27, ఫిబ్రవరి 2016, శనివారం

దత్తపది - 88 (తల)

కవిమిత్రులారా,
నాలుగు పాదాలను ‘తల’తో ప్రారంభిస్తూ
పతికై నిరీక్షిస్తున్న నాయిక స్వగతాన్ని తెలుపుతూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

62 కామెంట్‌లు:

  1. కంది శంకరయ్య గారూ,
    ఈ ఆవు-మేక-కుక్క-పిల్లి ని ఎక్కడ వాడాలో వాటి గురించి ఏమీ చెప్పలేదు మరి........!!??

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి. అది కాపీ-పేస్ట్ వల్ల జరిగిన పొరపాటు. సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి

    2. పొరపాటు జరిగినా మరి
      కరమే వాలము యని మరి కవివరులు యిటన్
      మెరుగగు యావును కుక్కను
      పరుగున పిల్లి జత మేక పలుకుల గనిరే ! :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      పద్యం బాగుంది.
      ‘జరిగినా’ అనడం వ్యావహారికం. ‘జరిగినన్’ అనడం సాధువు. ‘వాలము+అని, వరులు+ఇటన్, మెరుగగు+ఆవును’ అన్నపుడు యడాగమాలు రావు. ‘మరి’ పునరుక్త మయింది. నా సవరణ...
      పొరపాటు జరిగినన్ మఱి
      కరమే వాల మనుచు నిక కవివరు లిచటన్
      మెరుగగు నావును....

      తొలగించండి
  2. తలనిండ కుక్కపూవు, ల
    తలమే కద యావులింత తరుణీ యేలన్?
    తలపున చిప్పిల్లి నతడి
    తలపున చిక్కెగ జిలేబి తనపతి రాకన్ :)

    రిప్లయితొలగించండి
  3. తలనిండ కుక్క బూలును
    తలమే కద తలపులందు దాగిన చెలికే
    తలవాకిట దురపిల్లిన
    తలమాసినయావులింత తరుణిని జేరెన్

    చెలి = స్నేహితుడు

    రిప్లయితొలగించండి
  4. తలమే కలలో నైనను
    తలలోపల ఫూలు కుక్క దారుణ మౌరా ?
    తలచుచు నీలావు వేచిన
    తలపింపగ పిల్లిచాటు తనపతి వెదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      భావంలో కొంత సందిగ్ధత ఉన్నది. మూడవపాదంలో గణదోషం.

      తొలగించండి
  5. తలపున కుక్కన బడవే !
    తలపులు ప్రభుదత్తమే కదా మరి ఆనం
    తలయా! వునికివి నీవే !
    తలపుల జొప్పిల్లి నన్ను ధారగ గొనుమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ, ఆంజనేయ శర్మ గారూ, రాజేశ్వరి అక్కయ్యా,
      కాపీ, పేస్ట్ వల్ల జరిగిన పొరపాటు వల్ల ఇంతవరకు కుక్క, పిల్లి, ఆవు, మేకలను కూడా చేర్చి తలతో పాదారంభం చేసి చాలా శ్రమ పడ్డారు. నా ‘తల’ తిరిగిపోయింది. నన్ను క్షమించమని మనసారా కోరుకుంటున్నాను.

      తొలగించండి

    2. అకటా తలతిరిగె నిచట!
      సకలము జంతువు లమరెను ! సాధన యనగన్
      మకుటాయమానముగ నిటు
      ల కవితలల్లుదుర! సుకవులన వీరె గనన్ :)

      తొలగించండి
  6. గురువు గారికి నమస్కారములు
    మీ దత్తపదిలో ఆవు మేక కుక్క పిల్లి కూడా వుందని మొదట అలా పూరించాను అట్టి పద్యమునూ చూడగలరని మనవి

    1.
    తలపుల తలుపులు తెరిచితి
    తలచితి ప్రియసఖుడనిన్ను తలపుల లోనన్
    తలవాకిట జేరితి నీ
    తలపులలో నన్ను జేర్చి త్వరపడి రమ్మా.

    2.
    తలనిండబూలు బెట్టితి
    తలపులలో నిన్ను నిలిపి తలవాకిటిలో
    తలచుచు నిలబడి యుంటిని
    తలపువ్వును గోరినట్టి తారకవోలెన్

    రిప్లయితొలగించండి
  7. తలవాకిట నిలుచుంటిని
    తలపులలో నిన్ను నింపి తరుణిని నీకై
    తలవిను తరుణము కొరకై
    తలపూలను ముడిచి కోర్కె తనియగ నీకై.

    రిప్లయితొలగించండి
  8. తలలోనపూలమరె! చే
    తల మరి మరి తలఁచుచు తన్మయమవుచున్!
    తలపుల నిండిన నీకై
    తలవాకిట నెదురు జూతు!త్వరితము రమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో గణదోషం. ‘చే|తలనే మరిమరి...’ అందామా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:
      తలలోనపూలమరె! చే
      తలనే మరి మరి తలఁచుచు తన్మయమవుచున్!
      తలపుల నిండిన నీకై
      తలవాకిట నెదురు జూతు!త్వరితము రమ్మా!

      తొలగించండి


  9. తలపులవలపులుగలిగెను దలనిండుగబూలుముడిచితరుణినినిన్నే దలచుచునుంటినినిచ్చట
    తలపేమరినీకులేద?తారకరమణా!

    రిప్లయితొలగించండి
  10. తలపుల లోన నిన్ను తలదాలిచి నాను కదా ప్రియా ధరా
    తలమున మీదు భావన సుధారస పానముఁ జేయుచుంటి కై
    తల సుమ మాల కూర్చి తమ దర్శన భాగ్యముకై తపింతు చిం
    తల నిదె బాపు మయ్య యిక తాపము సైపఁగ లేను దర్పకా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది.
      ‘భాగ్యమునకై’ అనడం సాధువు. ‘దర్శన భాగ్యము గోరుచుంటి చిం...’ అందామా?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారము.
      పద్యమును ప్రచురించే సమయములోనే అనుకున్నాను. ఇది తప్పుతుందని.
      మంచి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు గురువుగారూ.

      ధన్యోస్మి.

      తొలగించండి
  11. తల దోకను తెలియని నే
    తల నెన్నుకొనియు నిజముగ తప్పితిమని మీ
    తలపై పెట్టుక చేతులు
    తలపోసిన దీరగలవె ధరలో వెతలున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      ‘తల’తో మీ పద్యం బాగున్నది. కాని ‘విషయం’ గమనించలేదు.

      తొలగించండి
  12. తలగితి వీవు వనాంతర
    తలమున మము వీడి కృష్ణ దయ వీడితివే
    తలపులు నీపై నిడి భూ
    తలమంతయు వెతుక నవగతము గాదాయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. "తల"ను బూలుబెట్టి మరుని ధాటికొఱగి
    "తల"పు లెన్నొ రేగ సతమతంబగుచును
    "తల"చు చుంటిని నిన్నునే తప్తనయి-వె
    "తల"దొలగింప రావోయి! కలసికొనగ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుతుల్యులు సూర్యనారాయణ రావు గారు నమస్కారములు. నాల్గవ పాదములో పొరపాటున గణదోషము దొర్లినట్లున్నది. గమనించండి. బహుశ “ను” మరుగైనట్లున్నది.

      తొలగించండి
  14. తలతువొ నను, మరి లేదో!
    తలవాకిట నీ కొఱకిటు తరుణి నిలువగా
    తలవంపులు గాదె! యకట!
    తలపుల చూలి శరములకు తగునా విడువన్?

    రిప్లయితొలగించండి
  15. తలపుల చూలి = తలపుల బుట్టినవాడు/మనసున బుట్టినవాడు , మన్మథుడు

    రిప్లయితొలగించండి
  16. తలయందు పూలన్ని వలపులుగుక్కగ
    -----రాకున్న నీవిట రాదు నిదుర|
    తలయున్న ఫలితమా?పలుకులువినకున్న
    -----ఆవులింతలురాగ?ఆగునిద్ర|
    తలగడననుజేరి నలిగినసమయాన
    -----పిల్లిగడ్డమునాకు ప్రీతి బెంచె|
    తలవాకి టందున విలువైన నీరాక
    ------చూచి మమేకమై వేచియుంటి|
    తలతుమదియందు కోర్కెల విలువలన్ని
    తలపునందున దాగిన మలినమేగ
    తలనుదించెడి సిగ్గును తరుగ జేసి
    తలుపు దట్టగ నేస్తమా తరలిరమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      ‘కుక్క, మేక...’లను పొరపాటున ఇచ్చి మిమ్మల్ని శ్రమపెట్టినందుకు ముందుగా నన్ను క్షమించండి.
      చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
      ‘వాకిట+అందున’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘తలవాకిటన్ జేరి’ అనండి.

      తొలగించండి
  17. తలలో పూవులను దురిమి
    తలవాకిట వేచి యుంటి తత్తర పడుచున్
    తలపులలో నిన్ను నిలిపి
    తలపోయుచు నలసిపోతి దయగన రావే!!!

    రిప్లయితొలగించండి
  18. తలమౌనా,భరియింప నీవిరహమున్ తారాధిపుండీ విధిన్
    తల మున్కన్ కలిగించె వెన్నెలను,నే తాళ౦గ లేనయ్య చిం
    తల పాల్జేయుట న్యాయమౌన, వలవంతన్ బాప రావేల నా
    తలలో పూవులు వాడిపోవు.పొలుపంతమ్మౌను పూసెజ్జలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ మత్తేభవృత్తం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. తలచితలచి నీలావును కలలఁగంటి
    తలపులుమమేకమయ్యెనీ వలపుతోడ
    తలపులడర నాకుక్కతో తడిచె తనువు
    తలభరమున దురపిల్లి తరిగె సొగసు
    తలకొని వెస చల్లార్చు నా తనువు వేడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మేక, కుక్క, పిల్లులతో ‘తల’పెట్టిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ‘నీలావును’లో ఆవు లేదు.

      తొలగించండి
  20. తలచితి యత్తరముగలిగి
    తలమానికమైనవాడి దరిజేరగ నా
    తలపులు తహతహ లాడెను
    తలడిల్లితినీదువిరహ తాపము తోడన్

    తలవీడు వెళ్ళి యుండిన
    తలపులలో నున్న ప్రియుడు త్యరపడి వచ్చున్
    తలమునకజేసి సొబగుగ
    తలలో మల్లెలను దాల్చి తనకై నిలిచా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘యత్తరము’...?

      తొలగించండి
  21. శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు. మొదట విషయము గ్రహించక వ్రాశాను
    అవగతము చేసిన మీకు ధన్యవాదములు . ఈ పద్యము చూడండి
    తలపులలో నిండిన ప్రియ !
    తలలో సిరిమల్లె పూలు దాల్చియు నీకై
    తలవాకిట నిలచితి నా
    తలపెరిగియు నీవు రమ్ము తప్పక నిపుడే.

    రిప్లయితొలగించండి
  22. ముందుగా (ఆవు-మేక-కుక్క-పిల్లి) లను కూడా వాడి పద్యాలు పూరించిన కవులందరి పాండిత్యానికీ నా నమస్సులు.
    కం.
    తలపున నీవే నాథా
    తల స్నానము జేసినా వదలవైతివి, నా
    తలగడ నలిగెనకో నీ
    తలపుల, దరిచేర రార తలచితి నిన్నే
    - వెంకోరా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకోరా గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘...జేసినన్ వదలవైతివి... నలిగెనొకో/నలిగెనుపో’ అనండి.

      తొలగించండి
  23. తలచుచు దురపిల్లిన సతి
    తలపులలోనే మమేకతను జూపుచు చిం
    తల, కుక్కకు వలె నూగుచు
    తలపగ, నావులను గాచు తన పతిని గనెన్

    తల పోసే నొకతె తమదు వె
    తల తగువులు పిల్లి కుక్క తగవులు కావే ?
    తలపోయ మేక లావుల
    తలలట్టుల నూపుటొకటె తగవులు కాగా !

    తల పగిలి కుక్క యేడ్వగ
    తలనూపుచు పిల్లి సంతతమ్మును పొంగన్
    తలవంచు సతిని మేకను
    తలచక తన యావుగాచ తానేగెకటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      ‘ఆవు,మేక...’లతో మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. తలరాతను నిందించుచు
    తలపుల లోనమునిగి కలతను చెందన్ యా
    తలనొప్పి యధిక మగుచును
    తలతిరుగుడు మొదలగు వనితామణికిన్.

    తలవాకిట నిలబడి నీ
    తలపుల ఝరిలో మునుగుచు దారిన్ చూడన్
    తలకున్ మీరిన వెతలిట
    తలపున్ తబ్బిబ్బు చేసి తల్లడ పరచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. తలగడ దిగులుగ నానెను
    తలపుల జారిన శమలము తాళగ లేకే
    తలలో మల్లెల మాలిక
    తలచీ కమిలెను యరుణిమ దాల్చి విరహమున్

    రిప్లయితొలగించండి
  26. తలగడ దిగులుగ నానెను
    తలపుల జారిన శమలము తాళగ లేకే
    తలలో మల్లెల మాలిక
    తలచీ కమిలెను యరుణిమ దాల్చి విరహమున్

    -నండూరి సుందరీ నాగమణి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నండూరి సుందరీ నాగమణి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది.
      ‘లేకే’ అన్నదానిని ‘లేకన్’ అనండి. ‘తలచీ’ అనడం వ్యావహారికం. ‘కమిలెను+అరుణిమ’ అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. ‘తలచియు కమిలెనె యరుణిమ...’ అనండి.

      తొలగించండి
  27. సవరించిన పిదప నా పద్యము:


    తలగడ దిగులుగ నానెను
    తలపుల జారిన శమలము తాళగ లేకన్
    తలలో మల్లెల మాలిక
    తలచీ కమిలెనె యరుణిమ దాల్చి విరహమున్

    -నండూరి సుందరీ నాగమణి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      నా సూచనలను పాటించి పద్యాన్ని సవరించినందుకు సంతోషం.

      తొలగించండి
  28. తలచుచు నత్తయ్య బుసలు
    తలగడపై నేడ్చుచుండి తలడిల్లిచు నే
    తలనొప్పి తాళ జాలక
    తలవగ నిన్నీ క్షణమున తలనొప్పిక ఠాం! :)

    రిప్లయితొలగించండి
  29. తలచుచు నత్తయ్య బుసలు
    తలగడపై నేడ్చుచుండి తలడిల్లిచు నే
    తలనొప్పి తాళ జాలక
    తలవగ నిన్నీ క్షణమున తలనొప్పిక ఠాం! :)

    రిప్లయితొలగించండి