25, ఫిబ్రవరి 2016, గురువారం

సమస్య – 1955 (రాముఁ డన నెవ్వఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.
ఆంజనేయ శర్మ (విరించి) గారికి ధన్యవాదాలతో...

52 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. గురువు గారికి సుకవి మిత్రులకు నమస్కారములు

      గురువు గారికి ధన్యవాదములు

      రావణునితో హనుమ మాటలుగ నూహించిన పూరణము.

      అసుర రక్షక నానుడు లాలకింపు
      రాముడన నెవ్వడత డొక రాక్షసుండు
      కాదవనిలోన బుట్టిన గట్టుతాలు
      పతడు, సంధి యొక్కటెనీకు బద్రతయగు

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      పూరణ బాగున్నది. కాని విష్ణువు కృష్ణావతారంలో ‘గట్టుతాల్పు’ అయ్యాడు కదా! రావణునితో హనుమంతుడు ఆ విషయాన్ని ఎలా ప్రస్తావిస్తాడు?
      ‘...కా దవనిలోఁ బుట్టిన కంజనేత్రుఁ| డతఁడు...’ అనండి. ‘భద్రత నిడు’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    3. ఔనండి! ఆ విషయం నాకు స్ఫురణకు రాలేదు సరి జేస్తానండి ధన్యవాదములు

      తొలగించండి
  2. తే.గీ.
    అఫ్జ లుగురు వీరుడునేటి యధములకును,
    తలపున భరతమాతను చెరచు నీచు
    లకును, రావణుడే దేవరాయె, కాన
    రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.
    - వెంకోరా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకోరా(?) గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. నా మనసులోని మాట చెప్పారు. సంతోషం! అభినందనలు.

      తొలగించండి
    2. కంది శంకరయ్య గారూ,
      ధన్యవాదములు.డా.బల్లూరి ఉమాదేవి గారు మీ సమస్యల పూరణలు పేస్ బుక్ లో పెట్టేవారూ. అవి చదివి నాకు కూడా, ఎప్పటి నుండో మీ బ్లాగు లోని సమస్యలను పూరించాలనే తాపత్రయం నాకు ఉండేది, ఛందస్సు తెలియదు కనుక రాలేదు. డా.బల్లూరి ఉమాదేవి గారూ మరియు శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారూ నాకు ఛందస్సు నేర్పించారు. చిన్న చిన్నగా మొదలు పెట్టాను.

      తొలగించండి
  3. రావణుడు గొనిపోయెగా కావు నెటుల?
    రాముడన, నెవ్వడత డొక రాక్షసుండు
    పోరు సల్పి సీతను మరి పొందెద మనె
    లక్ష్మణుడు స్వాంతవచనములను బలుకుచు

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కాచు టెటుల’ అనండి. ‘స్వాంతవచనములు’ కాదు, ‘సాంత్వవచనములు’.

      తొలగించండి
  4. సత్య ధర్మము పాటించు నిత్య వ్రతుడు
    రాముఁ డన , నెవ్వఁ డతఁ డొక రాక్ష సుండు
    వరగరువ మున దిరుగెడి పాపి యనగ
    లంక నేలెడి రావణు డంక తనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ‘వరగరువము’ అనరాదు. ‘అంకతనము’ ...? నా సవరణ....
      వరపు గర్వాన దిరుగెడు పాపి యనగ
      లంక నేలును గద రావణాంకు డతడు.

      తొలగించండి
    2. సత్య ధర్మము పాటించు నిత్య వ్రతుడు
      రాముఁ డన , నెవ్వఁ డతఁ డొక రాక్ష సుండు
      వరపు గర్వాన దిరుగెడు పాపి యనగ
      లంక నేలును గద రావణాంకు డతడు

      తొలగించండి
  5. ఇరువది యొకమారులు ధరణీపతులను
    జంపి తల్లితండ్రులకిల సంతసముగ
    రక్త తర్పణమొనరించు ప్రజవి పరశు
    రాముఁడన నెవ్వ డతడొక రాక్షసుండు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో యతి తప్పింది. నా సవరణ....
      శివధనుర్భంగం తర్వాత వచ్చిన పరశురాముని చూచి రాజలోకం తమలో తాము అనుకొన్నది.... (మన దృష్టిలో కాదు కాని, రాజలోకం దృష్టిలో అతడు రాక్షసుడే!)
      ఇరువదియొక మారు లెసగి ధరణిపతుల.... మిగతా మీ పద్యమే...

      తొలగించండి


  6. మానవాకృతినొందినమహితుడార్య! రాముడనగ,నెవ్వడతడొకరాక్షసుండు లంకకధిపతియైనట్టిరావణుండు నిజమునమ్ముముమ్మాటికినిజముసుమ్ము

    రిప్లయితొలగించండి
  7. రాముఁ డన నెవ్వఁ డతఁడొ,క రాక్షసుండు
    రావణుని సంహరింపగా రత్న గర్భ
    పైన జన్మించిన హరియె, వాని చంప
    సీతతోపాటు జనుల సంప్రీతి పడిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జనులు’ టైపాటువల్ల ‘జనుల’ అయింది.

      తొలగించండి
  8. రామ నామమాత్ర దురిత లాలసుండు
    సత్య వచన దూరు డవని నిత్య కపటి
    పర ధనాసక్తుడు వ్యసన పరు డభినవ
    రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుందండి మీ అభినవ రాముని గుణగణవివరణ ఇంతలా వర్ణించిన యా రాముడు రాక్షసుడే

      తొలగించండి
    2. విరించి గారు ధన్యవాదములు. కలికాలములో యిట్టి యభినవ రాములకు కొరత లేదు.

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆస్తి కోసము తమ్ముని హత్య జేసె |
    ఉవిదను విడనాడి గణిక. ను౦చు కొనియె |
    పేరు కేమొ " రాముడు " నేతి బీరకాయ. |
    రాము డన నెవ్వ డతడొక. రాక్షసు౦డు |

    రిప్లయితొలగించండి
  10. సతతము వితండవాదము సలుపువారు
    రాముడననెవ్వ డతడొక రాక్షసుండు
    దానవులె భువి నిజమైన దైవములని
    దేశపు సమగ్రతను దెబ్బ తీయు చుండ్రి
    కుక్కమూతి పిందెలె వారు కువలయమున

    రిప్లయితొలగించండి
  11. భక్తు లెంచగ దేవుడే వసుధ యందు|
    “మోసపూరిత కార్యాల మోజులున్న
    రావణుండెదురించగ రంగమందు
    రాముడన నెవ్వడతడొక రాక్షసుండు”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. కాని ‘రాక్షసుండు’కు అన్వయం?

      తొలగించండి
  12. సద్గుణాంభుధి సోముండు సత్యవ్రతుడు
    దీనజన రక్షకుడతడు ధీరుడతడు
    రక్కసులపరి మార్చగ రాక్షసులకు
    రాముడననెవ్వడతడొక రాక్షసుండు

    రామబాణమె మేటిదౌ రాక్షసేంద్ర
    నరుడు వాడంచు భావింప సరియుగాదు
    వీరుడై భండనము జేయు వేళయందు
    రాముడననెవ్వడతడొక రాక్షసుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పద్యాలుగా బాగున్నవి కాని సమస్యాపూరణలో సంతృప్తికరంగా లేవు. రాక్షసమనగా అమానుషం అనే అర్థం తీసుకున్నా అది కలవాడు రాక్షసుడన్నా అది రామునకు వర్తించదు.

      తొలగించండి
  13. రాము డన,నెవ్వ,డత డొక రాక్షసుండు,
    తమ్ముడౌ సుబాహు౦ డధ్వరమ్ము ధ్వంస
    మొనరుప౦బూన యమునిసదనము కంపి,
    జలధి ద్రొబ్బెమారీచ నిశాటు నలిగి.
    2.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
    సీత నెత్తుకు పోవగ శృ౦గజముల
    గూల్చి రక్షించి నట్టి రఘుపతిగాదె
    దశరథాత్మజు డైనట్టి దానవారి.
    3.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
    పదియు నాల్గువేలసురుల ఫౌజు
    ననికి వచ్చిన నందర హతమొనర్చు
    ధనువు చేబట్టు విక్రమ ధనుడ తండు
    4. .రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
    మాయలేడియై గన్పింప జాయ కొరకు
    వెంటబడి గూల్చి,కోల్పోయె నింటనున్న
    ప్రాణసతిని రావణుడు హరణము సేయ
    5. రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
    పత్ని చెర బట్ట వానర బలముగూడి
    సేతు నిర్మించి లంకను జేరి దనుజ
    వైరులను జంపి సీతను బడసె మరల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ నాల్గవపద్యాన్ని చూసి ఉంటే నా పూరణను ప్రకటించకపోయేవాణ్ణి. ఇద్దరం ఒకే భావంతో వ్రాసాము.
      మీ ఐదు పూరణలలో మొదటిది తప్ప మిగిలినవి బాగున్నవి. మొదటి పూరణలో అన్వయలోపం ఉంది.
      మూడవపూరణలో ‘వేల+అసురుల’ అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనమేరకు3వ పద్యము సవృంచితిని
      25.02.2016. .శంకరాభరణము.
      సమ:స్య::రాము డన నెవ్వ డత డొక రాక్షసుండు
      పూరణ :రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు,
      తమ్ముదౌ సుబాహు౦ డధ్వరమ్ము ధ్వంస
      మొనరుప౦బూన యమునిసదనము కంపి,
      జలధి ద్రొబ్బెమారీచ నిశాటు నలిగి .
      2.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
      సీత నెత్తుకు పోవగ శృ౦గజముల
      గూల్చి రక్షించి నట్టి రఘుపతిగాదె
      దశరథాత్మజు డైనట్టి దానవారి.
      3.రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
      పదియు నాల్గువేలుగలుగు ఫౌజు తోడ
      ననికి వచ్చిన నందర హతమొనర్చు
      ధనువు చేబట్టు విక్రమ ధనుడ తండు .
      4. .రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
      మాయలేడియై గన్పింప జాయ కొరకు
      వెంటబడి గూల్చి,కోల్పోయె నింటనున్న
      ప్రాణసతిని రావణుడు హరణము సేయ.
      5. రాము డన ,నెవ్వ, డత డొక రాక్షసుండు
      పత్ని చెర బట్ట వానర బలముగూడి
      సేతు నిర్మించి లంకను జేరి దనుజ
      వైరులను జంపి సీతను బడసె మరల.
      L

      తొలగించండి
  14. గర్భవతిని సతిని కడు దుర్భరంపు
    కాన కంపెనే! రాముడు కరుణలేక
    ననెను ప్రల్లదు డొక్కరు డాగ్రహాన
    రాముడన నెవ్వడతడొక రాక్షసుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కరుణలేక| యనెను...’ అనండి.

      తొలగించండి
  15. గర్భవతిని సతిని కడు దుర్భరంపు
    కాన కంపెనే! రాముడు కరుణలేక
    ననెను ప్రల్లదు డొక్కరు డాగ్రహాన
    రాముడన నెవ్వడతడొక రాక్షసుండు

    రిప్లయితొలగించండి
  16. ఖలులు కల్పితమే రామ కథయెననుచు
    తప్పు మాటల నాడుచున్ చెప్పిరిటుల
    అగ్ని దూకమంచానతి యాలి కొసగు
    రాముడననెవ్వడతడొక రాక్షసుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కథయె యనుచు’ అనండి. ‘అగ్నిలో దూకుమను నాజ్ఞ నాలి కొసగు’ అనండి.

      తొలగించండి
  17. మగఁడు లేడిని తేఁబోవ మాయఁ జేసి
    సీతఁ గామించి జెరఁబట్టి చిక్కుకొనియె!
    కావఁడెవ్వండు నానుంచి రావణునని
    రాముఁడన! నెవ్వడతఁడొక రాక్షసుండు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      పద్యాంతంలొ అన్వయం సందేహాస్పదం.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. మరో పాదము పెంచి వ్రాసిన పద్యము పరిశీలించ ప్రార్థన:
      మగఁడు లేడిని తేఁబోవ మాయఁ జేసి
      సీతఁ గామించి జెరఁబట్టి చిక్కుకొనియె!
      కావఁడెవ్వండు నానుంచి రావణునని
      రాముఁడన! నెవ్వడతఁడొక రాక్షసుండు!
      ధర్మమూర్తియౌ రామునే తల్లడించ!!

      తొలగించండి
  18. తార వాలితో....

    రాముఁ డన నెవ్వఁ? డతఁడొక రాక్షసుండు
    మాయలేడియై మోసగింపఁగఁ దన సతిఁ
    గోలుపోయి యామెకొఱకు కొండకోన
    లధిగమించుచు వచ్చి సూర్యాత్మజునకు
    నండగా నిల్చె, చూడకు మల్పునిగను.

    రిప్లయితొలగించండి
  19. రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు
    కాడ ! ఐనచో నతడేల కదలి వచ్చె
    నసురులను గాక వింత వానరుల తోడ
    లంక కేతెంచె నని బల్కె లండియొకతె

    రిప్లయితొలగించండి
  20. సద్గుణాంభుధి సోముండు సత్యశీలి
    యాశ్రిత జనరక్షకుడు మహాత్ముడైన
    రాముడననెవ్వడతడొక రాక్షసుండు
    శరణ మనివేడ బ్రోచెను కరుణ తోడ

    రిప్లయితొలగించండి
  21. అగ్రజునితో విభీషణుండనియె నిటుల
    "రాముడన నెవ్వడతడొక రాక్షసుండు
    కాడు"తిరిగి సీత నొసగి గనుము సుఖము
    యనుచు రావణాసురు తోడ ననుజుడనియె.

    రిప్లయితొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆస్తి కోసము తమ్ముని హత్య జేసె |
    ఉవిదను విడనాడి గణిక. ను౦చు కొనియె |
    పేరు కేమొ " రాముడు " నేతి బీరకాయ. |
    రాము డన నెవ్వ డతడొక. రాక్షసు౦డు |

    రిప్లయితొలగించండి
  23. నమస్సులు. పొరబాటు గమనించాను. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  24. నమస్సులు. పొరబాటు గమనించాను. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  25. ఈ సమస్యని యథాతథంగా పూరించదలచాను.
    రాముడన నాత డెవడొక రాక్షసుండు
    రాక్షసుల గూల్చి ఋషులకు రక్షనిచ్చు
    కౌశిక మహర్షి యనగ త్రికాలవేది
    రాము నతనితో బంపుము భ్రమల విడచి

    (అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )

    రిప్లయితొలగించండి
  26. ఈ సమస్యని యథాతథంగా పూరించదలచాను.
    రాముడన నాత డెవడొక రాక్షసుండు
    రాక్షసుల గూల్చి ఋషులకు రక్షనిచ్చు
    కౌశిక మహర్షి యనగ త్రికాలవేది
    రాము నతనితో బంపుము భ్రమల విడచి

    (అసలు రాక్షసుడు అనేది తప్పు పదం కాదు. రక్షించే వాడు అని అర్థం. నందవంశానికి ఆ తరువాత చంద్రగుప్తునికీ మంత్రి అయిన ఆయన పేరు కూడా రాక్షసుడు. విశ్వామిత్రుని వంటి త్రికాలవేది అడిగాడంటే దానిలో ఏదో మర్మం ఉంటుంది. పంపమని వశిష్ఠమహర్షి చెప్పాడు. రాముడే రాక్షసుడు. రాక్షసులని ఓడించలేడా ? అనే చమత్కారం. )

    రిప్లయితొలగించండి