శ్రీ సరస్వత్యై నమః: మిత్రులారా! ఇంతటి వరకు అవధాన ప్రక్రియలు అన్నియును ప్రత్యక్షముగనే సాగుచుండెడివి. అందుచేత అవధాని యొక్క ధార మరియు ధారణలను ప్రశంసించుటకు అవకాశము ఉండెడిది. అంతర్జాలము నందు ఈ ప్రక్రియను ప్రయత్నించినచో ధారణకు అవకాశము లేదు. కేవలము ధారాశుద్ధిపైనే నిర్ణయింప వలసి వచ్చును. అందుచేత పరోక్ష విధానములైన అంతర్జాల ప్రభృతులను కొనసాగించ వలెనా? ఇది నాయొక్క సందేహము మాత్రమే. దీనిని వివేచన చేసి తగు సూచనలను మిత్రులు అందజేయగలరని భావించు చున్నాను. స్వస్తి.
మాస్టారూ, శ్రీనేమాని వారి "దయ్యమె..." అనే ప్రయోగమే బాగుంది. రకరకాలుగా పూరించే అవకాశం కల్పిస్తుంది. కావున మీ ఇష్టం మేరకు సమస్య పాదంలో "దయ్యము" ను "దయ్యమె" గా మారుస్తారా?
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఇంతటి వరకు అవధాన ప్రక్రియలు అన్నియును ప్రత్యక్షముగనే సాగుచుండెడివి. అందుచేత అవధాని యొక్క ధార మరియు ధారణలను ప్రశంసించుటకు అవకాశము ఉండెడిది. అంతర్జాలము నందు ఈ ప్రక్రియను ప్రయత్నించినచో ధారణకు అవకాశము లేదు. కేవలము ధారాశుద్ధిపైనే నిర్ణయింప వలసి వచ్చును. అందుచేత పరోక్ష విధానములైన అంతర్జాల ప్రభృతులను కొనసాగించ వలెనా? ఇది నాయొక్క సందేహము మాత్రమే. దీనిని వివేచన చేసి తగు సూచనలను మిత్రులు అందజేయగలరని భావించు చున్నాను. స్వస్తి.
అయ్యో అడవుల కంపిరి
రిప్లయితొలగించండిదయ్యములై పాండవులను దాయాదులు లే
దయ్యా ధర్మం బవ్విధి
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్
మాస్టారూ,
రిప్లయితొలగించండిశ్రీనేమాని వారి "దయ్యమె..." అనే ప్రయోగమే బాగుంది. రకరకాలుగా పూరించే అవకాశం కల్పిస్తుంది. కావున మీ ఇష్టం మేరకు సమస్య పాదంలో "దయ్యము" ను "దయ్యమె" గా మారుస్తారా?
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిసవరించాను. ధన్యవాదాలు.
దయ్యము దైవము కలువన్
రిప్లయితొలగించండికయ్యము రెండింటి నడుమ కలదెపుడైనన్
దయ్యమె పారును కడ, కే
దయ్యము దైవమును చంపి ధరపై వెలసెన్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! నిజముగ జూచిన
రిప్లయితొలగించండిదయ్యమె దైవమును, చంపి ధరపై వెలసెన్
కయ్యాలమారి యసురుల,
నెయ్యంబును నింపి గూర్చ నిత్యసుఖంబుల్.
ఆర్యా!
’దైవము’ అనే తత్సమ పదానికి తద్భవంగా ’దయ్యము’- అని ప్రకృతి-వికృతులలో చెబుతూ ఉంటాం, ఆ భావనతో పూరించటం జరిగింది.
ధన్యవాదాలు.
అయ్యది ధర్మమె దైవము
రిప్లయితొలగించండిదయ్యము వంటి దవినీతి ధారుణి యందున్
ఇయ్యది కలి కాలమునన్
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్ !
అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
రిప్లయితొలగించండినెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్.
దయ్యములు లేవు నిజముగ
రిప్లయితొలగించండినయ్యదు నన జంపు శంక హా కలుగుట యా ?
దయ్యము దైవము నొకటే
దయ్యమె దైవమును జంపి ధర పై వెలసెన్ .
దయ్యము వంటిది త్రాగుడు
రిప్లయితొలగించండిచెయ్యని పాపములు లేవు చెఱచును గుణముల్
అయ్యది స్వస్థత దైవము
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్
దయ్యం బిదె వరకట్నము
రిప్లయితొలగించండితొయ్యలులకు జేయు హాని ; తొలగిన దేవు
ళ్ళయ్యెదరు మనుజు లౌరా !
దయ్యము దైవమును జంపి ధరపై వెలసెన్ !
భయ్యా! యని భారత్ తో
రిప్లయితొలగించండినెయ్యము నొనరించి మిగుల నేర్పరి తోడన్
గయ్యము చేసెను చైనా
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్.
భయ్యా! యని భారత్ తో
రిప్లయితొలగించండినెయ్యము నొనరించి మిగుల నేర్పరి తోడన్
గయ్యము చేసెను చైనా
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్.
అయ్యో యత్తల సుద్దులు
రిప్లయితొలగించండిగయ్యాళితనం బడుగక గమనించుమురా
అయ్యను నంజుకు తిను నా
దయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్.
దయ్య మనెడి చెడు గెల్లను
రిప్లయితొలగించండిరయ్యిన ధర్మంబనియెడి రాముని జంపన్
అయ్యెను ధరయందు నిపుడు
దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినిన్నటి అంతర్జాల అవధానం యొక్క యుక్తాయుక్తాలు, సాధ్యాసాధ్యాలు మరోసారి తీరికగా చర్చించుకుందాం. ప్రస్తుతం ఆ అంశంపై నేనేమీ వ్యాఖ్యానించలేను. మన్నించవలసిందిగా మనవి.
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన...
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
చంద్రశేఖర్ గారికి,
జంగిడి రాజేందర్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
కయ్యము సురాసురులకు
రిప్లయితొలగించండితియ్యని పీయూష మిడక తిక్తము జూపన్ !
నెయ్యము లేదనుచు యసుర
దెయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్ !
అయ్యా యిది కలియుగమని
రిప్లయితొలగించండికయ్యములను పెంచి తుదకు కోడళ్ళ యుగం !
బియ్యది గనుమత్తా యనిస్నుష
దెయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్ !
అయ్యది అల్లా దైవమె!
రిప్లయితొలగించండికయ్యమున నధికుల మనుట కల్లా! యనుచున్
అయ్యో! ఒసామ బిను లా
దయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్
తియ్యగ నుండగ ప్రజలట
రిప్లయితొలగించండికయ్యము గోరుచును వెలసి కాశ్మీరమునన్
ఘయ్యను జిహాదు వాదపు
దయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్