6, ఫిబ్రవరి 2016, శనివారం

పద్యరచన - 1163

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

42 కామెంట్‌లు:

  1. ఆడువారికెన్ని ఆభరణములున్న
    పట్టుచీరలెన్నొ కట్టుకున్న
    కొప్పు లోన పూలు గొప్పగా యుండుగా
    జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘గొప్పగా నుండుగా’ అనండి.

      తొలగించండి
  2. నీలిగగన మందు నెలరాజు వోలెను
    మగువ కురుల యందు మల్లెలొదిగె
    కాంతివిరియు నట్టి కౌముదిచందమ్ము
    పరిమళమ్ము చిందు విరులెయవియు

    రిప్లయితొలగించండి
  3. పట్టు చీర కన్న పసిడి నగలకన్న
    మగువ గోరు నెపుడు మరుని వలపు
    కురుల విరులు తురిమి కూరిమి గానుండు
    పతిని పొంది నంత బ్రతుకు సుఖము
    ---------------------------
    పట్టు చీరె గట్టి పసిడినగలు బెట్టి
    విందు కేగ నెంచి విరులు తురిమి
    వొంపు సొంపు జూపి వొయ్యార మొలికించి
    కనుల విందు జేయు కలికి యనగ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ రెండు పద్యాలు బాగున్నవి.
      మొదటి పద్యంలో ‘మగని వలపు’ కావాలి కాని ‘మరుని వలపు’ ఎందుకు?
      రెండవ పద్యంలో మూడవపాదంలో ‘వొంపు, వొయ్యార’ మనడం గ్రామ్యం. ‘తురిమి| యొంపు సొంపు జూపి యొయ్యార మొలికించి’ అనండి.

      తొలగించండి
    2. పట్టు చీర కన్న పసిడి నగలకన్న
      మగువ గోరు నెపుడు మగని వలపు
      కురుల విరులు తురిమి కూరిమి గానుండు
      పతిని పొంది నంత బ్రతుకు సుఖము
      -------------------------------------
      పట్టు చీరె గట్టి పసిడినగలు బెట్టి
      విందు కేగ నెంచి విరులు తురిమి
      యొంపు సొంపు జూపి యొయ్యార మొలికించి
      కనుల విందు జేయు కలికి యనగ

      తొలగించండి
  4. బొండు మల్లె జడను నిండుగా తురిమియు
    పట్టు చేలములవి యుట్టి పడగ
    వలపు గొలిపి చెలుని పడతులిర్వురుగట్టి
    కాళరాత్రి ముఖము కాంతురేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది.

      తొలగించండి
    2. కొప్పులోని పూలె కోమలికందము
      పట్టుచీరెలున్న పసిడి యున్న
      భారతీయపడతి భాగ్యంబు యిదియేను
      ఇతరదేశ వనిత కిదియె లేదు

      తొలగించండి
  5. శుభోదయం !

    తలనిండ పూదండ తరుణము నిదియె తరుణులు పెండ్లకు తరలుటకు మరి
    కలలో నవచ్చెను కలకల యనుచు కమనీయ సుకుమార కావ్యవరులును
    జలజల యనుచును జావళి గనగ జవ్వనులు మురిసె జలతారు యనగ
    ఇలలోన కంటిని యీ తరువోజ యీ కుసుమములకు నివ్వవలె నని :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ తరువోజ బాగుంది.
      మొదటిపాదాన్ని ‘తలనిండ పూదండ దాల్చు తరుణము తరుణులు పెండ్లికి తరలు తరలెద రదియె’ అనండి. ‘కావ్యవరులు’...? ‘జలతారు+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘జలతా రనంగ’ అనండి.

      తొలగించండి
  6. శుభములెరుగ నట్టి శూన్య మాసము వెళ్లి
    మనువులాడ జనులు మనసు పడెడు
    మాఘమాస వేళ మల్లెల పంటంట!
    తరుణులు జడలోన తురిమెదరట!

    రిప్లయితొలగించండి
  7. ఔరా ! తరువోజ అన్న పదం ఆంధ్రభారతి నిఘంటువు లో లేక పొవట మేమిటి ! మరీ హాశ్చర్యం గా ఉంది :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే... ఆంధ్రభారతిలోనే కాదు, సూర్యారాయాంధ్ర నిఘంటువులోను దొరకలేదు. కారణం విచారించాలి.

      తొలగించండి
  8. పట్టుచీరలు గట్టెమేలుగ పంకజూక్షులు జూడరే
    పెట్టె సొంపుగ మల్లెమాలలు ప్రీతితో తమకొప్పునన్
    జట్టుగానిలుచుండె నచ్చట జావళీలను బాడుచున్
    మట్టసంబగు వారిఁ జూడగ మత్తకోకిల వచ్చెనే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ మత్తకోకిల బాగున్నది.
      ‘పెట్టె’ ఏకవచనం, అక్కడ కదురదు. ‘పెట్టి రింపుగ మల్లెమాలలు ప్రీతితో తమ కొప్పులన్’ అనండి.

      తొలగించండి
  9. జడలో బూలను జూడుము
    మెడనంతయు నాక్రమించి మీరెను సొబగు
    ల్బ డతుల యందము నంతయు
    నడయాడెడుజడలపైన నాట్యము జేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘...యంద మ్మంతయు’ అనండి.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. చెంగావి రంగు చీరను
      సింగారించె నొక వనిత సిగలో విరులన్
      బంగారు చెలిమి తోడన్
      శృంగారవతి చెలి నీలి చీర ధరింపన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం సుందరంగా ఉన్నది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. 1.మగువ మెచ్చు నట్టి మల్లెపూవులివియె
    మరులు గొల్పు గాదె మగనినంచు
    మురిపెమలర కట్టి ముడుచుకొని సిగలో
    మురిసి పోవు చుండు ముదిత తాను.
    2.పట్టు చీర గట్టి పసిడి నగలుదాల్చి
    మల్లెపూలు పెట్టి మగని కొరకు
    యెదురు చూడనట్టి యింతి యుండ దిలను
    యనెడి మాట కాదు నతిశయోక్తి.

    3.అటు తిరిగి యున్న నతివ జడను చూడ
    జడను ముడిచి నట్టి జాజి పూలను
    జూడ పరిమళమ్ము తోడ మరులు గొల్పి
    మరుని నారి వోలె మదిని/మగని దోచు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      రెండవ పద్యంలో ‘కొరకు| నెదురు చూడ... యుండదు భువి|ననెడి మాట...’ అనండి.
      మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘అటు తిరిగి నిలబడు నతివ...’ అనండి.
      రెండవపాదంలో ‘పూలను’లో ను తొలగిస్తే గణదోషం తొలగుతుంది.

      తొలగించండి
  12. పట్టు చీర లాని పడతుక లిద్దరు
    మల్లెపూలు తురిమి మట్టసముగ
    సంద్య వేళలోన చల్లని గాలిలో
    వేచి యుండిరి నిజ విభుల కొరకు
    ఆను: ధరించు

    రిప్లయితొలగించండి
  13. తాళియు మట్టెలు కుంకుమ
    పూలుయు పసుపు ధరించు పూబోణులనే
    మేలుగ మన్నన సేసెడు
    కాలమ్ముయె మారబోదు కలియుగమైనన్ .

    తరుణుల యందము బెంచును
    కురులందున తాముడిచిన కుసుమము లేగా
    పరిమళమొలుకెడు విరులే
    సరసుల మదిగెల్చు నంట సత్యమె నౌరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      మొదటిపద్యం రెండవ పాదంలో గణదోషం. ‘పూలును పసుపును ధరించు...’ అనండి. ‘కాలమ్ముయె’ అనరాదు. ‘కాలమ్మే’ అంటే సరి.
      రెండవ పద్యం చివర ‘సత్యమె యౌరా/గదరా’ అనండి.

      తొలగించండి
  14. చీర కట్టు తోడ శింగార మొలకింప
    పూల శోభ నందె వాలు జడలు
    చెఱకు వింటి రేని చిత్తంబు రంజిల్ల
    నిలచి యుండి రచట నెలత జంట!



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘సింగార’మును ‘శింగార’ మన్నారు.

      తొలగించండి
  15. జడన మల్లెలున్న జవ్వను లిరువురు
    మనసు దోచి నట్టి మరుని కొరకు
    వేచి యుండి రచట వెన్నెల కాంతిలో
    కామ రణము గోరి కాంక్ష తోడ

    రిప్లయితొలగించండి
  16. కామ కదన మాడ గత్తితొ పనియేమి?
    మగువ మనసు దోచు మల్లెలున్న
    కురుల విరులు దురిమి కులుకులాడులు బిల్వ
    కత్తి వదలి వచ్చె గదన మునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా పద్యాలు బాగున్నవి.
      ‘జడను మల్లెలున్న’ అనండి.

      తొలగించండి
  17. భారతీయ వనిత బహురమ్య రీతుల
    చీర కట్టు విధమె చేర్చు ఘనత
    సంప్రదాయ బద్ధ సారసాక్షుల జూడ
    భరత మాత రూపు భవ్య చరిత !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ తాజా పద్యం బాగున్నది.

      తొలగించండి
  18. పద్యరచన చీరల యందమా ?యిచట చేడియ లందమ?చూడ ముచ్చటౌ
    ఓరగ చూపునన్ కురుల నూయల నూగెడి పువ్వులందమా?
    చేరిన దారమున్ నడుగ జెప్పుట కౌనటె?చెంత నుండియిన్
    ప్రేరణనింపు పట్టు విలువెంచని రీతి జవాబుచిత్రమే|
    2.నవ్వెడిమోము దాచినను నవ్వుచు పువ్వులెరువ్వుభావనల్
    సవ్వడి లేని సంస్కృతిని సాకుచుపట్టున చీరలెన్నియో
    నివ్వెర బోవుటందమునునిల్పగ నీలియురంగు హంగులే
    నెవ్వరి కైన మోజుగద నెంచగ యింతులకంతులందునన్.
    3.పలుకక పారవశ్యమును బంచును జూడగ పట్టు చీరలే|
    అలుగని మల్లెపూల పరిహాసమె ఆకురులందు గంధ మై
    నిలిచెను కంటి చూపున –ననేకులు మెచ్చగ జంట నిల్వగా?
    కలగన కావ్య సుందరులె| కాంతలదృశ్యము నర్దమాయెగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  19. గురుమూర్తి ఆచారి గారి పద్యం......

    ఒక పె౦డ్లిలో ఇద్దరు ముత్తైదువలు స౦భాషి౦చుకొని యువతులకు స౦దేశ మిలా ఇస్తున్నారు.
    అమ్మాయిలూ! చక్కగా చీర. రవికె ధరి౦చి జడని౦డ మల్లెపూలు తురిమి లక్ష్మిదేవత వలె కనిపి౦చ౦డి.

    అది యొక పె౦డ్లికార్య మట యన్నుల మిన్నల భాషణ౦ బిటుల్
    మొదలయె “పట్టు చీరయును, పూలు జడన్ ధరియించి, మ౦గళ
    ప్రదముగ ను౦డగా వలయు భామిని మానినియై గృహ౦బులో
    న దిరుగు లక్ష్మి దేవత యన౦ దగు కాని యిదేమి కాల దు
    ర్వధియొ కదా యసహ్య మగు వేషము ఫ్యాష నట౦చు నె౦చుచున్
    ముదితలు కొ౦త మ౦ దెగసి పోయి చరి౦తురు సిగ్గు లజ్జలన్
    వదలుచు చూడు, చూడు మన వైపునకున్ జనుదె౦చు జవ్వనిన్
    పెదవుల ర౦గు నద్దుకొని, బెత్తెడు మ౦దము సుద్ద రుద్ది, పె౦
    జిదుగు కురుల్ భుజాల పయి చె౦పల మీదను వ్రేలుచు౦డ, ప
    య్యెద బరు వౌ నట౦చు ధరియి౦పక యే నడయాడు నక్కటా!

    {మానిని = మానవతి, మర్యాద గల స్త్రీ }

    రిప్లయితొలగించండి
  20. ముద్దు గుమ్మ లేగె ముద్దులూరించుచు

    పట్టు చీర గట్టి పరవశాన

    మల్లెపూలు దురిమి యుల్లముల్దోచిరి

    మన్మథునికి కూడ మనసు చెదర


    విద్వాన్ డాక్టర్ మూలె . విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి