23, ఫిబ్రవరి 2016, మంగళవారం

పద్యరచన - 1173

కవిమిత్రులారా,
పైచిత్రాలను పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

30 కామెంట్‌లు:


  1. అవుర యేమిటి ఈ పండు అచ్చు సున్న
    వోలె ఉన్నది కవివర ! ఓం ప్రధమము
    చూడ ! చూడను రుచులూరె ! చూచి యేమి
    జేతు ? తెలియరాలె కవిత చెప్ప నిచట

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగుంది. ‘తెలియరాదు’ అనండి.
      వీటిని ‘సీమచింతకాయ’లంటారు. ఇంతకాలం ‘తెలంగాణాలో సీమచింత అంటారు, కోస్తాంధ్ర, సీమల్లో ఏమంటారో?’ అనే సందేహం ఉండేది. రాజేశ్వరి అక్కయ్య ‘సీమచింత’ అన్నారు కనుక తెలుగునేల అంతటా ఇదే పేరున్నట్టుంది. వ్యవసాయ క్షేత్రాల్లో అక్కడక్కడా ఈ చెట్లు కనిపిస్తారు. చిన్నతనంలో ఈ కాయలకోసం వెళ్ళడం, కాపలావాడిచేత తిట్లు, దెబ్బలు తినడం ఇంకా గుర్తే. ముళ్ళుంటాయి కనుక చెట్టెక్కి కాయలు తెంచడం కష్టం, కర్రతోనో, రాళ్లతోనో కాయలు రాలగొట్టాలి.
      మాలిక పత్రికలోని ఈ కథను చదవండి....
      సీత - సీమచింతచెట్టు

      తొలగించండి
    2. అవును చిన్నప్పుడు మాతాతగారి ఇంట్లో మా పెరట్లో ఈసీమ చింత చెట్లు ఉండేవి చాలా పల్లెటూరు " తాడేపల్లిగూడెం దగ్గర ఆరుకొలను " అని [ అక్కడ ఆరుకొలనులు ఉన్నాయి .] అదివాడుకలో " ఆరుగొల్లు " ఐంది

      తొలగించండి
  2. సీమ లందు దొరకు సీమచింత యనుచు
    తినగ నెంచి జూడ తీయ నుండు
    రింగు రింగు జుట్టి రంగులీ నుచునుండు
    పేరు చింత గాని ప్రేమ మెండు

    రిప్లయితొలగించండి
  3. బీరకాయలుండగ నేతి బీరకాయ!
    రేగపళ్లుండగన్ గంగిరేగు! నట్లె
    చింతకాయుండగన్ సీమచింతకాయ!
    సృష్టి పరమాత్మ సరదాల దృష్టిఁ దెలుపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. చింతకాయగాదు సీమ చింతయదియు
    రూపమందు మరియు రుచిన జూడ
    స్వల్ప మైన తేడ వగరునే కలిగనన్
    నోట జూడ నీటి యూట బెంచు

    రిప్లయితొలగించండి
  5. వనముల యంద పురముల గ
    ననరుదు మధుర ఫలములు మనసును హరించున్
    ఘన పుష్టి దాయ కమ్ములు
    కను విందుగ సీమచింత కాయలఁ గనినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మావూరి గోదావరి లంకలోకి వెళ్ళి కాయలు కొట్టి , యేరుకొని తింటూ సాయంకాలనికి యిల్లు చేరుకొనే వాళ్ళము. ఆ జ్ఞాపకాలు మధురాతిమధురము.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఆ కాయలు అందరికీ బాల్యస్మృతులే. మేము చిన్నతనాన ‘శివచింతకాయ’ లనేవాళ్ళం.

      తొలగించండి
  6. సీతకోక,చిలుక సింగారమేదాల్చి
    ముళ్ళ చెట్టు పైన ముడుచుకొన్న
    సిమచింతకాయ చేరదీయరదేల?
    అందకున్న పులుపు|అందతీపి
    నందజేతుగాన నలుసుగ భావించి
    చిన్నచూపు యందు చింతయున్న?
    కట్టె,రాళ్ళచేత కొట్టినా భరియింతు
    పరుల మేలుగాన పరవశింతు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మంచి భావాన్ని అందించారు.
      ఆటవెలదిని ఎనిమిదిపాదాల పద్యంగా వ్రాశారు. దీనికి ఆ అవకాశం లేదు.

      తొలగించండి


  7. సీమచింతకాయదినగచేదు,వగరు
    గలిగియుండును చెట్లవికనబడునట పల్లెటూరులయందునబహుళముగను
    పోయిచూతమురారండి భూరుహములు

    రిప్లయితొలగించండి
  8. సీమ చింత చెట్ల చిత్రంపు ఫలములు
    తీపి గురుతు లండి తిన్న మాకు
    రాలు రువ్వి వాని రాల్చిన సమయాన
    వీపు పగిలె , నాడు విరిగె నడుము !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సీమ చింత చెట్ల చిత్రంపు ఫలములు
    తీపి గురుతు లండి తిన్న మాకు
    రాలు రువ్వి వాని రాల్చిన సమయాన
    వీపు పగిలె , నాడు విరిగె నడుము !

    రిప్లయితొలగించండి
  10. మాచిన్నప్పుడు మా ఇంటిముందే వుండేదీ చెట్టు.బాగా తినే వాళ్ళం.ఇప్పటికీ ఆదోనిలో నేను పనిచేసిన కళాశాలలో వుందీ చెట్టు.చూసినప్పుడెల్ల పాతరోజులు గుర్తుకొచ్చేవి.మళ్ళీ ఇప్పుడు గుర్తుచేశారు ధన్యవాదాలండీ.
    సీమచింతకాయ సీమలోన దొరకు
    తెల్లపండులోన నల్ల విత్తు
    తినగ నోరు యూరు తీపిదనముకల్గి
    మరల మరల తినగ మనసు కోరు.
    2.'చింత'పేరులోనె సీమ చింతకు చూడ
    తినుచు నుండ చింత తీరు చుండు
    వుంగరాల వోలె వంపులు దిరిగిన
    కాయలు తిన రండు కాంక్ష తోడ.
    3.రంగురంగు లుండి రంజుగ కన్పించు
    చూడచూడ మదికి చోద్యముగను
    చుట్టుచుట్టు తిరిగి సొగసుగ యగుపించు
    మోజు తీర తినగ ముందు రండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి.
      మొదటిపద్యంలో ‘నోరు+ఊరు’ అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. ‘నోరె యూరు’ అనండి.
      రెండవపద్యంలో ‘వుంగరాలు’ అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వో లతో పదాలు లేవుకదా! ‘తీరుచుండు| నుంగరాల వోలె...’ అనండి.
      మూడవపద్యంలో ‘రంజు’ సాధువు కాదు. ‘రమ్యమై కన్పించు’ అనండి. అలాగే ‘సొగసుగ గనుపించు’ అనండి.

      తొలగించండి
  11. చీమ చింత కాయ చిత్రపు రుచితోడ
    పిల్లల మది దోచు పల్లెలందు
    చిన్నతనము నందు చెట్లపై కెక్కిన
    తీపిగురుతులు మదిఁదిరుగు చుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      వీటిని ‘చీమచింత’ అనికూడ అంటారా? మేమేమో చిన్నతనాన ‘శివచింత’ అనేవాళ్ళం.

      తొలగించండి
  12. .చింతకాయలు కావులే యిట సీమ చింతయు గాయలే
    వింతరూపముబొందియున్ |తగు ప్రీతి నింపెడి రంగునన్
    కొంత గుజ్జును గల్గినా?మనకోర్కె దీర్చునుపండులా|
    అంత మాయగనుండులే తన అంతరంగమురీతిగా|

    రిప్లయితొలగించండి
  13. దొన్నె బట్టి చెలుల తోడ దోర కాయ లేరుచున్
    తిన్న రోజులన్ని పోయె తిరిగి రాక నెప్పుడున్
    వన్నె లీను సీమ చింత వరుస జూడ చిత్రమున్
    చిన్ననాటి గురుతు లన్ని చిత్తమందు నిల్చెనే!!!

    రిప్లయితొలగించండి
  14. పులుపు వగరు చేదు కలగలుపు రుచియె
    సీమ చింత కుండు చిత్రమదియె
    పాకశాలయందు పరికించి చూసినన్
    స్థానముండబోదు తనకు నిజము

    రిప్లయితొలగించండి