7, ఫిబ్రవరి 2016, ఆదివారం

పద్యరచన - 1164

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

  1. నోటు చూస్తె చాలు నోటనీరు ఉబుకు
    కాటు వేసె నంటె ఘాటు నుండు
    నోటు లేని యెడల నోటమాటరాదే
    జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      ‘చూస్తె, అంటె’ అని వ్యావహారికాలు ప్రయోగించారు. ‘నీరు+ఉబుకు=నీరుబుకు’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘నోటు గనిన చాలు నోట నీర ముబుకు| కాటు వేయు నదియె ఘాటుగాను...’ అందామా?

      తొలగించండి
    2. మీ లాంటి పెద్దల సూచనలు మాలాంటి వారికి ఎంతో అవసరం...

      తొలగించండి
    3. మీ లాంటి పెద్దల సూచనలు మాలాంటి వారికి ఎంతో అవసరం...

      తొలగించండి
  2. ధరణి తిరుగు చుండు తనచుట్టు తానును
    పిదప రవిని చుట్టు విధము నరుడు
    ధనము చుట్టు దిరిగి తచ్చాడు చుండును
    తనకు తాను దాని బానిసగుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగుంది.
      ‘తచ్చాడుట’ వ్యావహారికం. ‘..దిరుగుచును గ్రుమ్మరుచునుండు’ అందామా?
      చివరిపాదంలో యతి తప్పింది. ‘బానిస+అగుచు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘తానె దాని కొక్క బానిస యయి’ అనండి.

      తొలగించండి
  3. యెరిగించెదవిను మిటకలి
    పురుషుని యవతారమిదియె కలియుగ మందున్
    నరవాహనమెక్కి తిరుగు
    ధరణీతలమందు జూడ ధనమను పేరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగుంది.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ‘ఎరిగించెద’ అనండి.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. 5:56 [AM]
      కాలపు విలువనెరుంగక
      యీలాగున లెక్కవేయ నిడుములు గదరా!
      చాలించి, లెక్కఁ బెట్టెడు
      సౌలభ్యమ్మున్న యంత్ర సాయము గొనుమా!

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘యంత్రసాయము’ అనడం దుష్టసమాసం. ‘సౌలభ్యపు యంత్రములను సాయము...’ అందామా?

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

      కాలపు విలువనెరుంగక
      యీలాగున లెక్కవేయ నిడుములు గదరా!
      చాలించి, లెక్కఁ బెట్టెడు
      సౌలభ్యపు యంత్రములను సాయము గొనుమా!

      తొలగించండి
  5. శుభోదయం !

    రూపాయి నోటు మధ్యన
    పాపాయి చిరునగవు ఘన పాఁతఱ గాంధీ
    మాపాట్లు చూడుమయ్యా
    సాపాటు గతికి యిదెగద సారము మరియున్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘ఘన పాఁతఱ’ అన్నది దుష్టసమాసం. ‘చిరునగవు గలవాఁడవు గాంధీ’ అందామా? ‘గతికి నిదెగద’ అనాలి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  6. కనులముందు డబ్బు కన్పించు చున్నను
    మనది కాదటంచు మదిని తలచ
    ఆత్మశాంతి కలుగు అనిశంబు నరునికి
    బంధముక్తుడగును భవమునుండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోపాలుని మధుసూదన రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ధనమది లెక్కకు మిక్కిలి
    మనమున పరరికించి చూడ మారు నటంచున్
    తనరుచు నెక్కువ తక్కువ
    గనినంతనె గలుగు భీతి కలత పడంగా

    రిప్లయితొలగించండి
  8. నోట్లోన వ్రేలు ముంచకు
    నోట్లను లెక్కించు వేళ నో మానవుడా
    కోట్లాది సూక్ష్మ జీవుల
    కట్లే వాసమ్ము రోగ కారకములుగా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ‘నోట్లు’ అన్న అన్యదేశ్యంకోసం దుష్కరప్రాసను ఆశ్రయించారు. బాగుంది.

      తొలగించండి
  9. ద్రవ్యమున్న జనులు దాసోహమందురు
    ధనము లేని యెడల దరికి రారు
    ధనమె జగతి నిపుడు తన గుప్పిట నునిచె
    తెలిసి మసలు కొనుము తెలివి తోడ.
    2ధనము వెంట బడుచు దారితప్పకు సుమా
    ఆత్మవంచనెపుడు హాని చేయు
    స్వార్థబుద్ధిఁ విడువ సంపద నీకబ్బు
    స్వార్థపరుడ వగుచు జారి పడకు.
    3.ధనము చెంత నున్న తలతురు మిత్రులు
    తరిగి పోవ నెవరు దలవరయ్య
    దార సుతులకంచు ధనమోహమున బడి
    భవిత చెడుపు కోకు భవ్య చరిత.
    4.ధనమదెంత యున్న తన వెంట రాబోదు
    జన్మ మెత్తునపుడు జతగ రాదు
    నడుమ వచ్చు ధనముఁనమ్మి చెడుట యేల
    విషయలోలు డగుచు వెతలు బడకు.

    5.జగతి కిలను ధనమె సర్వస్వ మనుచును
    మాయలోన బడుచు మారబోకు
    ద్రవ్యమె విడదీయు తనవారి నెల్లను
    ధనము వెంట బడి సుదారి విడకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ ఐదు పద్యాలు బాగున్నవి.
      ‘వంచన+ఎపుడు=వంచన యెపుడు’ అవుతుంది. ‘సుదారి’ అనడం దుష్టసమాసం.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. ధనమున్న గలుగు మిత్రులు
      ధనమున్న గలుగు బదవులు ధన ధాన్యములున్
      ధనమున్న బోవు దోషము
      ధన మూల మిదం జగత్కదా తలపంగన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. లెక్క పెట్టు చుండె రొక్కము నోట్లుగ
    చిత్ర మందు చూడు చిత్ర! నీవు
    వేల కొలది యుండు వేయినో టులకట్ట
    లచట చూసి చెప్పు రయము గాను

    రిప్లయితొలగించండి
  12. మానవత్వమును మరచి హీనమదిని
    ధనముచుట్టు తిరుగుచుండ్రి మనుషులంత
    ముల్లె సకల సౌఖ్యములకు మూలమనుచు
    ప్రేమబంధము లన్నియు వీగిపోయె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. బ్రతుకంత నోట్ల కొరకే
    మతి మంతుడు బద్రముగను మరి మరి నోట్లన్
    గతి తప్పక గణుతించుచు
    కుతుకముతో కట్ట గట్టి కూర్చుచు నుండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. అమ్మకానికి విద్య అంగడి సరుకైన
    --------నోట్లపై గాంధీకి నోరు రాదె?
    మానవతను దోచి దానవతను బెంచ
    ---------నోట్లపై గాంధీకి నోరురాదె?
    కట్న కానుక లందు కాంతలు బలిగాగ
    ----------నోట్లపై గాంధీకి నోరురాదె|
    వ్యసనపరుల బాధ వసుధ పై బెరుగంగ
    -----------నోట్లపై గాంధీకి నోరురాదె?
    గాంధి|మామహాత్ముండైన?గనుటకద్దు
    వారిభావాల కంటెను-భారతాన
    చిత్ర మందున గాంధి సుచిత్రు డైన?
    నోట్ల విలువల ధాటికి నోరురాదు|
    2.నోట్లే ప్రామ్సరి నోట్లై
    కాట్లీసెడి పాముకంటె కాల్మణి విషమై
    పాట్లను గూర్చగ గాంధీ
    నోట్లందున తొంగి జూడనోర్పేదేవా|


    రిప్లయితొలగించండి
  15. అన్నయ్యగారూ నమస్తే .ధన్యవాదాలు.
    2ధనము వెంట బడుచు దారితప్పకు సుమా
    ఆత్మద్రోహ మెపుడు హాని చేయు
    స్వార్థబుద్ధిఁ విడువ సంపద నీకబ్బు
    స్వార్థపరుడ వగుచు జారి పడకు.

    ఇలా సవరిస్తే సరిపోతుందా.
    అలాగే చివరి పాదంలో
    ధనము వెంట నడ్డ దారిఁ బడకు.
    సరిపోతుందేమో చూడండి.

    రిప్లయితొలగించండి