5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1162

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

41 కామెంట్‌లు:

  1. చేపలెన్నొ దెచ్చి చిత్రాతి చిత్రంగ
    పేర్చినారు జూడ వింత యదియు
    మత్స్య యంత్ర మదియొ మగటిమ గలిగిన
    పార్థువెదక దలచి పన్ని రేమొ

    రిప్లయితొలగించండి
  2. వచ్చెను మకర సంక్రాంతి పండుగనుచు
    బెస్తవారి పిల్లయె ముగ్గు వేయబోవ
    ముగ్గు పిండి యింటనులేక ముచ్చటగను
    పొలతి దీర్చె మత్స్యములను ముగ్గు వోలె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      చక్కని భావంతో పద్యాన్ని వ్రాశారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  3. చక్కగ నల్లిరి చిత్రము
    మిక్కిలి యందముగ నున్న మీనము లవియే
    మక్కువ జూపుచు కనులకు
    చెక్కగ నదియంత్ర మేమొ జేరి కనంగా


    రిప్లయితొలగించండి
  4. మత్స్యోదయం :)

    దండిగ చాపలు తెచ్చెను
    పెండ్లము మీనా కుమారి పేర్చెను అవురా !
    రండు గన మత్స్య యంత్రము
    యెండగ ముంగిట గొలిచెను పండగ గానన్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని రెండవ పాదంలో ప్రాస, చివరి పాదంలో యతి తప్పాయి.
      దండిగ చేపలు దెచ్చె మ
      గండదె మీనాకుమారి ఘనముగ బేర్చెన్
      రండు గన మత్స్యయంత్రము
      నెండగ ముంగిటను గొలిచె నిదె పండుగగా.

      తొలగించండి
  5. చేపల ముగ్గునుజూడుము
    ఏపాపలుబెట్టిరచటయేమోకానీ
    పాపల నైపుణ్యమునకు
    రూపాయలనిత్తునిపుడురూఢిగ నేనున్

    రిప్లయితొలగించండి
  6. చేపల కన్నుల చిన్నది
    చేపల చిన్నదియు పెద్ద చేపల వరుసన్
    చేపట్టి మ్రుగ్గు బెట్టెను
    చేపట్టిన వాడు మెచ్చి చిటికెలు వేయన్.

    రిప్లయితొలగించండి

  7. సరదాగా.....

    చేపతోకచేప చేపతోకాచేప
    చేపతోక చేప చేపతోక
    తోక చేప తోక తోకచేపా చేప
    తోక చేపతోక తోక చేప.

    రిప్లయితొలగించండి
  8. పైశాచిక కృత్యంబా
    త్మాశిగణ విదార ణాతి దారుణ దృశ్యం
    బే శమదమాది గుణ రహి
    తాశేష ఝష హరణంబు నవివే కంబే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం వైవిధ్యంగా ఉంది. ఉదాత్తమైన భావం. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. ఆ.వె. మత్స్య ములను పేర్చి మంచి ముగ్గులమర్చ
    చూడ చూడ కనుల సురత మయ్యె
    వంటకముల చేసి వంగ మిత్రులకును
    విందు సేయ వలెను ప్రీతి తోను.

    రిప్లయితొలగించండి
  10. మీన రాశి దెచ్చి మించిన శోభతో
    మీననేత్రియైన చాన యోర్తు
    మ్రుగ్గు మ్రుగ్గననుచు ముదితలు మెచ్చంగ
    సిగ్గు నిగ్గు మెరసె బుగ్గలందు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మీన రాశి దెచ్చి మించిన శోభతో
    మీననేత్రియైన చాన యోర్తు
    మ్రుగ్గు మ్రుగ్గననుచు ముదితలు మెచ్చంగ
    సిగ్గు నిగ్గు మెరసె బుగ్గలందు !

    రిప్లయితొలగించండి
  12. రంగవల్లి పోటి రంజుగా సాగంగ
    గ్రామ మందు యున్న గరిత లెల్ల
    ముగ్గుపిండితోడ ముగ్గులిడయోర్తు
    ముగ్గు లేసె మత్స్యములను కూర్చి.

    రిప్లయితొలగించండి
  13. ఆపదలు వీడు ననుచున్
    చూపరు లలరన్ సజీవ సురుచిర మయెడిన్
    చేపల మ్రుగ్గిడి తను ముని
    మాపున ముచ్చటగఁజేసె మత్స్య జయంతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. పద్యరచన చెప్పగ ముప్పదియారే
    గొప్పగు చిత్రంబునందు కూర్పున మీనాల్
    జెప్పగ వేసిన ఘనతయు
    నొప్పుల కుప్పక?మగడిక?నూహించు మయా.
    2.ముప్పదియారు మీనముల ముచ్చట జూడగ చక్ర బంధమా?
    చెప్పగ చేరు వైనవిట చిత్ర విచిత్రపు మీనరాశియా?
    మెప్పును బొందురీతి పరమేశ్వరి మండప శిల్ప చిత్రమా?
    అప్పటి అర్జునుండు పదకమ్మున గొట్టిన మశ్చయంత్రమా?

    రిప్లయితొలగించండి
  15. బొచ్చచేపలుగొని ముగ్గును వే యగా
    చేపలమ్ముపిల్ల చెన్నుగాను
    ముచ్చటైన ముగ్గు మురిపించ జ నులను
    చేపలమ్ముడయ్యె శీఘ్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. వారిజీవులన్ని వాకిట జేరెను
    ముద్దు లొలుకు గొప్ప ముగ్గు యయ్యె
    సృష్టి కర్త లిలను సృజియింప లేనట్టి
    విషయ ముండబోదు విజ్ఞు లార.

    రిప్లయితొలగించండి
  17. గురుమూర్తి ఆచారి గారి పద్యం....
    {అదియే విష్ణుచక్రము! మత్స్యావతారము సముద్ర౦లో జొచ్చి పైవిధమయిన చక్రమై సొమకాసురుని శిరము ఖ౦డి౦చినది}

    చదువుల్ గైకొని వార్ధి గర్భమున దాచన్ దైత్యు, డవ్వాని దు
    ర్మదమున్ ద్రు౦చగ, దాల్చె మాధవుడు తా మత్స్యావతారమ్ము| న
    య్యది పై చిత్ర పటమ్మున౦ గల విధ౦బౌ మీన చక్ర౦ బయెన్
    గద, శీఘ్ర౦బుగ. సోమకాసుర శిర: ఖ౦డ౦బు గావి౦పగన్.

    రిప్లయితొలగించండి
  18. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ఆవె
    నీర నుండు చేప నేలకు చేరెనా
    తీరమందుసేదతీర్చుకొనగ
    మీన వేషమెంతొముద్దుగాయుండెనో
    జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల
    మీ
    గోగులపాటి కృష్ణమోహన్
    సీనియర్ జర్నలిస్టు
    హైదరాబాదు
    9700007653
    http://krishnamohan138.blogspot.in/?m=1

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నీటనుండు...ముద్దుగా నుండెనో’ అనండి.
      మీ బ్లాగు ‘కృష్ణమోహన్ కవితలు’ను కొద్దిరోజుల క్రితమే చూశాను. మీ ‘ఆటవెలదులు, కందాల శతకమాల’ కొన్ని పద్యాలు చదివాను. బాగున్నవి. అక్కడడక్కడ ఛందోవ్యాకరణ దోషాలున్నవి. తరువాత తీరికగా వాటిపై నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.

      తొలగించండి