4, ఫిబ్రవరి 2016, గురువారం

సమస్య – 1934 (ద్రౌపది కొక్కఁడే పతి గదా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.
ఈ సమస్యను పంపిన మంతా భానుమతి గారికి ధన్యవాదాలు.

57 కామెంట్‌లు:

  1. గురువు గారికీ కవిమిత్రులకు నమస్కారములు

    కోపము జేయబోకుమిది కూడదు పాపపు మాటలంచు న
    న్నాపకు మోయి జూదమున యాలిని యొడ్డిన యగ్రజుండ నే
    యాపగ లేని తమ్ములసహాయత గాంచిన తెల్యకున్నదే
    ద్రౌపది కొక్కడే పతిగదాయని చెప్పిన మెచ్చిరెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...యాలిని నొడ్డిన’ అనండి. ‘తెల్య’ అనడం సాధువు కాదు. ‘...గాంచి యెఱుంగకున్నదే’ అనండి.

      తొలగించండి
    2. గురువు గారికీ కవిమిత్రులకు నమస్కారములు

      కోపము జేయబోకుమిది కూడదు పాపపు మాటలంచు న
      న్నాపకు మోయి జూదమున యాలిని నొడ్డిన యగ్రజుండ నే
      యాపగ లేని తమ్ములసహాయత గాంచియెఱుంగకున్నదే
      ద్రౌపది కొక్కడే పతిగదాయని చెప్పిన మెచ్చిరెల్లరున్

      తొలగించండి
  2. రూపములైదు గాని మరి రూడిగ నొక్కరె యన్నదమ్ములున్
    పాపపు భారమున్ భువికి బాపగ నింద్రుడె వచ్చె నైదుగన్
    చూపులె వజ్రమైన శచి జోరుగ వచ్చెను యాజ్ఞసేనిగా
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్!!

    రిప్లయితొలగించండి
  3. తాపసి యైనద్రో వదట తాపము నందున నీశుకో రగా
    శాపము నొందినా డనగ శంకరు సాసన మంచునిం ద్రుడే
    రూపము లైదుగా మరలి రూఢిగ నొక్కడె మత్స్యుడౌ నటన్
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మత్స్యుడు’...?

      తొలగించండి
  4. గురువులకు ప్రణామములు
    మత్స్యుడు = మనుష్య లోకమున పుట్టినవాడు , మానవుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మర్త్యుడు అంటే మానవుడు. ఉపరిచర వసువు కొడుడు మత్స్యుడు. అతని పేరు మీదనే మత్స్యదేశం ఏర్పడింది.

      తొలగించండి
  5. ద్రౌపదికొక్కడేపతిగదాయనిచెప్పినమెచ్చిరెల్లరు
    న్బాపముగాదెయిట్లుడువ ద్రౌపది సాధ్వియ పాండవుల్గన
    న్రూపములైదుగాని,నరయుండొకరేయనినింద్రునంశముల్
    ద్రౌపదిపాతివ్రత్యమునదారెవరున్సరిరారుగాభువిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగుందండీ.. పంప భారతంలో పంపనార్యుడు చేసిన మార్పును చూసి, ఈ సమస్యకి మన వాళ్ల స్పందన గమనిద్దామని ఇచ్చాను. అంతే.. ఆవిడంటే నాకు చాలా ఇష్టం.

      తొలగించండి
    2. చాలా బాగుందండీ.. పంప భారతంలో పంపనార్యుడు చేసిన మార్పును చూసి, ఈ సమస్యకి మన వాళ్ల స్పందన గమనిద్దామని ఇచ్చాను. అంతే.. ఆవిడంటే నాకు చాలా ఇష్టం.

      తొలగించండి
    3. మంథా(తా?) భానుమతి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

      తొలగించండి
    4. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఆపదలందు వేడుకొన నన్నియు వేళల నండదండగా
    నాదుకొనంగ భక్తులకు నందరికేపతి యయ్యె శ్రీపతే
    పేదకుచేలు, నామకరి పీడను తీర్చగ నాకరీంద్రుకున్
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
  7. దాపున నుంచి పండనుచు తల్లితొ కల్లలు సెప్పగా నదే
    యాపె కుమారులన్ కని నయంబున పంచుకొనమ్మనంగనున్
    దాపుగ పంపనార్యుడదె తర్కము యోచన చేసి యెంతయో
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంథా భానుమతి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తల్లితొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘తల్లికి కల్లలు...’ అనవచ్చు కదా!

      తొలగించండి
    2. నిజమేనండీ. ధన్యవాదములు. బాగుంది, తల్లికి కల్లలు అంటే..

      తొలగించండి
  8. ఆపతు లేవురైనను సభాంతర మందున భార్య వస్త్రమున్
    ఊపున లాగుచుండ గని యోర్మి వహించి సహించ, లోక ర
    క్షాపతి గాచె మానమును చల్వలనిచ్చి అనాథ నాథుడే
    ద్రౌపది కొక్కడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  9. ఆపద లందు గాచెడి మహాత్ములు ధారుణి గొందరే గదా!

    బాపెను చక్రవర్తి'శిబి''పావుర మొందిన కష్టమున్ భళా !

    భూపతి కౌరవా గ్రజుని భూరి సభాంతర వస్త్ర దానుడే

    ద్రౌపది కొక్కడే పతి గదాయని చెప్పిన మెచ్చిరెల్లరున్!

    విద్వాన్ డాక్టర్ మూలె. విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్వాన్ డా. మూలె రామమునిరెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వస్త్రదాతయే’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  10. శ్రీపతి కృష్ణమూర్తి దరిజేరకె చీరలొసంగె నేరికిన్ ?
    భూపతు లెందరున్న సతి ముక్తికి హేతువదెవ్వరో సఖా ?
    శ్రీపరమాత్ము డెచ్చటను చెప్పిన గీతను మెచ్చిరెల్లరున్ ?
    ద్రౌపది-కొక్కడే పతిగదా -"యని" చెప్పిన మెచ్చిరెల్లరున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  11. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “పూరువంశము” ను “పురువంశము” గా వ్రాయకూడదేమో నని అనుమానము వచ్చి సవరణ కూడా వ్రాసాను.

    క్ష్మాపతు లేవురిన్నియమ కర్తలునై యొక వత్సరం బొకం
    డా పడతింట నుండ సమయావృత బద్ధత నుండు నట్టుల
    న్నాపురువంశవర్ధనులు నారదు పంపున సంచరింపగన్
    (న్నాపతు లేవు రింపుగను నారదు పంపున సంచరింపగన్)
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "పురువంశవర్ధనులు" దోషరహితమేనా? తెలుపగోర్తాను.

      తొలగించండి
    3. పూరువంశ మనడమే సాధువు. పూరువు యొక్క వంశం.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      క్ష్మాపతు లేవురిన్నియమ కర్తలునై యొక వత్సరం బొకం
      డా పడతింట నుండ సమయావృత బద్ధత నుండు నట్టుల
      న్నాపతు లేవు రింపుగను నారదు పంపున సంచరింపగన్
      ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

      తొలగించండి
  12. శ్రీపతి కృష్ణమూర్తి దరిజేరకె చీరలొసంగె నేరికిన్ ?
    భూపతు లెందరున్న సతి ముక్తికి హేతువదెవ్వరో సఖా ?
    శ్రీపరమాత్ము డెచ్చటను చెప్పిన గీతను మెచ్చిరెల్లరున్ ?
    ద్రౌపది-కొక్కడే పతిగదా -"యని" చెప్పిన మెచ్చిరెల్లరున్!

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { ద్రౌపది ని దుశ్శాసనుడు అవమాని౦చినపుడు మిగత నల్వురు భర్తలు
    ఊరకు౦డ గా , భీముడు ఒక్కడే ఆగ్రహ౦చెను.
    అపుడ౦దరు అనుకున్నారు = " ద్రౌపది శోకము బాప భీము డొకడే ద్రౌపది భర్త. "ి
    ి
    ………………………………………………..



    పాపము పుణ్య మ౦ చనక పయ్యెద
    నిగ్గుచు , కొప్పు నీడ్చుచున్ ,

    ద్రౌపది నోలగమ్మునకు లాగెను దుష్టుడు
    దుస్ససేను ; డే

    పాప మెరు౦గ మే ( ఏ ) మనుచు భర్తలు
    నల్వురు మౌనమూనగా ,

    నా పవమానపుత్రుడు మహాగ్రహ మొ౦ది
    తురమ్ము న౦దు మి

    మ్మే పడగి౦తు న౦చనియె | " ని౦తకు
    నాయమ. శోక మార్పగా

    ద్రౌపది కొక్కడే పతి గదా " యని చెప్పిన
    మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  14. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. ద్వాపర కాలమందు భరతావని వెల్గిన భారతంబునుం
      జూపగఁ జిత్రరాజమున సుందర రూపులు పాత్రధారుల
      న్నీపురమందు పాండుసుతు లేవుర కొక్కని నెంచ నత్తరిన్
      ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. 16ద్రౌపదివేష దారిణిని దగ్గరి బంధువు మేనమామతో
    పాపముచిన్ననాడె గ్రహ పాటుగ పెళ్ళియుజేసి రేప్పుడో
    ద్రౌపది కొక్కడే పతిగదా యని చెప్పినమెచ్చి రెల్లరున్
    చూపెడి నాటకాన గన జొచ్చిరినైదుగు రుండు పద్ధతిన్

    రిప్లయితొలగించండి
  17. తాపమునొంది కీచకుడు ద్రౌపది దుర్మతి వెంబడించగా
    భూపసభాంతరాళమున బోరున నేడ్చుసతీమణిన్ పతుల్
    చూపఱులట్లుకాంచగను సోమముఁజూపెను వాయుపుత్రుడే
    ద్రౌపది కొక్కడే పతిగదా యని చెప్పిన మెచ్చిరందరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. మాపటి భారతమ్ము కథ అయ్యరు జెప్పె ఫిడేలు వాటుగా
    శ్రీపతి ఆనగా అయిదు శ్రీపతులూ యొక వత్సరమ్ము గా
    ఆపతు లేగనెన్ అయిదు అమ్మల రూపము వీలుగా యనన్
    ద్రౌపది కొక్కడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శ్రీపతులూ’ అనడం వ్యావహారికం. ‘శ్రీపతులే’ అనండి. అలాగే ‘ఆ పతులే గనంగ నయి దమ్మ్లల రూపము వీలుగా ననెన్’ అనండి.

      తొలగించండి
  19. చూపగ మత్స్య యంత్రమును సూటిగ బాణము వైచి గూల్చగా
    నోపిన దెవ్వడో యతడె యుర్విని ద్రౌపది భర్త యంచనన్
    తూపున గూల్చు ఫల్గునుడె ద్రోవతి భర్తగ నొప్పు; నా విధిన్
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
  20. శాపము దప్పబోదు యిల శాస్త్రము మార్చిన యంచు కృద్ధులై
    పాపము జేరునంచు ఘన పండితులెల్లరు జెప్పిరప్పుడున్
    ద్రౌపదికొక్కడే పతిగదా యని చెప్పిన, మెచ్చిరెల్లరుల్
    భూపతులైన పాండవుల పుణ్యసతొక్కటె యంచు చెప్పగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...దప్పబోదు+ఇల, మార్చిన+అంచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘...దప్పబో దిలను.... మార్చిన నంచు’ అనండి.

      తొలగించండి
  21. ఏ పరిశోధనల్ నడిపె నీశు ప్రసాదిత సాధ్వినిన్ మహా
    రూపసిఁ గామినీ యనుచు గ్రుచ్చగ? భీముడె భావ ప్రాప్తికిన్
    ద్రౌపది కొక్కడే పతి గదా యని చెప్పిన మెచ్చిరెల్లరున్
    బాపపు మాటలాడినను 'పద్మవిభూషణ' మందజేయుచున్!

    రిప్లయితొలగించండి
  22. నెల్లూరి రెడ్డమ్మ:

    "కోపము సేయగా వలదు, కొన్టివ నడ్గక నొక్క చీరనున్?
    దాపున దాగుచున్ననవె: 'దండుగ చీరలు రోజుకొక్కటా!!!'...
    పాపము నాపెకున్నిడిన వందల చీరలు నిమ్షనిమ్షమున్
    ద్రౌపది కొక్కఁడే పతి గదా".....
    యని చెప్పిన మెచ్చి రెల్లరున్ :)

    రిప్లయితొలగించండి
  23. దీపము వోలుచున్ వెలిగి తీరిచి దిద్ది మనోగృహమ్మునున్
    తాపములన్ని తీర్చుచును ధైర్యము పెంచుచునన్ని వేళలన్...
    ఆపదలందు కాచుకొని హ్లాదము నిచ్చెడియా మురారి భల్
    ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి