28, ఫిబ్రవరి 2016, ఆదివారం

పద్యరచన - 1178

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

41 కామెంట్‌లు:

  1. దూర దర్శనమును ధూర్త దర్శనమంచు
    దూఱు టేల నికను వారి సేవ
    వారి కొరకు జనుల పాట్లనే గాంచెనో
    అశ్రుధారలుమనకంద జేసె.

    రిప్లయితొలగించండి
  2. కడివెడు కన్నీళ్లు కురువ
    కడవన బట్టితి జిలేబి కన్నుల దానా
    గడగడ నిండెను కడవలు
    వడివడి బట్టితి గదోయి వరుసన గూడన్ :)

    రిప్లయితొలగించండి
  3. కడవ నిండగ కన్నీట కనక లక్ష్మి
    నీటి కరువును దెలుపుచు మేటి గాను
    వార్త జదువగ దర్శిని యార్తి నొంది
    భార మైనట్టి కొలువున బ్రతుక వలదు

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సర్వలఘు కందము గ సవరించిన నిన్నటి పద్యము. పరిశీలించ గోర్తాను.

    విమల ధవళ తనురుచి ప్రభ
    శమ సహన విజిత ధరణి వృషభవరు సఖునిన్
    మమత నధర సుధఁ దనిపెను
    సుమమృదునిభతను సలలిత సుహృదయ మలరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ సర్వలఘుకందం అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  5. ధారా వాహిక విలసి
    ద్వారిజ నయనాంబక స్రవ వారి ఘన సుధా
    ధారా భరిత కలశ నివ
    హారవ సంభ్రమము దెలుపు నక్షయ వారిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ దీర్ఘసమాసభరిత పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి


  6. ఏమిబాధలువచ్చెనోనేమొకాని దూరదర్శినియందునదుహితయొకతె దుఃఖమొందుచుగనబడెదోయజాక్షి! కారణంబునునడుగుముకలతకుమరి

    రిప్లయితొలగించండి
  7. కంట నుండి పొంగు కన్నీటి విలువయే
    మరచి పోయిరేమొ మాధ్యమమ్ము
    పంపు వెట్టి నీరు నింపుకో మనిరేమో
    ఏడ్పు గొట్టు కథల నిచ్చు చుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవపద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  8. కన్నా!రారా చూపెద
    కన్నీరును గార్చుచుండె ఘనమగు టీవీ!
    ఎన్నోకథలను జెప్పుచు
    విన్నాణమునీనుచుండు విచ్చలవిడిగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  9. పద్య రచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మగడు వేసరి సతి నిట్లు మ౦దలి౦చె :-

    " ఏడ్పు గొట్టు సీరియలుసు ఏల చూడ. ? "

    నగుచు నిడె సమాధానము నాతి యిటుల. :-

    " తీరు నీటెద్ద. డామెకన్నీరు వలన "

    టీ.వి. ఢామ్మనె ని౦త. షా ర్టే జి వచ్చి
    ,,,,,,, ,,,,,,,,,,,,,,,, , ,,,,,,,,,,,,,,,,
    ి

    రిప్లయితొలగించండి
  10. పద్య రచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మగడు వేసరి సతి నిట్లు మ౦దలి౦చె :-

    " ఏడ్పు గొట్టు సీరియలుసు ఏల చూడ. ? "

    నగుచు నిడె సమాధానము నాతి యిటుల. :-

    " తీరు నీటెద్ద. డామెకన్నీరు వలన "

    టీ.వి. ఢామ్మనె ని౦త. షా ర్టే జి వచ్చి
    ,,,,,,, ,,,,,,,,,,,,,,,, , ,,,,,,,,,,,,,,,,
    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచార గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘సీరియలుసు+ఏల’ అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! ‘సీరియలుల నేల చూడ’ అందామా?

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. నీరే జీవాధారము!
      కూరిమితో 'దూరదర్శి' కుడువగ నశ్రుల్!!
      ధారాపాతమ్ముగ!!! నది
      నేరమగున్నొక కుళాయినిడి గొనకున్నన్!!!!

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. కన్నీటి కష్టాలు కడవలతో నింప
    -----నీటియెద్దడి మనము నిలుపగలమ?
    వర్ష బింధువులన్నివసుధయే నిలువుంచ
    -------ఇంకుడు గుంతల నెంచుకొనుము
    భూగర్భ జలములే పూర్తిగనిండిన
    ----జీవరాసికెపుడు జీవమగును
    చెట్ల పెంపక మందె చేటునుమాన్పును
    -----కొట్టినకష్టాలు ?కోట్లు బెరుగు|
    అవసరానికి నీరు నిన్నాదుకొనును
    ------పొడుపు జేసెడి మార్గాలు పొందుబరచు
    అన్నసత్యంబు నిత్యంబునాచరించ
    సర్వ జీవుల సౌఖ్యంబు సాకుటగును

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ధారావాహికలను గని
    ధారగ కన్నీరు గార్చి దడియుచు టీవీ
    నీరేదయినను నీరే
    తీరుగ మరి వాడుడనుచు తెలుపుడి జేసెన్!!!

    రిప్లయితొలగించండి
  15. నీటి పొదుపులేక నిలువవుబ్రతుకులు
    -----ముందుచూపు మనకు ముఖ్యమనగ
    ఇల్లంటు కొనుచుండ-ఇస్మాయిలందున
    ------బీడి నంటించెడి వాడివిధము
    శివరంజనీ రాగ వివరణ బాడగ?
    -----కన్నీటి దారలే కార్చటివి|
    వచ్చిన నీటిని- నచ్చినరీతిగా
    -------పట్టెడి మార్గాన బట్టుకొనుట|
    కలికి కన్నీరు గార్చిన కరుగు సుఖము
    అన్నసామెత మనయందునున్నఫలమ?
    గాలి,నీరు,తిండి దరుగ?కలిమిబలిమి
    నిలచునా?నీరుపొదుపున నిలవలుంచు.

    రిప్లయితొలగించండి
  16. మొన్నటి శుక్లాంబరధర శ్లోకమునకు పద్యం !

    శ్వేతాంబరధర ! నాలుగు
    చేతులు గలదొర ! శుభకర ! చేకూర్చుము సం
    ప్రీతిని శశివర్ణ ! నమో
    వ్రాతము విఘ్నోపశమన ! వారిజ నయనా !!!

    రిప్లయితొలగించండి
  17. ధారావాహిక లెన్ని చూచినను కాంతాశోకజాశ్రుల్ మహా
    ధారల్ యేరులు కాల్వలున్ సుజలపాతాల్ బావులున్ చెర్వు లా
    పారావారపు పొంగులింతియ కదా పాత్రౌచితీశూన్యమై
    దూరాలోకనపు ప్రసార సరణుల్ తోచున్ సదా హేయమై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ రామేశ్వర యాత్ర శుభంగా చేసికొన్నందుకు అభినందనలు.
      మీ పద్యం బాగున్నది.
      ‘ధారల్+ఏరులు’ అన్నపుడు యడాగమం రాదు. ‘ధారల్ కాల్వలు నేరులున్ సుజల...’ అనండి. ‘దూరాలోకనపు ప్రసార’ అన్నచోట గణదోషం. ‘ప్ర’తో ‘పు’ గురువు కాదు. దూరాలోకనపుం బ్రసార...’ అందామా?

      తొలగించండి
    2. గురువుగారూ మీ అభినందనలకు, తప్పుల సవరణలకు ధన్యవాదాలు.

      తొలగించండి
  18. నీరే దొరకదుయిక క
    న్నీరే గతియనుచు జెప్పు నీరజముఖి యే
    దారావాహికగన సమ
    కూరును దగినంత నీరు కూయుము తల్లీ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘దొరుకదు+ఇక’ అన్నపుడు యడాగమం రాదు. ‘దొరకదులే క|న్నీరే...’ అందామా?

      తొలగించండి
  19. నిన్నటి పద్యాలనోసారి చూడండి అన్నయ్యగారూ.
    తలరాతను నిందించుచు
    తలపుల లోనమునిగి కలతను చెందన్ యా
    తలనొప్పి యధిక మగుచును
    తలతిరుగుడు మొదలగు వనితామణికిన్.

    తలవాకిట నిలబడి నీ
    తలపుల ఝరిలో మునుగుచు దారిన్ చూడన్
    తలకున్ మీరిన వెతలిట
    తలపున్ తబ్బిబ్బు చేసి తల్లడ పరచున్.

    రిప్లయితొలగించండి
  20. నిన్నటి పద్యాలనోసారి చూడండి అన్నయ్యగారూ.
    తలరాతను నిందించుచు
    తలపుల లోనమునిగి కలతను చెందన్ యా
    తలనొప్పి యధిక మగుచును
    తలతిరుగుడు మొదలగు వనితామణికిన్.

    తలవాకిట నిలబడి నీ
    తలపుల ఝరిలో మునుగుచు దారిన్ చూడన్
    తలకున్ మీరిన వెతలిట
    తలపున్ తబ్బిబ్బు చేసి తల్లడ పరచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి.
      మొదటి పద్యంలో ‘కలతను చెందగ నా...’ అనండి. ‘చెందన్+ఆ’ అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి