18, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 852 (కొమ్ములు జనియించెఁ గనుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

27 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఉదయం సమస్య ఇచ్చి బయలుదేరాలనుకుంటే కరెంటు లేదు. హైదరాబాద్ చేరుకోగానే ఏదైనా నెట్ సెంటర్‌నుండి సమస్యను పోస్ట్ చేయాలనుకున్నాను. కానీ ఆ సమయంలో అక్కడా కరెంట్ లేదు. నా పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. ఇక అప్పుడు సమస్య ఇవ్వడమేమిటని ఇవ్వలేదు.
  నిరుత్సాహపడిన కవిమిత్రులు మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 2. కొమ్ములు అంటే తన ప్రతిభ వలన లభించిన కీర్తి ప్రతిష్ఠలు అనే అర్థములో చేసిన పూరణను చూడండి:

  సొమ్ములు సుగుణములు మరియు
  కొమ్ములనగ ప్రతిభ తెచ్చు గొప్ప యశము తే
  జమ్మున క్రీడల నలరగ
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై

  రిప్లయితొలగించండి
 3. పాతకాలంలో "మగబిడ్డకి తల్లిఅయ్యేసరికి కొమ్ములు మొలిచాయి చూడండి" అనేవారు. ఆ నేపధ్యంలో:
  అమ్మలు కార్గురు కొమరితె
  లిమ్ముగ మగబిడ్డపుట్టె నేడవ తూరిన్
  అమ్మగ బిడ్డను కనగా
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై!

  రిప్లయితొలగించండి
 4. పెళ్ళి పీటల మీద మాయాబజార్ లో ఉత్తరకుమారుడు
  అమ్మాయో! రాక్షసియో!
  అమ్మో!నాన్నో!క్షణమున హరివలె నట వ్యా
  ఘ్రమ్మువలె దోచె నిత్తరి
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై!

  రిప్లయితొలగించండి
 5. తుమ్మెదవలె తన కురులన్
  గొమ్మొక్కతి బోడి తలను కోర్కొని పలు తై
  లమ్ములు వాడగ గేశపు
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి

 6. ఇమ్ముగ మా లేదూడకు
  కొమ్ములు జనియించె, గనుడు గోమలి తలపై
  రెమ్మల వలె నేర్పడియెను
  వమ్ముగ మఱి యాముదమ్ము వాడుట చేతన్.

  రిప్లయితొలగించండి
 7. అమ్మడియందముగంధము!
  సొమ్ములుధరియించినిలువసోయగమదిరే!
  బొమ్మా!యనిభర్త పొగడ
  కొమ్ములుజనియించెఁగనుడుకోమలి తలపై!

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు గురువుగారికి దన్యవాదములు

  =====*====

  రూపము కడు విచిత్రము కొమ్ము-లు జనియించె
  గనుడు కోమలి తలపై ,గణక యంత్ర
  మందు గణ్యు లార, ముదము నొంద యువత
  నిలిపె సెల్లు ఫోన్ ముఖ చిత్ర -ములుగ నేడు
  ====*===
  తుమ్మెద రూపము నిలుపగ
  తమ్ముడుముఖ చిత్రముగను దానిని మార్చెన్
  అమ్మడు , తుమ్ముల దాటికి
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై
  ====*===
  తుమ్మెదలకు మధురము గన -దూరి గుట్టె వేగమున్
  కొమ్ములు జనియించె గనుడు- కోమలి తలపైన, తై
  లమ్ము తోడ లేపనములు-గ్రమ్మున సుఖ మిచ్చె, దా
  నెమ్మది గన దెంచె బూలు నిర్మల హృదయ మ్మునన్
  =====*=====
  కూర్మపు శిరమునను కొమ్ములు జనియించె
  గనుడు కోమలి తలపై న వృక్ష
  ములు మొలిచెను నేడు ముల్లోక వింతలు
  గణక యంత్ర మందు గణ్యు లార |  రిప్లయితొలగించండి
 9. క్రమ్మగ చీకటు లుత్సా
  హమ్మున తరలగను నటగృహమ్మునకున్ గ
  ర్వమ్మున కీచక రాజుకుఁ
  గొమ్ములుజనియించెఁగనుడు కోమలి తలపై!

  (తలపు + ఐ)

  రిప్లయితొలగించండి
 10. గురువు గారు మన్నించాలి

  ప్రాసయతి తప్పినది ( "ఇంచె = లి" కు యతి యను కొంటిని )

  కూర్మపు శిరమున క్రూర కొమ్ములు జని
  యించె, గనుడు కోమలి తలపై న
  వృక్ష ములట వింత వింతలు జూడగ
  గణక యంత్ర మందు గణ్యు లార |

  రిప్లయితొలగించండి
 11. ఝాన్సీ యాంకరుగా చేస్తున్న ఒక TV Program లో:-

  ఇమ్ముగ ఝాన్సీ షోలో
  అమ్మాయిలు కొమ్ములూనె యాభరణముగన్
  వమ్ముగ పుత్తడి పోరున
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై!!

  రిప్లయితొలగించండి
 12. అమ్మాయను పిలుపు వినగ
  సొమ్ములు లేకున్న గాని సొగసులు విరియన్ !
  ఇమ్ముగ తనయుని బడసిన
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై !

  రిప్లయితొలగించండి
 13. ఫ్యాషన్ షో గురించి వ్రాసిన పద్యము.

  సొమ్ముల క్రీడలయందున
  నెమ్మదిగా ముందుకెలుతు ఇమ్మతి పొందెన్
  ఇమ్మతిచెందిన బొమ్మకు
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

  సొమ్ములక్రీడ = ఫ్యాషన్ షో
  ఇమ్మతి = విజయం పొందినది

  రిప్లయితొలగించండి
 14. అమ్మడు పూతన కృష్ణుని
  రొమ్మున కానించ జచ్చె రొద బెట్టుచు హా!
  యమ్మా! యని, పుట్టె కోరలు
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి
 15. ఝుమ్మందినాదం చిత్రములో కథానాయిక కేశవేషధారణగురించి.........

  సమ్మోహనంబుజేసెడి
  నెమ్మోమునుగలిగి చిత్రనిర్మాణమునం
  దిమ్ముగ కేశంబుల గన
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి
 16. హనుమచ్చాస్త్రి గారూ,

  వాహ్... అద్భుతమైన ఆలోచన........

  రిప్లయితొలగించండి
 17. అమ్మాయి సొగసు గాంచిన
  తుమ్మెద కురులే యనగ తోయజ వదనం !
  బిమ్ముగ తాళిని గట్టితి
  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై !

  రిప్లయితొలగించండి
 18. సంపత్ గారూ ! ధన్యవాదములు.

  పమ్మీ యలిగెను' టీచర్'
  బొమ్మను చిత్రించె తాను 'బోర్డున', మొలిచెన్
  అమ్మడి నోటను కోరలు
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి
 19. కొమ్ములు శబ్దాన్ని వ్యగ్యార్థంలోను, వాచ్యార్థంలోను ప్రయోగించి చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  చంద్రశేఖర్ గారికి,
  ఊకదంపుడు గారికి,
  గండూరి లక్ష్మి నారాయణ గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  అజ్ఞాత గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘రూపము విచిత్రమయి కొమ్ము-లు జనియించె’ అందాం.
  *
  జంగిడి రాజేందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ముందుకు ‘ఎలుతు’... అని గ్రామ్యశబ్దం ప్రయోగించారు. అది వెళ్ళుచు కదా! ‘ముందు కేగి’ అందాం.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘అమ్మా జనించె కోరలు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 20. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ ‘లేటెస్ట్’ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  మీ సూచనతో..గణ దోష సవరణ తో...

  అమ్మడు పూతన కృష్ణుని
  రొమ్మున కానించ జచ్చె రొద బెట్టుచు హా !
  అమ్మో ! నోటను కోరలు
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి
 22. విద్యాసాగర్ అందవోలు.శుక్రవారం, అక్టోబర్ 19, 2012 5:58:00 AM

  అమ్మా నాన్నలు శ్రమపడి

  అమ్మాయికి చదువు నేర్ప నాస్తుల నమ్మన్

  కొమ్మకు రాబడి పెరిగెను,

  కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై.

  రిప్లయితొలగించండి
 23. కమ్మగ వంటలు జేసెడి
  కొమ్మను రమ్మనిన లాలు కోరిక తీరన్
  గమ్మున కిరీటమివ్వగ
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై

  రిప్లయితొలగించండి
 24. మోడి రాక మునుపు:

  గమ్మున చూడుడు మమతను!
  దుమ్మున కలిపించి లెఫ్టు దుండగులెల్లన్
  చిమ్ముచు కాంగ్రెసును వరలి
  కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై!

  రిప్లయితొలగించండి