మేన మామ అని చూడక కంసుని మృతికి కారణమైన కృష్ణుని గూర్చి పేర్కొనినారు. పద్యము చాల బాగున్నది.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: నల్లని వానిపై చక్కని మాల అల్లేరు. ఉత్తమమైన రచన.
శ్రీ వరప్రసాద్ గారు: పద్యము బాగున్నది. 4వ పాదము ఇలాగ మార్చుదాము:
భక్త జనుల గావ భద్రమూర్తి.
శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు: కంసాంతకుని స్తుతించుచూ చెప్పిన పద్యము బాగున్నది - ప్రశంసనీయము.
శ్రీ కళ్యాణ్ గారు: 2 మత్తేభములు కృష్ణుడు మామను కూల్చుతూ చెప్పిన మాటలుగా పేర్కొనినారు. ప్రశంసనీయముగా నున్నది.
స్వస్తి.
కంస మామను జంపగ కక్ష గట్టి
రిప్లయితొలగించండిబాలుడై యుండియు కన్నయ్య భయము లేక
దుష్ట సం హార మొనరించె కష్ట పడక
తల్లి దండ్రుల పాలిట తనయు డనగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపల్లాండు పల్లాండు , పల్లాయి రత్తాండు
రిప్లయితొలగించండిపల్కోడి నూరాయిరం
మల్లాండ దింథోల్ మణివణ్ణ !
ఉన్‌సెవ్వడి సెవ్వి తిరుక్కాప్ !
= ఓ మహాబాహో ! చాణూర కంస మర్దనా ! నీ చరణారవింద దివ్య సౌందర్యము కలకాలం నిలిచి యుండు గాక !
చంటిపాపగ పూతనన్ జంపితివి ! వ
ధించితివి శకటాసురునిన్ జిరుతగ !
అనఘ ! చాణూర కంస మర్దనము జేసి
గాచితివి వాసుదేవ ! లోకముల నెల్ల.
ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిమేన మామ లెపుడు మేలుఁగోరెదరని
రిప్లయితొలగించండిసర్వజనులుజెప్పుసత్యమైన
కంసమామపెట్టుహింసకు చరమాంక
మనగఁబాలకృష్ణుడణచిజంపె!
మనుమనిగా తాతను గని
రిప్లయితొలగించండిమనుమని రాజుగ మగధకు, మామను జంపెన్
మనుజుల గీతలు మార్చగ
ఘన గీతా బోధ జేసె కంసారి కదా !
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిఅందరికీ శుభాశీస్సులు. అభినందనలు.
అమ్మా రాజేశ్వరి గారు:
మీ పద్యము 2వ పాదములో ఒక లఘువు ఎక్కువ యున్నది. యుండియుకి బదులుగా యుండి అని యుంచితే సరిపోతుంది.
నాగరాజు రవీందర్ గారు:
మీ పద్యము కృష్ణలీలలను వర్ణించుచు చాల బాగుగనున్నది.
శ్రీ సహదేవుడు గారు:
మేనమామ యొక్క హింసలకి తప్పుకొని వానికి చరమాంకము పాడిన మీ పద్యము ఉత్తమముగా నున్నది.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
తాతకు మనుమడు రాజ్యమునిస్తూ మనుమని చెప్పుట బగున్నది - సొగసైన భావము.
స్వస్తి.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిఅందరికీ శుభాశీస్సులు. అభినందనలు.
అమ్మా రాజేశ్వరి గారు:
మీ పద్యము 2వ పాదములో ఒక లఘువు ఎక్కువ యున్నది. యుండియుకి బదులుగా యుండి అని యుంచితే సరిపోతుంది.
నాగరాజు రవీందర్ గారు:
మీ పద్యము కృష్ణలీలలను వర్ణించుచు చాల బాగుగనున్నది.
శ్రీ సహదేవుడు గారు:
మేనమామ యొక్క హింసలకి తప్పుకొని వానికి చరమాంకము పాడిన మీ పద్యము ఉత్తమముగా నున్నది.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
తాతకు మనుమడు రాజ్యమునిస్తూ మనుమని చెప్పుట బగున్నది - సొగసైన భావము.
స్వస్తి.
రిప్లయితొలగించండియదు కులాంభోధి చంద్ర! ఘనాభ దేహ!
రాసకేళీ విలోల! సువ్రజ కిశోర!
కృష్ణ! గిరిధర! నరసఖ! కేశవ! హరి!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
పార్థసారథి! మురహంత! వాసుదేవ!
శ్యామ సుందర! శకటారి! చక్రి! వృష్ణి!
వేణుధర! శౌరి! బకవైరి! విశ్వరూప!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
నరక హంతక! వృషనాశ! నంద తనయ!
ద్రౌపదీ మాన రక్షక! తాత తాత!
మానినీ వస్త్ర చోర! పద్మాక్ష! దేవ!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
కంసాంతకుడైన శ్రీకృష్ణునిపై మధురమైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
వరప్రసాద్ గారికి,
హరి వేంకట సత్యనారయణ మూర్తి గారికి,
కళ్యాణ్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
నాగరాజు రవీందర్ గారికి,
సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గుండు మధుసూదన్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
మిత్రుల పద్యాలను విశ్లేషించిన శ్రీ నేమాని వారి సహృదయతకు కృతజ్ఞతాంజలి.