19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సమస్య – 1949 (కృష్ణపదారాధనమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.
(తమ్ముడు, బావమరదుల దశదినకర్మలకు వెళ్తున్నాను. మూడు రోజులు మీ పూరణలను అవకాశాన్ని బట్టి సమీక్షిస్తాను. మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. ఈ మూడు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు.)

41 కామెంట్‌లు:

  1. తృష్ణగ పూజించ దలచి
    కృష్ణపదారాధనమ్ము,కీడొన రించు
    న్నుష్ణము లనుతొల గించగ
    విష్ణువును గొలిచి నంత వీడును క్లేశం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      కొంత గందరగోళంగా ఉన్నా మీ పూరణ బాగున్నది.
      'క్లేశం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. చివరి పాదంలో గణదోషం. 'విష్ణువునే కొలిచినంత విడు క్లేశమ్మే' అనండి.

      తొలగించండి
  2. తృష్ణక్కుడైన విజయుడు
    విష్ణువుతో మైత్రి సలిపి విజయము గోరన్
    జిష్ణువు శత్రువులకు నా
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'జిష్ణువు'కు అన్వయం?

      తొలగించండి
    2. జిష్ణువు అర్జునుడు గదా

      అర్జునుని శత్రువులకు అతని కృష్ణపదారాధన కీడుదెచ్చిందని భావంతో

      తొలగించండి
  3. కృష్ణుని గని శిశుపాలుడు
    కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్
    కృష్ణుని పూజ వలదనగ
    కృష్ణుడు పూజార్హుడనియె "కృష్ణ" యు గనుమా

    ఆఖరు పాదం లో రెండవ కృష్ణ ద్రౌపది

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కృష్ణుఁడు దేవుఁడు గాదని
    విష్ణువు తానేయటంచు వెఱ్ఱిగ బలికే
    నిష్ణాతిహీన "పౌండ్రక
    కృష్ణ" పదారాధనమ్ము కీడొనరించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారు పౌండ్రక వాసుదేవుని ప్రస్తావిస్తూ మీరు జేసిన పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'పలికే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'యటంచు ప్రేలెడివాడౌ' అనండి.

      తొలగించండి
    3. శ్రీకామేశ్వర రావుగారు,
      ధన్యోస్మి.

      గురువుగారికి వందనములు.
      మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యమేకదా.

      తొలగించండి
  5. కృష్ణుడు భగవంతుడుగద
    కృష్ణునిబూజించనొసగు గైవల్యంబు
    న్గృష్ణుని నిటులన నాయమె?
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్

    రిప్లయితొలగించండి
  6. విష్ణుపదప్రాప్తము భ
    క్త్యుష్ణము సుతదారధన వియోగము ననగన్
    తృష్ణవిహీన జనాంచిత
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.

    [ముక్కంటిని సేవించువారు బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండగ రమామనోవిభుని సేవించు వారు గడుఁ బేదలౌటకు కారణమడిగిన ధర్మరాజు తోకృష్ణుడుచెప్పిన మాటలు: ఎవనిపై నా కనుగ్రహము కలుగుతుందో యా యుత్తముని సమస్త సంపదలు హరించ వాడు ధహీనుడై బంధుమిత్రులచే విసర్జితుడై హరి భక్తులతో స్నేహము చేసి భక్తుడై వైకుంఠ ప్రాప్తికి నర్హున్ని చేస్తాను. ]

    రిప్లయితొలగించండి
  7. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుని సాయము కొరకై వెళ్లిన సుయోధనుని అంతరంగం:

    నిష్ణాతుడ నా కీర్తికి
    కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్
    తృష్ణగ సాయమడుగ మృగ
    తృష్ణ! శిరో భాగమున ప్రతీక్షణ మేలౌ!

    రిప్లయితొలగించండి
  8. వైష్ణవులు జేయు నిరతము
    కృష్ణపదారాధనమ్ము, కీడొనరించున్
    కృష్ణుని దూరిన చక్రము
    నిష్ణాతులయిన వదలక నిర్జించునిలన్!!!

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { పౌ౦డ్రక వాసు దేవుని మాటలు }

    కృష్ణుని శ౦ఖము గదయున్
    గృష్ణుని. చక్రము గలిగిన నే నే నిజమౌ
    కృష్ణుడ. మీ కా యాదవ
    కృష్ణపదారాధనమ్ము కీ డొన రి౦చున్

    రిప్లయితొలగించండి
  10. జిష్ణునకు మేలొనర్చెను
    కృష్ణ పదారాధనమ్ము, కీడొనరించున్
    నిష్ణా తులయ్యు విద్యల,
    విష్ణుని సతతమ్ము దూఱు విమతుల కెపుడున్
    జిష్ణుడుః విజయుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. కృష్ణుడు నేనే యనుచా
    కృష్ణుని వలెవేషమేసి కావరబుద్ధిన్
    కృష్ణుని దిట్టుచు యనెతా
    కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్.

    రిప్లయితొలగించండి
  12. డా.బల్లూరి ఉమాదేవి గారూ - రెండవ పాదంలో యతి తప్పింది.గమనించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మంచి భావం. మీ పద్యానికి నా సవరణ...
      కృష్ణుడ నేనే యని యా
      కృష్ణుని వేషమ్ము దాల్చి కృత్రిమ బుద్ధిన్
      కృష్ణుని దిట్టుచు ననెఁ దాఁ
      కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.

      తొలగించండి
  13. .తీష్ణముగా కంసుడనుకొను
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
    తృష్ణయె తుదముట్టించెను
    కృష్ణా|నీనామ భయమె నెగడగమదిలో {కంసుడు కృష్ణునికలవరమందున నామజపమువైరిఆరాధన}

    రిప్లయితొలగించండి
  14. కృష్ణుని నిందించు శిశుపాలుని మాటలుగా

    విష్ణుద్వేషమ్మే ఘన
    తృష్ణగ శిశుపాలుడిట్లు తిట్టుచు నుండెన్
    కృష్ణుడు వ్యర్థుడు చోరుడు
    కృష్ణపదారాధనమ్ము కీడునొసంగున్ .

    రిప్లయితొలగించండి
  15. .కృష్ణుని మిత్ర బృందము
    నిష్ణాతులె భక్తియందు—“నేనను నహమే
    తృష్ణను బెంచగ వారికి
    కృష్ణ పదారాధనమ్ము కీడొన రించున్.”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో గణదోషం. 'కృష్ణుని మిత్రసమూహము' అనండి.

      తొలగించండి
  16. కృష్ణ యన కారునలుపయె
    కృష్ణా యన కాకిరౌతు కృష్ణాయనగా
    జీష్ణుని సతీ యగు గావున
    కృష్ణు పదారాధనమ్ము కీడొనరించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని మూడవ పాదానికి అన్వయం?

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు
      జీష్ణుని సతీ కృష్ణ యని నామాంతరముగల ద్రౌపది
      ద్రౌపది పదారాధన చేయుట ఆనవాయితీ లేదు కదా

      తొలగించండి
  17. తృష్ణను శిశుపాలుండనె
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
    విష్ణువె సారధి కాగా
    జిష్ణువు నిర్జించ రిపులు చేరిరి యమునిన్

    నిన్నటి పూరణ

    మంచి బ్రతుకుకై పాశ్యాత్య మరగి వెలుగు
    వారి కన్నను మన దేశవాసులిపుడు
    భరతమాతను దూషించువారె; బుధులు
    మాతృ భూమిని గొలుతురు మాత గానె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. కవిమిత్రులకు నమస్కృతులు.
    ప్రయాణంలో ఉన్నాను. పూరణలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను. నా దృష్టికి రాని దోషాలుండవచ్చు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  19. తృష్ణను బాపక సతతము
    విష్ణుసతిఁ గొలిచి యటకను బిందెలు బానల్
    కృష్ణ ధనమ్మును దాచెడి
    కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్

    రిప్లయితొలగించండి


  20. విష్ణువుని యంశ గా తను
    జిష్ణుని హితునిగ రథమ్ము జిగిదేర్చెగదా!
    తష్ణీభావంబో? యే
    కృష్ణ పదారాధనమ్ము కీడొనరించున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి