కవిమిత్రులకు నమస్కృతులు. మొన్న రాత్రి మా మేనకోడలు కిరోసిన్ పోసికొని ఒళ్ళు కాల్చుకుని మరణించింది. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. మొగుడు తాగుడుకు బానిసై, కూలిపని చేస్తూ వచ్చింది తాగుడుకే కర్చు పెడుతూ భార్యను కొట్టేవాడు. ఇంతకాలం బ్యాగులు కుట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది. మొన్న ఏం జరిగిందో ఏమో ఆత్మహత్య చేసికొంది. ‘చనిపోవడం’ అంటే ఏమిటో తెలియని పిల్లలు అంతమంది బంధువుల్ని చూసి నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే అందరూ ‘అయ్యో, ఈ పిల్లల గతి ఏమిటి?’ అనుకొని దుఃఖించేవాళ్ళే. నిన్న రోజంతా అక్కడే ఉన్న కారణంగా కొత్త సమస్య ఇవ్వడం కాని, బ్లాగును చూడడం కాని చేయలేకపోయాను.
ఆర్యా,మొదట మీ సమస్య చూసి సీతాదేవి గురించి ఇచ్చిఉంటారనుకొన్నాను.తర్వాత మీరు రాసినది చదివాక చాలా బాధ కలిగింది.అందుచే పద్యం వ్రాయ బుద్ధి పుట్టలేదు. ఇటువంటి విషాదఘటనలు చాలా జరుగుతున్నట్లు చదువుతున్నాము.కాని మీ కుటుంబంలోనే జరగడం ఇంకా బాధాకరం.ఆ తల్లి పిల్లల సంగతి ఎందుకు ఆలోచించ లేదో?మీరందరూ వాళ్ళకి సహాయం చేయగలరని ఆశిస్తున్నాను.ఇటువంటి సమస్యలకి అలాంటి భర్తనుంచి విడిపోయి విడాకులు తీసుకోడానికి మించి పరిష్కారం లేదు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమొన్న రాత్రి మా మేనకోడలు కిరోసిన్ పోసికొని ఒళ్ళు కాల్చుకుని మరణించింది. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. మొగుడు తాగుడుకు బానిసై, కూలిపని చేస్తూ వచ్చింది తాగుడుకే కర్చు పెడుతూ భార్యను కొట్టేవాడు. ఇంతకాలం బ్యాగులు కుట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది. మొన్న ఏం జరిగిందో ఏమో ఆత్మహత్య చేసికొంది. ‘చనిపోవడం’ అంటే ఏమిటో తెలియని పిల్లలు అంతమంది బంధువుల్ని చూసి నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే అందరూ ‘అయ్యో, ఈ పిల్లల గతి ఏమిటి?’ అనుకొని దుఃఖించేవాళ్ళే.
నిన్న రోజంతా అక్కడే ఉన్న కారణంగా కొత్త సమస్య ఇవ్వడం కాని, బ్లాగును చూడడం కాని చేయలేకపోయాను.
హా! హతవిధీ! హృదయ విదారక సంఘటన.. మాతృ ప్రేమకు దూరమైన పిల్లలకు మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించు గాక.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅగ్నిమయమైన బ్రతుకా?
రిప్లయితొలగించండిఅగ్ని పునీతవె యిడుముల కంతములేదా?
అగ్నియె దీర్చెనె కష్టము?
లగ్నింబడి పొందినావె యమిత సుఖంబుల్?
దారుణమైన దుర్ఘటన.
రిప్లయితొలగించండిఆ పిల్లలు దురదృష్టవంతులు.
లగ్నమదెవ్వరు పెట్టిరొ
భగ్నమయె కలలు; బంగరమగు లో
నగ్నియె దహించె తల్లీ!
యగ్ని పునీతవె, యిడుముల కంతము లేదా?
అగ్నికి యాహుతి యౌట ను
రిప్లయితొలగించండిఅగ్ని పు నీ త వె యిడుముల కం త ము లేదా ?
లగ్నపు ఫలితము నౌ యది
భ గ్న మె మ రి యాయె, వారి భవ బంధ ములున్
రిప్లయితొలగించండిఆర్యా,మొదట మీ సమస్య చూసి సీతాదేవి గురించి ఇచ్చిఉంటారనుకొన్నాను.తర్వాత మీరు రాసినది చదివాక చాలా బాధ కలిగింది.అందుచే పద్యం వ్రాయ బుద్ధి పుట్టలేదు. ఇటువంటి విషాదఘటనలు చాలా జరుగుతున్నట్లు చదువుతున్నాము.కాని మీ కుటుంబంలోనే జరగడం ఇంకా బాధాకరం.ఆ తల్లి పిల్లల సంగతి ఎందుకు ఆలోచించ లేదో?మీరందరూ వాళ్ళకి సహాయం చేయగలరని ఆశిస్తున్నాను.ఇటువంటి సమస్యలకి అలాంటి భర్తనుంచి విడిపోయి విడాకులు తీసుకోడానికి మించి పరిష్కారం లేదు.
sankarayya garu! namaskaaramulu..mii menakodalu pillalaku naa saanubhutini teliyajeyagalaru.mii sakti meraku miiru aadukoprardhana.
రిప్లయితొలగించండిaa pillalanu sankarudu abhaya hastamichchu gaaka!
గురువుగారికి నమస్సులు.జరిగిన సంఘటనపట్ల నా ప్రగాఢ సానుభూతి.రెండు దినముల తర్వాత యిప్పుడే బ్లాగు చూడటం జరిగింది.నోట మాట రావటము లేదు.
రిప్లయితొలగించండిగురువు గారికి,
రిప్లయితొలగించండిప్రగాఢ సానుభూతి.
మీ మేనకోడలి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము.
సానుభూతి తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
మీరు వ్రాసిన నైపథ్యవచనాలు గుండెలను కలచివేశాయి.
ఈ దురంత దుఃఖసమయంలో ఈశ్వరుడు మీ అందఱికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని, జీవితమంతా ముందున్న చిన్నారులకు దారిదీపాన్ని చూపి, ఈ లోకంలో వేదననే చవిచూసిన మాతృమూర్తికి ఆత్మశాంతిని కలిగించాలని ప్రార్థిస్తున్నాము.
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు