23, ఫిబ్రవరి 2016, మంగళవారం

సమస్య – 1953 (వెన్నుఁ జూపువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

44 కామెంట్‌లు:

  1. దురము నందు నిలువ విరటుని కొమరుండు
    వెన్నుఁ జూపు వాఁడె , వీరుఁ డనఁగ
    నెదురు నిలచి గెలువ నదురుబె దురులేక
    పార్ధు డనగ నతడు పరమ శ్రేష్టి

    రిప్లయితొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు

    పంద యనగ నెవడు? భండన మందున
    వెన్నుజూపు వాడె, వీరు డనగ
    విజయ మైన నేమి వీరస్వర్గ మెయైన
    సరియె ననెడు వాడు సమరమునను.

    రిప్లయితొలగించండి


  3. మోడి మాట లాడె మేలు కొలుపు గీత
    వెన్నుజూపు వాడె, వీరు డనగ
    నిదుర లేచె చేత నిగ్గును చూపుచు
    స్పూర్తి దాయి నితడు సూరి జూడ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘స్ఫూర్తిదాయి యితడు’ అనండి.

      తొలగించండి
  4. బంధువులను గూల్చి పాలించు రాజ్యమ్ము
    నాకు కూడదంచు నలుగు చుండి
    వెన్నుడొసఁగు గీత వినకముందు ననికి
    వెన్నుఁ జూపు, వాఁడె వీరుఁడనఁగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. వెన్నుజూపునతని............

    పిరికిపంద నాగబిలువబ డునిల
    వెన్నుజూపువాడెవీరుడనగ
    చావుభీతిలేకశత్రుమూకలనెల్ల తనదుఖడ్గమునకునెనయువాడు

    రిప్లయితొలగించండి
  6. భీరుడగును గాదె పోరున భీతిల్లి
    వెన్ను జూపువాడె, వీరుడనగ
    నెంతవారినైన నెదిరించి పోరాడి
    జయము బడయు చుండు జగతి లోన!!!

    రిప్లయితొలగించండి
  7. మొక్క జొన్నపొత్తు మెక్కవచ్చు ననుచు
    పైన భాగ మడిగె పంచుకొనగ
    చెరకు తోట వైచి చెరకు చివర నున్న
    వెన్ను జూపు వాడె వీరు డనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పూర్వ మాయుధముల c. బోరిరి నీతితో |
    ఇ౦క నేడు కుట్ర లెక్కు వయ్యె !
    కసిని వీడి , మోసగానికి చిక్కక ,
    వెన్ను జూపు వాడె వీరు డనగ ! !

    { వీ రు డు = శ్రే ష్టు డు }

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. శస్త్ర నైపుణంబు జక్కగఁ జూపుచు
      ధైర్య సాహసములఁ దనరి ఘోర
      సమర మందు ఘనులు శాత్రవ వీరుల
      వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ. 1
      కర్షకులకు నెల్ల హర్షాతిరేకమ్ము
      లొసగ పాడిపంట లున్నతముగ
      వృద్ధి జెందు చుండ విరివిగఁ పైరుల
      వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ. 2
      [వెన్ను = వీపు; కంకి ]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. శత్రు సైనికులను సమరాన గూల్చగన్
    గత్తి బట్టి వచ్చె గదనమునకు
    ధీరుడై చెరంగి బీరత్వమునకెప్డు
    వెన్నుజూపువాడె వీరుడనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘చెలంగి’... చెరంగి అయింది?

      తొలగించండి
  11. పరమ భీరువనగ పారి రణంబున
    వెన్ను జూపువాడె- వీరుడనగ
    ప్రాణముండు దనుక ప్రాణాలు దీయుచు
    శతృఛేదనంబు సలుపువాడు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సత్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘శత్రు+ఛేదనము=శత్రుచ్ఛేదనము’ అవుతుంది. ‘శత్రు సంహరణము సలుపువాడు’ అందామా?

      తొలగించండి
  12. పరమ భీరువనగ పారి రణంబున
    వెన్ను జూపువాడె- వీరుడనగ
    ప్రాణముండు దనుక ప్రాణాలు దీయుచు
    శతృఛేదనంబు సలుపువాడు !

    రిప్లయితొలగించండి
  13. అదును గాని చోట నధికులమనకుండ
    వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ.
    అపజయంబు పెంచు నధిక పట్టుదలను
    పట్టుదల విజయపు బాట యగును.


    రిప్లయితొలగించండి
  14. అదును గాని చోట నధికులమనకుండ
    వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ.
    అపజయంబు పెంచు నధిక పట్టుదలను
    పట్టుదల విజయపు బాట యగును.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘అదును’ అన్నది మాండలికం. ‘అదను’ సరైన పదం.

      తొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    దేశ భక్తి తోడ. ధీర సైనిక వరుల్
    మాతృభూమి గాచు మతము గలిగి
    పరుల వె౦ట బడుచు , పారద్రోలుచు , వారి --
    వెన్ను జూపు వాడె >> వీరు డనగ


    మతము = అభిమతము ; పరుల = శత్రువుల

    రిప్లయితొలగించండి
  16. సమర రంగమందు శత్రుసైన్యము జూచి
    బీతి తోడ తాను బిక్క చచ్చి
    వెనుదిరుగుచు నుండ వివ్వచ్చు డడిగెను
    వెన్ను జూపు వాడె వీరుడనగ?.
    2.భయము తోడ పోరు వలదు వలదటంచు
    వెన్ను జూపు వాడె వీరు డనగ
    కాదు కాదు వినుము కదన రంగము నందు
    నిలిచి పోరు వాడె నిజము ధన్వి/
    విల్లు పట్టి పోర విజయ మందు.





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. చూర్ణము సలుప పరిఁ గర్ణుడాహవమున
    తేరుఁద్రిప్ప మనుచు కోరెఁ గ్రీడి
    కాని సమయ మందు కదనమును విడచి
    వెన్నుఁజూపువాఁడె వీరుడనగ
    పరిః సేన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. . కన్నతల్లివోలె కరుణగా పాలిచ్చి
    చంపదలచ|”కృష్ణ చనువుగాను
    పూతనూహ మార్చి పుట్టుగతులు ద్రుంచె
    వెన్ను జూపువాడె వీరుడనగ”| {పూతన బాలకృష్ణునిచంపదలచి విషపు పాలుబట్టదలచినప్పుడుబాలుడురాక్షసికి వీపుజూపినా?వీరుడిగాచంపడ మైనది.}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పూతన+ఊహ=పూతనోహ’ అవుతుంది.

      తొలగించండి
  19. అభిమన్యుని అల్పునిగా చూడరాదని దుర్యోధనుడు శకునితో అంటున్నాడు....

    మామ! వినుమిది, యభిమన్యుండు వైరికి
    వెన్నుఁ జూపువాఁడె? వీరుఁ డనఁగ
    గణన కెక్కినాఁడు; కదనానఁ జెలరేగి
    శత్రుసైన్య మెల్లఁ జంపువాఁడు.

    రిప్లయితొలగించండి
  20. నవవిధ పరిశోధనల జేసి విజ్ఞులు
    వర్షలేమి యందు ఫలము నిచ్చు
    మొక్క జొన్న పంట ముదముగా పండించి
    వెన్ను జూపు వాడె వీరు డనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘విజ్ఞులు... వాడె వీరుడు’ అన్వయం కుదరడం లేదు. ‘...జేయ విజ్ఞులు/ ...జేసి విజ్ఞుడు’ అనండి.

      తొలగించండి
  21. భాగవతుల కృష్ణారావు గారి పూరణ....

    భీరువనగ జెల్లు పోరున నిలువక
    వెన్నుఁ జూపువాఁడె ;వీరుఁ డనఁగ
    వీరమరణమైన వెనుకాడబోక తా
    యుద్ధమందు నిలచు యోధుడొకడె.

    రిప్లయితొలగించండి