17, ఫిబ్రవరి 2016, బుధవారం

సమస్య – 1947 (పాపాత్ములు భ్రష్టులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.

37 కామెంట్‌లు:

  1. గురువు గారికీ, కవిమిత్రులెల్లరులకు నమస్సుమాంజలులు

    1.
    కోపము స్వార్థము గలిగిన
    పాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతి
    న్నాపద లోనున్న జనుల
    గాపాడెడు సత్యవ్రతులు కరుణా మూర్తుల్ .

    2.
    పాపమనెంచక యున్నత
    మౌ పదవుల బొందదలచి మారణ కాండల్
    జేపించుచు నేతలయిన
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఆపదలు దాట గోరిన
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
    శాపము నొందిన వారలు
    నేపాపము జేయకున్న నేరస్తు లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      పద్యం నిర్దోషంగా ఉన్నా సమస్య పరిష్కరింపబడలేదు. చివరి పాదాన్ని ‘నీ పదములె పట్టుచుంద్రు నిజముగ కృష్ణా’ అందామా?

      తొలగించండి
  3. ఆపాదమస్తక విషపు
    పాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతి
    న్నాపార్థసారథుని కొలు
    వే పారుని నెలవుగరయు వేకువ విదురుల్


    వేకువ విదురుల్ = early raisers :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణలో చివరిపాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. ధన్య వాదాలండీ కంది వారు !

      పార్థసారథి ని కొలువే పాఱుఁని -బ్రాహ్మణుని-బ్రహ్మత్వం కోసం తపించే వారి - నెలవు యని తెలిసిన వేకువ విదురుల్ జనవంద్యులు జగతిన అన్న అర్థం తో వ్రాసా

      అక్కడ గరయ గ అన్నది తప్పను కుంటా నరయ అని రావాలా ? ?


      ఆపాదమస్తక విషపు
      పాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు జగతి
      న్నాపార్థసారథుని కొలు
      వే పాఱుఁని నెలవు నరయు వేకువ విదురుల్

      జిలేబి

      తొలగించండి
  4. సరదా శారదా :)

    వేపాకు వలదు వలదను
    పాపాత్ములు భ్రష్టులు; జనవంద్యులు, జగతిన్
    మా పాకము మెచ్చుదురో
    తాపాలను దీర్చు రసము తాళింపు గనన్ ?

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఏ పనిఁ జేసెడు వారల
    కా పనిలో విజయమంద యాశయముండన్
    శ్రీపతి దయఁగొనఁ దలతురు
    పాపాత్ములు, భ్రష్టులు, జనవంద్యులు జగతిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. పాపమ్ములు, పుణ్యమ్ములు
    తాపము కోపమ్ములిలను తగ మిళితముగా
    ఆ పగిదిని కలిసుందురు
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.

    రిప్లయితొలగించండి
  7. గోపాలుని దూరు జనులు
    పాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్
    జూపుచు నౌదార్యంబు
    న్నాపదలో నున్నవారి నాదుకొను గుణుల్ !!!

    రిప్లయితొలగించండి
  8. కోపావేశమ్ము లుడిగి
    పాపమ్ములకున్ మనమున బాధం బశ్చా
    త్తాపము జెందిన వారలు
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. హే పరమేశా!గొల్తురు
    పాపాత్ములు భ్రష్టులు, జనవంద్యులు జగతిన్
    బాపు మఘమ్ముల,నొసగుము
    నీపద కమలముల భక్తి నిరతము నిలుపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఏపఠనమ్మును చేయక
    భూపాలకులైన పంచి భూరిగ ధనమున్
    చూపించుచు దివి మాటల
    పాపాత్ములు భష్టులు జన వంద్యులు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. పాపములు జేయువారలు
    పాపాత్ములు ,భ్రష్టులు ,జన వంద్యులు జగతి
    న్నాపదుల గావు జనములు
    పాపము లంజోలి బోక బ్రదికెడు వారున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘...న్నాపదల గాచు జనములు...’ అనండి.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    జననీ ! నిన్ను దల౦చి, పూనితిని >హస్త౦బ౦దునన్ బుస్తక౦
    బును|నా చేతము న౦దు నీ విక. సత౦బున్ నిల్చి,స ద్వాక్కులన్
    ఘనమౌ రీతిని పల్క జేయుము |జగన్మాతా!దయారూపిణీ!
    వనజాతోద్భవు రాణి! వాణి! సుషమద్వాణీ!విప౦చీ ధరీ!

    { సుషమత్ = కోమలమగు, మనోఙ్ఞమైన ;
    విప౦చి = వీణ. }

    రిప్లయితొలగించండి
  13. ఈ పుడమి కంత తెలియును
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
    ఈ పరమ సత్య మెరిగియు
    నేపారుచు నీతి రహితు లెదిగిరి ధరలో.

    రిప్లయితొలగించండి
  14. ఈ పుడమి కంత తెలియును
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
    ఈ పరమ సత్య మెరిగియు
    నేపారుచు నీతి రహితు లెదిగిరి ధరలో.

    రిప్లయితొలగించండి
  15. కోపవశంబున వగతురు
    పాపాత్ములు బ్రష్టులు;జనవంద్యులు జగతిన్
    నాపద లొడమిన దేవుని
    రూపము ను దలచుచు నుందు రుర్విన్ గనగన్.
    2శాపవశంబున బుడుదురు
    పాపాత్ములు బ్రష్టులు ;జనవంద్యులు
    కోపరహితులై బ్రోతురు
    ఆపన్నులచేయి విడక హర్షము తోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో ‘బ్రోచెద| రాపన్నుల...’ అనండి.

      తొలగించండి
  16. లోపాలను గనుపించక
    రూపాలను సాకుచున్న?రోగిష్టులిలన్|
    చూపరులకు నాయకులై
    పాపాత్ములు,బ్రష్టులుజనవంద్యులుజగతిన్.

    రిప్లయితొలగించండి
  17. చూపింతు రసుర గుణములు
    పాపాత్ములు భ్రష్టులు ; జనవంద్యులు జగతిన్
    పాపాత్ములను క్షమించుచు
    కాపాడగ జూతు రెపుడు కరుణా మయులై

    రిప్లయితొలగించండి
  18. కోపము జేయంగవలదు
    నేపాలపు మాంత్రికులిట నేతలు కాగా
    గోపురములు కాజేసెడి
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!

    రిప్లయితొలగించండి


  19. సాపాటుకు గతి లేదు సు
    మా పరమాన్నముల నిత్తు మనిరి జిలేబీ
    మా పాలకులు భళారే
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. వ్యాపారము నందు మునిగి
    పోపులు ముల్లాలు హిందు పూజారులహో
    పేపరు టైగర్లవగా
    పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్

    రిప్లయితొలగించండి