6, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 843 (వక్త్రంబుల్ పది గలిగిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!
ఈ సమస్యకు స్ఫూర్తి వావిళ్ల వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథం. 
అందులోని సమస్యను, దాని పూరణను గమనించండి....
సమస్య - వక్త్రంబుల్ పది కన్ను లైదు కరముల్ వర్ణింపఁగా వెయ్యగున్.
పూరణ....
ఈ క్త్రా ప్రాసము చెడ్డదందు విన మీ రెంతేసివా రాడఁగా
వాక్త్రాసంబది సత్కవీశ్వరులకున్ వర్ణింప నేఁ జెప్పెదన్
దిక్త్రారాతికిఁ బార్వతీశ్వరులకు దిగ్మప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్ను లైదు కరముల్ వర్ణింపఁగా వెయ్యగున్.

13 కామెంట్‌లు:

 1. వక్త్రము లైదే హరునకు
  వక్త్రము లైదేను కనగ పావని కైనన్
  వక్త్రమున కనగ నొక్కడె
  వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!

  వక్త్రమున కనగ = తలతో చూస్తే (ఆలోచిస్తే)

  రిప్లయితొలగించండి
 2. వక్త్రములవి యైదు తనకు
  వక్త్రము గజరూపము తన వరపుత్త్రునికౌ
  వక్త్రమున దలుచు భక్తుని
  వక్త్రంబుల్ పది; గలిగినవానికి జేజే!

  రిప్లయితొలగించండి
 3. వక్త్రము లేదనకుము బహు
  వక్త్రంబులు గలవు చూడ పరమాత్మునికే
  వక్త్రముల పొగడ గావలె
  వక్త్రంబుల్ పది, గలిగినవానికి జేజే!

  రిప్లయితొలగించండి

 4. ఈ క్త్రాప్రాసము నొసఁగిన
  శక్త్రుద్ధికిఁ బూరణమ్ము సాధ్యమె సుమ్మీ!
  దిక్త్రాణదక్షుఁ డగుటకు
  వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!
  (శక్తి + ఋద్ధి = శక్త్రుద్ధి - సమృద్ధియైన శక్తి గలవాఁడని భావం. పది దిక్కులను గాచుటకు పది ముఖములు గల భగవంతునకు జేజే అని తాత్పర్యము)

  రిప్లయితొలగించండి
 5. వక్త్రంబు లెన్ని యున్నను
  వక్త్రము మఱి యొకటి నేని బలుకని శివునిన్
  వక్త్రము లన్నియు వమ్ము లు
  వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే .

  రిప్లయితొలగించండి
 6. లుక్ త్రీ డీ పిక్చరిదే
  బ్రేక్త్రూలో నొక్క పర్యవేక్షకుడనె నీ
  ట్రేక్ త్రీలో నద్భుతముగ
  వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే

  రిప్లయితొలగించండి
 7. వక్త్రంబులు హరి గొలవని
  వక్త్రంబులు కావు, యోగ్య వాక్కులు పలికే
  వక్త్రంబు చాలు, నుడువకు
  వక్త్రంబులు పది గలిగిన వారికి జే జే !

  రిప్లయితొలగించండి

 8. (వక్త్రమనఁగా నోరు, మొగము రెండర్థా లుండుటచే పంచముఖాంజనేయునకు పది వక్త్రములున్నవని చమత్కరింపఁ బడుచున్నాఁడు)

  వక్త్రాననములు గలసియు
  దిక్త్రారాతి శిర సమము! తిరమ, హనుమకున్!
  వాక్త్రాసం బెది లేదిట!
  వక్త్రంబుల్ పది గలిగిన 'వానికి' జేజే!

  రిప్లయితొలగించండి
 9. దిక్త్రాసము గలిగింతువ?
  ధిక్, త్రుంచెద నిన్నటంచు దితిసుతునిమెడన్
  యోక్త్రంబు వేసి లాగెడు
  వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.

  రిప్లయితొలగించండి
 10. వాక్త్రాసమేల గన స
  మ్యక్త్రేతాయుగము లోన నా రావణునిన్
  దిక్త్రాత కూల్చె ; గూల్చిన
  వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!

  ఈ సమస్య ఇంతకు ముందు చమత్కార పద్యాలరూపంలో ఇచ్చినదే !

  http://kandishankaraiah.blogspot.in/2011/06/77.html

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులూ, కవి మిత్రులూ, కవి పండితులూ దుష్కర ప్రాసతో అలవోకగా అద్భుతమైన పూరణల నందించి ఆనంద పరచారు.

  రిప్లయితొలగించండి
 12. వక్త్రము గలిగిన నొక్కడు
  వక్త్రములు పది గల భంగి పలు భాషలలో
  వక్తృత్వము నందు గెలిచె !
  వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే !

  రిప్లయితొలగించండి
 13. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా! శుభాశీస్సులు.

  ఈనాటి సమస్యలో ముఖ్యమైన విషయము "దుష్కర ప్రాస". దీనివలన ఉపయోగము ఆశించినంతగ ఉండదు. అయినా ఉత్సాహముతో పూరించిన వారందరికీ పేరు పేరునా అభినందనలు. ప్రతి పద్యమును గురించి వ్యాఖ్య చేయుటకు ఎక్కువ అవకాశము లేదు. ఈ ముచ్చటలో పాలు పంచుకొనిన -
  శ్రి గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
  శ్రీమతి లక్ష్మీ దేవి గారికి
  శ్రీ కంది శంకరయ్య గారికి
  శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి
  శ్రీ గుండు మధుసూదన్ గారికి
  శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారికి
  శ్రీ విష్ణునందన్ గారికి
  ప్రత్యేక అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి