నచికేత్ గారూ, మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు. అయితే మీరే సవరించుకున్న మీ పద్యంలో ఇంకా కొన్ని లోపాలున్నాయి. నా సవరణలతో మీ పద్యం ..... ధరంజుండు సెప్పుఁ దమ్ముఁ డర్జును తోడ నాలి నంపుచుంటి నేలుకొనుము ఆర్జునుండు సెప్పె నగ్రజా మరచితే భీమసేను వంతు ఝామునుండి.
నేదునూరి రాజేశ్వరి గారూ, మీ పూరణలో విషయం బాగుంది. కాని మొదటి రెండు పాదాల్లో యతి తప్పింది. మూడవ పాదం చివర గణదోషం ఉంది. నా సవరణలతో మీ పద్యం .... లక్షలిచ్చి కొంటి లండను వరుఁడని కాలముండ దొక్క గతిని చూడు జాబు పోయినంత జాతక మెటు మారు? నాలి నంపుచుంటి నేలుకొనుము.
శంకరయ్య గారూ, మీ సవరణ నాకు అర్ధం కాలేదు. ధరంజుండు అంటే చందస్సు సరిపోదు. ధర్మజుండు అంటేనే సరిపోతుంది. 'త' కు, 'ధ' కు యతి సరిపోతుంది కాబట్టి తమ్ముడు అని ప్రయోగించినా తప్పులేదని నాకనిపిస్తుంది.
అంతేలెండి, యద్భావం తద్భవతి అని, మీరు రాముడిని చూశారు, నేను రమ్ము చూశాను. ఊఱకనే సరదగా అడిగాను మాష్టారు, ( సమస్యా పూరణల పానకం లో నా పుడక ) మిమ్మల్ని నొప్పిస్తే పెద్దమనసు తో మన్నించండి. భవదీయుడు ఊకదంపుడు
శిష్య గణము చేత దుష్యంత! నేను నీ
రిప్లయితొలగించండిఆలి నంపుచుంటి నేలుకొనుము.
ఆర్య భూమి నెలమి నలరార్చు పుత్రుండు
కలుగునంచు నంపె కణ్వుడెలమి.
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ సమస్యలో యతి సరిపోయిందా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసామరస్యమున్న సంసారమది నిల్చు
రిప్లయితొలగించండిసతిని వీడు టదియు సబబు కాదు
అలుక చాలు నింక అల్లుడా యిదె నీదు
ఆలినంపుచుంటి నేలుకొనుము
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రశ్న చూసి నేను ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డాను. అందులో యతిదోషం ఏమాత్రం లేదు. ప్రాసయతి ( ఆలి - నేలు ) ప్రయోగించాను.
ధర్మజుండు జెప్పె తమ్ముడర్జునికిటుల
రిప్లయితొలగించండి"ఆలి నంపుచుంటి నేలుకొనుము"
అర్జునుండె బలికె "అగ్రజా, మరితివా?
భీమసేన వంతు ఝామునుండి"
లక్ష లిచ్చి కొంటి నల్లుడ మెరికయని
రిప్లయితొలగించండికాల మెన్న డుండ దొక్క రీతి
జాబు పోయి నంత జాతకము మారునా ?
ఆలి నంపు చుంటి నేలు కొనుము
శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని మనోహరం గా గుర్తు చేసి కణ్వునితొ రసరమ్య మైన పద్యాన్ని అందించిన చింతా వారు కడు ప్రశంస నీయులు
రిప్లయితొలగించండిచింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన మీ పూరణతో నా బ్లాగు ధన్యతను పొందింది. ధన్యవాదాలు.
ఫణిప్రసన్న కుమార్ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ నందించారు. అభినందనలు.
నచికేత్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు. అయితే మీరే సవరించుకున్న మీ పద్యంలో ఇంకా కొన్ని లోపాలున్నాయి. నా సవరణలతో మీ పద్యం .....
ధరంజుండు సెప్పుఁ దమ్ముఁ డర్జును తోడ
నాలి నంపుచుంటి నేలుకొనుము
ఆర్జునుండు సెప్పె నగ్రజా మరచితే
భీమసేను వంతు ఝామునుండి.
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలో విషయం బాగుంది. కాని మొదటి రెండు పాదాల్లో యతి తప్పింది. మూడవ పాదం చివర గణదోషం ఉంది. నా సవరణలతో మీ పద్యం ....
లక్షలిచ్చి కొంటి లండను వరుఁడని
కాలముండ దొక్క గతిని చూడు
జాబు పోయినంత జాతక మెటు మారు?
నాలి నంపుచుంటి నేలుకొనుము.
నా పూరణ -
రిప్లయితొలగించండిపెండ్లియైన పిదప పెద్దకాలం బేగె
కానుపునకు వచ్చె కన్నబిడ్డ
కోర్కె దీరఁ గన్న కొడుకుతో పాటు నీ
యాలి నంపుచుంటి నేలుకొనుము.
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ నాకు అర్ధం కాలేదు. ధరంజుండు అంటే చందస్సు సరిపోదు. ధర్మజుండు అంటేనే సరిపోతుంది. 'త' కు, 'ధ' కు యతి సరిపోతుంది కాబట్టి తమ్ముడు అని ప్రయోగించినా తప్పులేదని నాకనిపిస్తుంది.
నచికేత్ గారూ,
రిప్లయితొలగించండిఅది టైపింగ్ పొరపాటు. నేను ధర్మజుండు కొట్టబోయి rma (ర్మ) కు బదులు ram (రం) కొట్టాను.
శంకరయ్య మాష్టారు గారూ,
రిప్లయితొలగించండి(రం) కొట్టాను.
ఇందులో శ్లేష గానీ దాచారా? :)
లేదండీ. అయినా అది rum కదా! నేను రాసింది ram.
రిప్లయితొలగించండిఅంతేలెండి, యద్భావం తద్భవతి అని, మీరు రాముడిని చూశారు, నేను రమ్ము చూశాను.
రిప్లయితొలగించండిఊఱకనే సరదగా అడిగాను మాష్టారు, ( సమస్యా పూరణల పానకం లో నా పుడక )
మిమ్మల్ని నొప్పిస్తే పెద్దమనసు తో మన్నించండి.
భవదీయుడు
ఊకదంపుడు
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిదానిని నేను సాహితీ చమత్కారంగానే తీసుకున్నాను. సరదాగా నవ్వుకున్నాను. అంతే. ఆ మాత్రం "సెన్స్ ఆఫ్ హ్యూమర్" లేకుంటే ఎలా?
అల్లుని తో మామ...
రిప్లయితొలగించండిఆరు మంది పిల్ల లాడు వా రాయెను
ఏడు యాడు దైన నేలు కొనను!
యనుచు పంపి నావు, అబ్బాయి పుట్టెను
యాలి నంపుచుంటి నేలుకొనుము!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి