14, ఫిబ్రవరి 2016, ఆదివారం

సమస్య – 1944 (వంక యున్నవాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వంక యున్నవాఁడు శంకరుండు.

46 కామెంట్‌లు:

  1. సగము మేను యొసగి పార్వతీదేవికి
    నంది నెక్కి తిరుగు నాగభూషణ స్వామి
    మూడు కనుల వాడు ముక్కోపి తలఁనెల
    వంక యున్నవాడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని మొదటి రెండు పాదాలలో గణదోషం. నా సవరణ....
      సగము మేనును హిమశైలపుత్రిక కిచ్చి
      నంది నెక్కి తిరుగు నాగధరుఁడు...
      (తల నెల... అన్నచోట అర్ధానుస్వారం అవసరం లేదు)

      తొలగించండి
  2. మెడన నాగు పాము జడలోన గంగమ్మ
    అర్థ భాగ మందు నాలి జేర్చి
    గళము నందు దాచె గరళమ్ము తలఁజంద్ర
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  3. పొంక మయిన బ్లాగు శంక రునిది మన
    వంకయున్నవాడు శంకరుండు
    చెంగ లువల దండ చెంతన పద్యము
    భంగి మలనగ ప్రతి బింబ ముగద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      చివరి పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
    2. కంది వారు,

      ఆఖరి పాదం లో భం కి బిం కి యతి పడదాండీ ?

      జిలేబి

      తొలగించండి
    3. బ-భలకు యతి ఉంది. కాని ఆ హల్లులమీది అచ్చులు అ-ఇలకు యతి లేదు.

      తొలగించండి
  4. చక్క నైన బ్లాగు శంకరా భరణమ్ము
    పద్య రచన నేర్పు పండి తుండు
    కలత లన్ని మరచి చెలిమిజే యుచుమన
    వంక యున్న వాడు శంక రుండు

    రిప్లయితొలగించండి
  5. వల్లకాట గృహము! భస్మమ్ము మైదాల్పు!
    సగము మేని నొకరు! శిగన నొకరు!
    తోలుఁ గప్పి భిక్ష దొరకఁ జూచెడు నెల
    'వంక' యున్న వాఁడు శంకరుండు!
    (అన్నియు వారికి వంకలె అందుకే 'వంక' అనివ్రాశాను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సిగను నొకరు' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
      వల్లకాట గృహము! భస్మమ్ము మైదాల్పు!
      సగము మేని నొకరు! సిగను నొకరు!
      తోలుఁ గప్పి భిక్ష దొరకఁ జూచెడు నెల
      'వంక' యున్న వాఁడు శంకరుండు!

      తొలగించండి
  6. గరళకంఠు పేర ఖ్యాతికెక్కన వాడు
    ఆఆటుపోట్ల నెన్నొ యనుభవించి
    స్థిత ప్రఙ్ఞు వోలెచిరునవ్వుతోడ మన
    వంక యున్న వాడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      'స్థితప్రజ్ఞు' అన్నచోట గణదోషం. 'కెక్కన-కెక్కిన, ఆఆటు-ఆటు' టైపు దోషాలు.

      తొలగించండి
  7. మూడు కనుల వాడు మోక్షమిచ్చెడివాడు
    శూల పాణి ,వ్యాఘ్ర చేల ధారి
    చేత డమురుకమ్ముశిరముపయిన నెల
    వంక యున్నవాఁడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
  8. వామ భాగ మందు పార్వతినే దాల్చి
    గరళ మేమొ దాచె గళము నందు
    మెడన నాగు పాము జడనగంగయు నెల
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  9. సగము మేనువాడు,శశిధరుండునగము
    నాభరణముగాగనలరువాడు
    భక్తు లనల రించు వాడును చిరునెల
    వంకయున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      శశిధరుండు, నెలవంక యున్నవాడు... అని పునరుక్తి.

      తొలగించండి
  10. భస్మ మంగ మెల్ల పార్వతి సవ్యమై
    కంఠమున గరళము గంగసిగఁ గ
    పాలమాల గ్రీవ పథి శిరమున నెల
    వంక యున్నవాఁడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మొలను కట్టు కొనును పులితోలు చేత త్రీ
    శూల మమరు కన్ను ఫాల మందు
    శిరసు నందు గంగ,సిగ పూవుగను చంద్ర
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. గురువుగారిచ్చిన సమస్యను నెలవంక లేదా చంద్రవంక అని మాత్రమే పూరించ నగును కానీ మనవంక, మావంక, మీవంక......ఇలా పూరించాలంటే సమస్యను వంకనున్న వాడు (ఉదా: మనవంక నున్నవాడు) అని మార్చాల్సి ఉంటుంది. అది సమ్మతం కాదు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారు మీరు చెప్పినది సత్యమే. ఆపద్ధర్మము గా సమస్యాపూరణలో వీరి వంక వారి వంకే కాదు మా “వంకయు + ఉన్నవాడు” లేక మా”వంకయును+ఉన్న వాడు” రెండు విధాలుగా వ్రాయ వచ్చునేమో యని నాభావన.

      తొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    చ౦ద్రు పైన కినిసి , శపియి౦చ దక్షు౦డు ,

    క్షయము నొ౦ద సాగె | శశిని దాల్చె

    శివుడు కరుణ నపుడు | శిరముపై యా నెల

    వ౦క యున్న వాడు శ౦కరు౦డు ! ! !

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శివుని గూర్చి తపము చేయు పార్వతి చె౦త
    …………………………………………........
    కేగి యతి వేషము లోని శ౦కరుడు
    …………………………………………………
    అన్నటువ౦టి మాటలు
    …………………...........


    పచ్చి యేన్గు తోలు పచ్చడ౦బును దాల్చు

    భుజము పైన పాము భుస్సు మనును

    కాటి కాపరి నెటు కామి౦చెదవు నీవు ?

    వ౦క యున్న వాడు శ౦కరు౦డు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. గళమునందుజూడ గరళమ్ముగలవాడు
    శిరమునందుగంగదొరలు వాడు
    మూడు కనులవాడు ముందుసిగన చంద్ర
    వంక యున్నవాడు శంకరుండు !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సిగను' అనండి.

      తొలగించండి
  15. మూడు కన్నులున్న బూచులరాయడు
    సతిని మెయిని దాల్చు జంగమయ్య
    శిరము నందు గంగ సింగారముగ చంద్ర
    వంక యున్నవాడు శంకరుండు!!!

    రిప్లయితొలగించండి
  16. . బ్రహ్మ,విష్ణు,శివుడు పరికించ నొక్కరే
    త్రీడి పటము మనము తీసి చూడ
    ఒకరి కొకరు వేరు నికరము గనగ నీ
    వంకయున్నవాడు శంకరుండు.
    2.వంకజేయనతడు వనవాసి యౌను నీ {ఈరోజు ప్రేమికుల దినమనితన వైపు చూసెడి వాడినిగనిదెలుపుట}
    వంకయున్న వాదు శంకరుండు
    వంకబెట్టు కొనుచు వంకర చూపునే
    వంకదిద్దకున్న?వంగదీతు {వంక=నేరము}{వంక=సరిదిద్దకున్న}{వంక=ప్రక్క}


    రిప్లయితొలగించండి
  17. 13.2.16వాయుకలుషిత మంతట వసుధ నిండ?
    నీరు నిర్మల తత్వంబు నెగడ నపుడు
    కల్మషాలను నింపుచు కలతబెరుగ
    జలధరమ్ములు గరళ వర్షమ్ము గురిసె.
    శ్రీకందిశంకరయ్యగురువుగారికి వందనమునిన్నటి పూరణ పంపుచున్నాను దయతో పరిశీలించండి

    రిప్లయితొలగించండి
  18. అర్థభాగమవ్వ నంబ తా ప్రీతితో
    శిరపు మధ్య గంగ చిందులేయ
    ముందుభాగమందు ముచ్చట గా నెల
    వం క యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. భసిత విగ్రహుండు పార్వతీపతి మహే
    శ్వరుఁడు సకల పాపహరుఁడు శివుఁడు
    జగములెల్లఁ బ్రోచు సర్వేశ్వరుఁడు చంద్ర
    వంక యున్న వాఁడు శంకరుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. మేన బూది నద్ది మెడను నాగులనుంచి
    నుదుట నయన ముంచి కుదురు గాను వంక యున్నవాఁడు శంకరుండు.
    చేత శూల ముంచి సిగను గంగను , చంద్ర
    వంక యున్నవాఁడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో టైపాటు.

      తొలగించండి