26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సమస్య – 1956 (మద్యముఁ ద్రాగువారలనె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.

52 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    చోద్యము లేదుజూచినను సోమరులై తిరుగాడుచున్ సదా
    బాధ్యత లేనివారలని భ్రష్టులు మూర్ఖులనంచు దిట్టరే
    మద్యము ద్రాగు వారలనె, మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
    విద్యలు నేర్చి విజ్ఞత వివేకము గల్గిన వారినే గదా!

    రిప్లయితొలగించండి
  2. పద్యము గద్యమున్ నుడువ బాధయటంచు తెలుంగు భాషలన్
    చోద్యము నీయుగం బునను సూక్తులు చెప్పెడి వారలన్ గనన్
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు , సజ్జనుల్
    విద్యను నేరుపున్ జదువ వేడుక మీరగ నెందరుం దురే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      ఏడెనిమిది సార్లు చదివినా మీ రీ పూరణలో ఏం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు.

      తొలగించండి
    2. చోద్యము నీయుగం బునను సూక్తులు చెప్పెడి వారలన్ గనన్
      మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
      పద్యము గద్యమున్ నుడువ భక్తిని దైవము గొల్చువారలున్
      విద్యను నేరుపున్ చదువ వేడుక మీరగ నెందరుం దురే ?

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. సద్య యశ:ప్రభాతము సుశాశ్వత సర్వ శుభప్రదాయకం
    బాద్యము కృష్ణదేవుని పదాంబుజ తాడన సుప్రకాశమున్
    చోద్యము పుణ్యజీవుల సుశోభిత భాగవతా కథాసుధా
    మద్యము గ్రోలువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ మీ పూరణ అత్యద్భుతముగ నలరారు చున్నది. అభినందనలు. “భాగవత” అకారాంత పదము. “భాగవత కథా” అని దీర్ఘము లేకుండ ఉండాలేమోయని నా చిన్న సందేహము. పరిశీలించ ప్రార్థన.
      “భాగవత పురాణ ఫలరసాస్వాదన
      పదవి గనుడు రసిక భావ విదులు.” భాగ. 1.37.
      వ: “...కావున శ్రీ మహా భాగవతకథాసమూహంబుల గల ధర్మంబు లడిగెద; ... “ భాగ. 11. 30.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.
      ‘భాగవతాఖ్యసత్కథా|మధ్యము...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సందేహ నివృత్తి యయినది. మీ సవరణ చాలా బాగుంది.

      తొలగించండి
    5. గురువుగారికి మరియు శ్రీ కామేశ్వర రావుగారికి వందనములు మరియు ధన్యవాదములు.
      గురువుగారు,
      మంచి సవరణ సూచించినందులకు శతథా ధన్యవాదాలు.

      తొలగించండి
  4. కవిమిత్రులకు మనవి...
    ఈరోజు మా మిత్రుని కూతురు పెళ్ళికి హైదరాబాద్ (బోడుప్పల్) వెళ్తున్నాను. వీలైతే రాత్రికి తిరిగివచ్చిన తర్వాత మీ పూరణలను, పద్యాలను సమీక్షిస్తాను.
    ఇప్పటికి వచ్చిన మూడు పూరణలలో సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ ఉత్తమంగా ఉంది.

    రిప్లయితొలగించండి

  5. సత్యము జూడరో కవుల చక్కని మాటలు ఒప్పుగా యనన్
    పద్యము వ్రాయుచూ చురక పాదము వేయుచు మధ్యమధ్యలో
    మద్యము ద్రాగు వారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
    గద్యము వ్రాయు వారలను గాటిన గట్టుట చూచితీ యిలన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. కొన్ని సవరణలు...
      ‘...చక్కని మాటల నొప్పుగా ననన్| పద్యము వ్రాయుచున్...చూచితిన్ భువిన్’
      ‘చురక పాదము’...?

      తొలగించండి
    2. మొదటి పాదంలో ప్రాస పోయింది జిలేబీ గారూ ...సవరించండి...

      తొలగించండి
  6. హృద్యము తెల్గు పద్యమని హెచ్చిన ప్రీతిని గల్గి దానికే
    యాద్యులు నన్నయాది కవి యర్రన తిక్కన భారతమ్మునన్
    సద్యశ పోతనార్యు ఘన సారపు కావ్యపు పద్య పాకమౌ
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని ‘ఎర్రన’ను ‘అర్రన’ అన్నారు. ‘సద్యశ పోతనార్యు’ అన్నప్రయోగం సందేహాస్పదం.

      తొలగించండి
    2. ‘సద్యశమందు పోతన సుసారపు...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మద్యము విక్రయి౦చు నొక మానిసి తా.
    బ్రకటి౦చె నిట్టులన్ :--

    " మద్యము గౌరవప్రదము , మన్నన నిచ్చు
    నస౦శయ౦బుగా |

    మద్యమొస౦గు మీకు దగు మానస శా౦తిని |
    స౦ఘమ౦దునన్

    మద్యము త్రాగు వారలనె మాన్యులు గా
    నుతియి౦త్రు సజ్జనుల్

    మద్యము త్రాగ సిగ్గిలుట మ౦చిది కాదు
    సుమా ! మరె౦తయున్

    ప్రోద్యతి నిచ్చు చు౦డెను ప్రభుత్మమె ె
    పెట్టుచు బెల్టు షాపులన్ "

    { ప్రోద్యతి = ఉఛ్ఛస్థితికి దెచ్చుట }

    రిప్లయితొలగించండి


  8. మద్యముద్రాగువారలనెమాన్యులుగానుతియింత్రుసజ్జనుల్ చోద్యముగాదెయీపలుకుసోదర!చెప్పుమునీవయైననున్ మద్యముద్రాగువారలరుమత్తుననుండుచువాగుచుందురే
    పద్యమునందుసజ్జనులభావమునిచ్చుటపాడియేప్రభూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చోద్యముగాదె......రెండవపాదమునకు మొదలుగా చూడవలసినది

      తొలగించండి
    2. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. విద్యయదెంతయున్నను వివేకమువీడుచు త్రాగి వాగుచున్
    చోద్యము జేయువారలను జూచిన వారలు మెచ్చుకొందురే?
    బాధ్యత తోడ హద్దులిడి వాటిని మీరక తాఁ మితంబుగా
    మద్యము త్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    Even though it is very common to have a drink during social gatherings in Western countries, people don't like anyone crossing their limits and making a big scene. ఆ ఉద్దశ్యముతో చేసిన పూరణ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుష్యం గారూ,
      బహుకాలానికి ఈ బ్లాగులో దర్శనమిచ్చారు. సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పాశ్చాత్యదేశాలలోనే కాదు మన దేశంలోను ఈ సంప్రదాయం మొదలయింది.

      తొలగించండి
  10. విద్య యొసంగు జ్ఞానమును,వేదవిదుల్ యలనాటి సజ్జనుల్
    మద్యముగ్రోలగన్ మతికి మాంద్యము గల్గు నట౦చు తెల్పగా
    చోద్యముగా నభీష్టములు సొంపుగ చొప్పడ నీ తరమ్మునన్
    మద్యము త్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘విదుల్+అలనాటి’ అన్నపుడు యడాగమం రాదు. ‘వేదవిదుల్ మును మేటి సజ్జనుల్’ అందామా?

      తొలగించండి
    2. గురుదేవులసూచనమేరకు సవరించినపద్యము
      విద్య యొసంగు జ్ఞానమును,వేదవిదుల్ మును మేటి సజ్జనుల్
      మద్యముగ్రోలగన్ మతికి మాంద్యము గల్గు నట౦చు తెల్పగా
      చోద్యముగా నభీష్టములు సొంపుగ చొప్పడ నీ తరమ్మునన్
      మద్యము త్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

      తొలగించండి
    3. గురుదేవులసూచనమేరకు సవరించినపద్యము
      విద్య యొసంగు జ్ఞానమును,వేదవిదుల్ మును మేటి సజ్జనుల్
      మద్యముగ్రోలగన్ మతికి మాంద్యము గల్గు నట౦చు తెల్పగా
      చోద్యముగా నభీష్టములు సొంపుగ చొప్పడ నీ తరమ్మునన్
      మద్యము త్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

      తొలగించండి
  11. సేద్యము జేసి దేశ ప్రజ సేమముకై పలు పంట లిచ్చుచున్
    వైద్యమొనర్చి బీదలకు వ్యాధి నివారణకై శ్రమించు చు
    న్నుద్యమమట్లు సల్పెడి విన్నూత్న విధానము "సేవ " గాగ నా
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘సేమమునకై’ అనడం సాధువు. ‘సేమము గోరుచు పంట లిచ్చుచున్’ అందామా?

      తొలగించండి
  12. సద్యపు స్ఫూర్తినిన్ వినయ సంపద లందుననుత్తముండునై
    హృద్యము లైన కార్య తతు లింపుగ నేర్పున జక్క బెట్టుచున్
    వైద్యవిశారదుండు నుడువన్నిక దప్పదటంచు నించుకన్
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతింత్రు సజ్జనుల్
    ____॥॥॥_
    పైపద్యము పోచిరాజు కా మేశ్వరరావుగారి పూరణ

    రిప్లయితొలగించండి
  13. . ఉద్యమ మార్గమై నిలిచి నుజ్వలసారముపంచనెంచగా?
    అద్యయనంబు జేయ మన ఆశల కంటెను కృష్ణ లీలలే
    పద్యములందు భక్తి ననుపానము నుంచగ పోతనార్యుడా
    మద్యముత్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘నిలిచి యుజ్జ్వల...’ అనండి.

      తొలగించండి
  14. మద్యము ద్రావినన్గలుగు మత్తది యెంతటి వారికేనియున్
    పద్యము హృద్యమై హృదయ భావ విపంచిని మీటుచుండుటల్
    చోద్యముగాదు నెయ్యెడల! శుద్ధ రసాన్విత కావ్య సారమౌ
    మద్యము ద్రాగు వారలను మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. తధ్యము జెప్పుచుంటి సతతమ్మును వీడుచు నుండ్రు శ్రీమతుల్
    మద్యము ద్రాగువారలనె, మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
    మిథ్యగ దల్చి జీవితము మిక్కిలి భక్తిని నిత్యము నీశుగొల్చుచున్
    బాధ్యత తోడుతన్ మెలగు పావన మూర్తుల భూతలమ్ముపై

    రిప్లయితొలగించండి
  16. తధ్యము జెప్పుచుంటి సతతమ్మును వీడుచు నుండ్రు శ్రీమతుల్
    మద్యము ద్రాగువారలనె, మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
    మిథ్యగ దల్చి జీవితము మిక్కిలి భక్తిని నిత్యము నీశుగొల్చుచున్
    బాధ్యత తోడుతన్ మెలగు పావన మూర్తుల భూతలమ్ముపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘భక్తిని నీశు గొల్చుచున్’ అనండి.

      తొలగించండి
  17. మాస్టరుగారూ! సహదేవుడు గారూ ! ధన్యవాదములు.
    మాస్టరుగారూ దోషసవరణ చేసినాను...

    హృద్యము తెల్గు పద్యమని హెచ్చిన ప్రీతిని గల్గి దానికే
    యాద్యులు మువ్వురైన కవి హంసలు వ్రాసిన భారతమ్మునన్
    సద్యశులైన పోతన సుసారపు కావ్యపు పద్య పాకమౌ
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. సోద్యముఁ గాదు దీనినటుఁ జూడగ భావ్యము కాదు కాదొకో!
    బాధ్యులు నాతిథేయముల పాల్గొను పాలక వర్గ మంత్రులున్
    ఖాద్యము తోడుతన్నడత గౌరవమొప్పగ మప్పి తమ్ముగన్
    మద్యముఁ గ్రోలు వారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  19. చోద్యము! చిత్ర సీమన సుశోభిల ఖ్యాతిని గాంచ గా భళా
    మద్యము ద్రాగు వారలనె మాన్యులుగా నుతియింత్రు !సజ్జనుల్,
    సేద్యము లెంత జేసినను చేరక బోయిన మందు భాయిగా
    నాద్యపు పేరు గాన సయి నమ్మిక నొందగ వీలుకాదయా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. సద్యశ శంకరాభరణ సారథి సంతస మొందగా జనుల్
    విద్యల రాయుడై భువిని ప్రీతిని వర్ధిల శోభనొందగా...
    పద్యము నేర్వగా దలచి పండుగ జేయుచు శంకరయ్యదౌ
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  21. సద్యశ శంకరాభరణ సారథి సంతస మొందగా జనుల్
    విద్యల రాయుడై భువిని ప్రీతిని వర్ధిల శోభనొందగా...
    పద్యము నేర్వగా దలచి పండుగ జేయుచు శంకరయ్యదౌ
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  22. సద్యశ శంకరాభరణ సారథి సంతస మొందగా జనుల్
    విద్యల రాయుడై భువిని ప్రీతిని వర్ధిల శోభనొందగా...
    పద్యము నేర్వగా దలచి పండుగ జేయుచు శంకరయ్యదౌ
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  23. హృద్యపు రీతినిన్ కొలిచి హృత్తులు దోచుచు చంచలాక్షులన్
    పద్యము లల్లుచున్ చెలగి పాడుచు ప్రీతిని శ్లాఘనమ్ములన్
    సద్యశ మొందగోరుచును జంబము మీరగ రెడ్లయింట భల్
    మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి