28, ఫిబ్రవరి 2016, ఆదివారం

సమస్య – 1957 (పార్థసారథి జన్మించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పార్థసారథి జన్మించె భానుమతికి.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారము

    లాస్య అనెడు భార్యతో భర్త చెబుతున్న మాటలు

    దేవకీదేవికినివసు దేవులకును
    అష్టమసుతుడై కారాగృహమున నిశిన
    పార్థసారధి జన్మించె, భానుమతికి
    లక్ష్మణకుమారు డుదయించే లాస్య వినుమ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిశిని' అనండి.

      తొలగించండి

  2. పతిని జేరిన ఫలముగ భానుమతికి
    ఆయె చకచక రెండన ఆరు నెలలు
    అమ్మ కడుపున చల్లగ అయ్య చలువ
    పార్థ సారధి జన్మించె భానుమతికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'రెండన నారునెలలు'.. అర్థం కాలేదు.

      తొలగించండి
    2. దన్యవాదాలండీ కంది వారు !

      "తతశ్చ ద్వాదశే మాసే"

      అన్నట్టు రెండు ఆరు నెలలు = పన్నెండు నెలలు అన్న అర్థం లో వ్రాసాను సరియేనా ??

      సావేజిత
      జిలేబి

      తొలగించండి
    3. రెండారు నెలలు అంటే అర్థం అయ్యేది. కాని ‘రెండనన్ ఆరు నెలలు’ అనేసరికి అర్థం కాలేదు.

      తొలగించండి

  3. పతిని జేరిన ఫలముగ భానుమతికి
    ఆయె చకచక రెండన ఆరు నెలలు
    అమ్మ కడుపున చల్లగ అయ్య చలువ
    పార్థ సారధి జన్మించె భానుమతికి

    రిప్లయితొలగించండి
  4. శిష్ట జనులను రక్షించ శ్రీకరముగ
    దేవకికి చెరసాలలో దివ్యముగను
    పార్థసారధి జన్మించె, బానుమతికి
    లక్ష్మణ కుమారుడు కలిగె లక్షణముగ!!!

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. పార్థసారథి జన్మించె భానుమతికి
      పతి సుయోధను పినతల్లి వదిన గారు
      దేవకీ దేవికిన్ వసుదేవు డంత
      సంతసించగ కంసుడు చింత నొంద

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ బంధుత్వాల చిట్టా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  6. చిమ్మచీకటిగలయట్టిచెరనుగాదె
    పార్ధసారధిజన్మించె.భానుమతికి
    లక్ష్మణకుమారుడననొకలక్షణుండు
    కొడుకుగాబుట్టెజూచితె?కోమలాంగి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఒక లక్షణుండు’... ఏ లక్షణం?

      తొలగించండి
  7. ఔను! "లలిత,సౌజన్యశ్రీ,భానుమతులు"
    నెలలు దప్పగ "లలిత"కు నెలలు నిండి
    పార్థసారథి జన్మించె-భానుమతికి
    రామమూర్తియె ప్రభవించె రాగమొదవ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘జన్యశ్రీ’ అని మగణం వేశారు?

      తొలగించండి
  8. ఔను! "లలిత,సౌజన్యశ్రీ,భానుమతులు"
    నెలలు దప్పగ "లలిత"కు నెలలు నిండి
    పార్థసారథి జన్మించె-భానుమతికి
    రామమూర్తియె ప్రభవించె రాగమొదవ!

    రిప్లయితొలగించండి
  9. పాండు పత్ని కుంతిని జేరి పలికె నిటుల
    పార్థసారధి, జన్మించె భానుమతికి
    మగశిశువనుచు తరలిరి మగువ లెల్ల
    బారసాలయె ఘనమైన పండుగయ్యె

    రిప్లయితొలగించండి
  10. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గో గ్రహణ సన్నివేశమున్ గూర్చి కృష్ణ

    కిటుల విశదముగా వివరి౦చె నపుడు
    ి
    పార్థసారధి | జన్మి౦చె భానుమతికి :-

    లక్ష్మణు౦డు , సమస్తావలక్షణు౦డు ,

    శౌర్యహీనుడు , కోతల చక్రవర్తి |

    ప౦దయై సైన్యము౦ గా౦చి పార దొడగె |


    { కృ ష్ణ. = ద్రౌపది }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      లక్ష్మణకుమారుడు పిరికివాడన్నది సినిమావాళ్ళ సృష్టి. అతడు సమరరథుడు (మహారథునకు తక్కువ, అర్ధరథునకు ఎక్కువ). మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు.

      తొలగించండి
  11. అర్జునుని రథము నడుపగ నయ్యె నతడు
    పార్థసారథి.జన్మించె భానుమతికి
    రాజరాజుకు తనయుడై లక్ష్మణుండు,
    కూతు లక్షణ కృష్ణుని కోడలాయె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కూతు’? ‘కూతురగు లక్షణ హరికి కోడలాయె’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  12. ధర్మ సంస్థాప నార్థమై ధరను బుట్టి
    నందునింటను పెరిగెను నల్లనయ్య
    పార్థ సారథి, జన్మించె భానుమతికి
    లక్ష్మణ కుమారుడున్ యువ రాజుగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. .పార్థసారధి జన్మించె భానుమతికి
    గాదు.”తెలియక యుద్దానకాలుమోప
    క,వెనుదిరిగె|గోవుల గావలేక
    యున్నలక్ష్మణుడే తనకన్న కొడుకు”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  14. పడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్న
    భీనసేనున్, సుయోధనున్ వేటు వేయ
    సకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందు
    పార్థసారథి జన్మించె! భానుమతికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణను నాలుగైదుసార్లు చదివినా భావం అర్థం కాలేదు. వివరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు.ద్రౌపదిని అవమానించినందులకు సుయోధనుని వేటు వేయుటకు భీమసేనునితో శ్రీకృష్ణపరమాత్మ వ్యూహంపన్నినట్లుగా కలలో భానుమతికి తోచిందన్న భావంతో వ్రాశానండి.పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    3. మీ వివరణ సంతృప్తికరమే. కాని భీమసేనున్, సుయోధనున్ వేటువేయ అన్నచోట అన్వయదోషం ఉంది. ఇద్దరినీ వేటువేయడానికి అనే అర్థం వస్తున్నది.

      తొలగించండి
    4. గురుదేవులకు ప్రణామములు.సవరించిన పూరణను పరిశీలించ ప్రార్థన:
      పడతి ద్రౌపదిన్ లంకించ భగ్గుమన్న
      భీమునిఁ గొని సుయోధనున్ వేటు వేయ
      సకల వ్యూహకర్తగఁ దీరి స్వప్నమందు
      పార్థసారథి జన్మించె! భానుమతికి

      తొలగించండి
  15. పాండు తనయున కిలలోన బవరమందు
    సాయపడుటకై తా చెర సాల యందు
    పార్థసారథి జన్మించె;భానుమతికి
    లక్ష్మణ కుమారుడుదయించి లలిని పెంచె/పంచె.

    రిప్లయితొలగించండి