మిత్రులారా!
ఇదివరలో కొన్ని విశేష వృత్తాలను గురించి తెలుసుకొనినాము. ఈరోజు మరొక వృత్తము "శిఖరిణి" గురించి ముచ్చటించుదాము:
శిఖరిణి -
ఇది 17వ ఛందమైన ‘అత్యష్టి’లో 51950వ వృత్తము.
గణములు: య మ న స భ వ
యతి : 13వ అక్షరము
ప్రాస నియమము కలదు
ఉదా-
పరంధామా! రామా! ప్రణతజన సౌభాగ్య వరదా!
సరోజాక్షా! త్ర్యక్ష ప్రముఖ వినుతా! సత్య నిరతా!
సురూపా! చిద్రూపా! సురుచివిభవా! శుద్ధ చరితా!
శరణ్యా! సమ్మాన్యా! సకల భువనేశా! సురహితా!
శ్రీ శంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరి కావ్యము అంతా శిఖరిణీ వృత్తాలతోనే కూర్చబడినది.
మీరు కూడా అవకాశమునుబట్టి వ్రాయుటకు ప్రయత్నించండి.
స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

రిప్లయితొలగించండిపురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!
పరా! మాయా! మాతా! జనని! శివ! కైవల్యసుపథా!
రిప్లయితొలగించండిపురారీదేహార్ధా! ప్రణతజన సంపూర్ణసుఖదా!
వరాంగీ! కల్యాణీ! కలికలుష సర్వాపహరిణీ!
తరింపన్ మాకీవే తవచరణ పద్మమ్ము లీవే!
శ్రీ మిస్సన్న గారి స్ఫూర్తితో:
రిప్లయితొలగించండిపరా! ప్రత్యగ్రూపా! పరమఫలదా! పర్వతసుతా!
పరానందా! మందస్మిత వదన! దేవవ్రజనుతా!
సరోజస్థా! త్రిస్థా! సరసవిభవా! శంభువనితా!
స్మరింతున్ మాతా! నీ చరణయుగళిన్ మంగళనిధిన్
రిప్లయితొలగించండిపరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీప్రియా! పరమపురుష! ప్రాణద నమ:
అయ్యా శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశిఖరిణీ 4వ పాదమును ఒకమారు పరిశీలించి సరిజేయండి. స్వస్తి.
దశావతారస్తుతి:
రిప్లయితొలగించండిహరీ! మీనాకారా! కమఠ! గిరివాహా! కిటివరా!
హరీంద్రాస్యా! దైత్యాధిపశమన! ప్రహ్లాదవరదా!
సురాధీశస్తుత్యా! వటువర! మహాశూర! భృగుజా!
నరేంద్రా! గోపాలా! కపట గురుమాన్యా! కలికి! జే!
గౌ. పండిత నేమాని వారికి ధన్యవాదములు! పొరపాటయినది! 4వ పాదము 2వ గణము 'శ్రీప్రియా'కు బదులుగ 'శ్రీవత్సా'యని సవరించుకొనుచున్నాను. తెలిపినందులకుఁ గృతజ్ఞుఁడను.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము.......
పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీవత్సా! పరమపురుష! ప్రాణద నమ:
ఈనాటి విశేష వృత్తమైన శిఖరిణి పద్యాలను రచించిన
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
గుండు మధుసూదన్ గారికి
అభినందనలు.