మిత్రులారా!
ఈనాటి విశేష వృత్తము - మేఘవిస్ఫూర్జితము
మేఘవిస్ఫూర్జితము -
ఇది 19వ ఛందమైన ‘అతిధృతి’లో 75715వ వృత్తము.
గణములు: య మ న స ర ర గ
యతి : 13వ అక్షరము
ప్రాస నియమము కలదు
ఉదా:
ఘనశ్యామా! రామా! కమలనయనా! క్షత్రియాంబోధి సోమా!
మునివ్రాత త్రాతా! పురహరహితా! మోక్షయోగప్రదాతా!
అనంతా! శ్రీమంతా! అమలచరణా! ఆదిదేవా! ప్రశాంతా!
జనస్తుత్యా! నిత్యా! సరసవచనా! సత్య ధర్మ స్వరూపా!
చూచేరు కదా. శిఖరిణికి ఈ వృత్తానికి పాదము చివరలోనే తేడా ఉంటుంది. మీరూ ప్రయత్నించండి. స్వస్తి.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

రిప్లయితొలగించండిగౌ.పండిత నేమాని వారికి ప్రణామములు! నేఁడు మంచి వృత్తమును పరిచయము చేసినారు. మఱొక విశేషమేమనగా, నిందు పాదాద్యక్షరద్వయమును దొలఁగించినచో "మందాక్రాంత" వృత్తమగును.
లక్ష్మీస్తుతి:
రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! రమ్య! సంస్తుత్య వంద్యా!
నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! నన్ గటాక్షించు తల్లీ!
సమీక్షింతున్ పద్మాసన! సువదనా! సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివియవుటన్ గాంక్షితమ్మీవె దేవీ!
అయ్యా! మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగున్నది. మందాక్రాంతము గురించి మీరు చెప్పేరు. సంతోషము. గర్భ కవిత్వములో నేను చాలా ప్రయోగములు చేసేను. కావున నాకు మీరు చెప్పిన విషయము తెలిసినదే. అయినను మీకు అభినందనలు. మందాక్రాంతములో కొన్ని మధ్య అక్షరములను తీసివేస్తే శాలిని అనే వృత్తము వస్తుంది.
ఉదా:
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం .. మందాక్రాంత పాదము
శాంతాకారం పద్మనాభం సురేశం .. శాలిని పాదము.
స్వస్తి.