4, ఫిబ్రవరి 2016, గురువారం

పద్యరచన - 1161

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

34 కామెంట్‌లు:

  1. తెలుగు భాష వోలె తీయనై మురిపించు
    అమ్మ ప్రేమ లోని కమ్మదనము
    కన జిలేబి లాగు కనిపించ నేమిరా
    జాంగ్రి లనెడు నివియె జగతి వెలసె

    రిప్లయితొలగించండి
  2. "షుగరోదయం" :)

    ఆహా పెట్టిరి జాంగ్రీ
    ఓహో వచ్చెను జిలేబి ఓనమ యనగన్
    ఆహార్యము నేటికిదే
    మా హారము గనుడు నిదియ మాకవి వర్యా !



    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ఆహారము’ అనబోయి ‘ఆహార్యము’ అన్నారా? లేక కావాలనే ఆ పదాన్ని ఉంచారా? ఎందుకంటే ‘స్వీకరింపదగినది’ అనే అర్థంలో అది కూడా సార్థకమే.

      తొలగించండి
    2. కంది వారు :)

      ఆహార్యమే :) షుగరో నమః !
      నెనర్లు !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  3. జాంగ్రీ జూచిన చాలును
    హంగ్రీ యనుమాట మరచి యాహా యనుచున్
    యాంగ్రీ చూపుదు రింటను
    సంగ్రామము తప్ప దంట సాహస మొప్పన్

    రిప్లయితొలగించండి

  4. రాజేశ్వరి గారు :)

    జోడున జతగ 'షుగరో' నమః :)

    బాగుంది మీ హంగ్రీ యాంగ్రీ జాంగ్రీ :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. చిత్ర మందుజ హంగీర్లు చిత్రముగను
    దనరె బంగారుఛాయతో ధగధగముగ
    చూడ దినబుధ్ధియాయెను సుమ్ము నాకు
    తెచ్చియిచ్చిన గడుపార తిందునేను

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బంగారు రంగు చూడగ
    సింగారపు చుట్టుల గన చెలి నోరూరున్
    పొంగారుచున్న తీపి ర
    సంగారు జిలేబి మరియు జాంగ్రీ యిదియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ము’ ప్రత్యయాన్ని అనుస్వారం చేసి ‘రసం గారు’ అన్నారు.

      తొలగించండి
  8. ధవలాంచిత పాత్రంబున
    చవు లూరించెడి మధుర రస సమన్విత భ
    క్ష్యవిశేషమ్ములు సురుచిర
    సువర్ణవర్ణ నిభములవి సుస్వాదువులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం అద్బుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. తీపి వస్తువనగ దేశీయులకునెల్ల
    మోజు హెచ్చు చుండు మురిపె మలర
    జాంగిరీలు యన్న జనుల కెల్లను ప్రీతి
    తినగ రండు తమరు తీయగాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘జాంగిరీలు+అన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘జాంగిరీలటన్న’ అనండి.

      తొలగించండి
  10. జాంగ్రీలను చూచి కరము
    హంగ్రీ పెరిగినది సుమ్మ హర్షము తోడన్
    ఆగ్రా వాలా షాపుకు
    శీఘ్రముగా పోవుచుంటి చిరుతిండి గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ ప్రయత్నం బాగుంది. కాని చివరి రెండు పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. సత్యనారాయణ రెడ్డి గారు ప్రాస మిమ్మల్ని కొంచెము యిబ్బంది పెట్టినట్లు కన్పించింది. యీప్రాసలెలా యున్నాయో చూడండి.

      జాంగ్రీలను చూచి కరము
      సంగ్రాహము నందు పట్టి సంతోషమునన్
      సంగ్రామము సేసియయిన
      సంగ్రహమునకు నిసుమంత సందేహింపన్

      తొలగించండి
    4. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  11. తినగలతీపిని జుట్టియు
    కనగా సింధూరవర్ణ కాంతులచేతన్
    మనుజుల జిహ్వకు రుచియౌ
    పనితనమౌ జాంగ్రి మాకు పరిచయ మేగా.
    2.నాలుక మైదానంబున
    తేలికగాతీపి బంచి దిగులును మాన్పే
    మేలగు జాంగ్రీ రుచిగని
    ఆలాపన లందుకొనును|ఆకంఠంబే|
    తినగల్గు తీపిని మనగల్గు మనుషుల
    --------కాహార మై నుండు అప్పుడపుడు
    కాచిన నూనెలో కాలినదని యెంచి
    -------తీపియు పాకాన తిరగదోడి
    రంగు హంగును జూచి పొంగును మనసని-
    -------సింగారిగా మార్చి జేర్చిరిచట
    కన్నియజడలాగ కారపుచుట్టలా
    --------చక్ర బంధమ్మున చక్కదనము
    కంటి చూపులసైగ నీవెంటబడగ
    ముక్కువాసన నాలుక ముందునుంచ?
    నోటిమాటున చాటుగా పోటిబడుచు
    పళ్ళు దంచును జాంగ్రీని పట్టుబట్టి

    రిప్లయితొలగించండి
  12. .మందారమ్ములవోలె జాంగ్రి లిట నున్మాదైన నాశించుగా
    అందంబైనది విందు బంధ మిది ఆనందానసంధానమై
    సౌందర్యంబగు సాధనా బృతిగ విశ్వాసంబు జేకూర్చుచున్
    సందిత్వంబును సాగజేయుగద నింపా దైన శ్రీ చక్రముల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు పసందుగా ఉన్నాయి. అభినందనలు.
      ‘ఆనందానుసంధానమై.... భృతిగ...’ అనండి.

      తొలగించండి
  13. జాంగిరులన నోరూరెను
    చెంగున దూకుచు తినగను జేగొనబోవన్
    బెంగ పడుచు సతివచ్చియు
    మ్రింగుట నొప్పదు తమ మధు మేహమ్మనియెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. నోరూరించెడు జాంగ్రిని
    కోరని వారెవ్వ రుంద్రు కువలయ మందున్
    వారికి వీరికనక నె
    వ్వారి మనసు నైన దోచు వాసిగ నివియే

    రిప్లయితొలగించండి
  15. జాంగ్రీలను చూచి కరము
    హంగ్రీ పెరిగినది సుమ్మ హర్షము తోడన్
    చెంగునఁబోయెద నిప్పుడె
    యంగడినుండికొనిపోవ నమృతపుతుల్యన్(సమమున్)
    (సమ్యుతాసమ్యుత ప్రాస వాడాను)

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. బాంగ్రా నృత్యము వంటిది
    కాంగ్రా సమ హిల్రిసార్టు కనమెందైనన్
    సంగ్రామమున కిరీటికి
    జాంగ్రీ రుచులకును సాటి జగతిని గలవే?

    రిప్లయితొలగించండి