22, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం

                       అయ్యప్ప కథాగానం -1
నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ చాలా పెద్దది.   
"శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం,
మధురం మనోహరం ఆనందభరితం" 

అనే పల్లవితో, 80 చరణాలతో ఉన్న దీనిని బ్లాగులో ఒకే పోస్టుగా పెట్టాలంటే ఇబ్బందే. అందువల్ల కేవలం పాట ఆడియో లింకు ఇస్తున్నాను. ఈరోజు మొదటి భాగం ఇస్తున్నాను. రెండు మూడు రోజుల్లో రెండవ భాగాన్ని ఇస్తాను. మిత్రు లెవరైనా కోరితే ఎనిమిది చరణాల కొక పోస్ట్ చొప్పున వరుసగా పదిరోజులు ఇస్తాను. దీనిని పి. డి. ఎఫ్. ఫార్మేట్ లో ఇబుక్ గా పెట్టాలంటే అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. ఇందుకు మిత్రుల సలహాలను ఆహ్వానిస్తున్నాను.
దీనిని క్రింది లింకు ద్వారా విని మీ స్పందన తెలియజేయండి.

 http://www.esnips.com/displayimage.php?pid=32991161

4 కామెంట్‌లు:

  1. గురువు గారికి ధన్యవాదములు, నా కొరకు "శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం, మధురం మనోహరం ఆనందభరితం" పాటను , ప్రచురించగలరు
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  2. నవవిధ భక్తి మార్గములు నౌకగ యొప్పుచు నిమ్ముగా భవా
    ర్ణవమును దాట జేయుచు పరాత్పరు భవ్య పదమ్ము జేర్చు నా
    ప్రవిమల సాధనంబులను బాగుగ కూర్చితివయ్య పాటలన్
    కవివర! శంకరార్య! వడి గాంచెదవీవు విశేష సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్సుమాంజలులు. మీ శీర్షిక తో సంబంధం లేనిదైనా.. తెలుగు కు సంబంధించిన చిన్న అనుమానం ఎలా తీర్చుకోవాలో అర్థమవ్వక ఇలా అడుగుతున్నందుకు అన్యధా భావించవద్దని మనవి. మీ బ్లాగ్ కు నిత్య సందర్శకుడిని నేను. పాండిత్యం లేక పోయినా పద్యాల అందాలను ఆస్వాదించాలనే ఆశ కలిగిన వాడిని. మీ బ్లాగ్ చాలా చాలా బాగుంది.

    ఇక నా ప్రశ్న..

    అన్నమాచార్యుల వారి ఒక కీర్తన లో .. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.. )
    ఒక వాక్యం ఇలా ఉంటుంది.

    "బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా ..." అని..

    ఈ వాక్యం ప్రతి పద అర్థం తెలియజేయవలసినదిగా మనవి..జవాబు కై ఎదురు చూస్తూ.. మీ అభిమాని.

    రిప్లయితొలగించండి
  4. వరప్రసాద్ గారూ,
    మీరు కోరినట్లే పాటను పోస్ట్ చేస్తాను. అయితే కొన్ని భాగాలుగా విడిగొట్టి ప్రకటిస్తాను.
    *
    పండిత నేమాని గారూ,
    ధన్యవాదాలు.
    *
    వరుణుడు గారూ,
    స్వాగతం! సంతోషం.
    ‘బడి’ శబ్దానికి ‘తోడు’ అనే అర్థంకూడా ఉంది. ‘బడిబాయక’ అంటే ‘తోడువదలక’ అనే అర్థాన్ని గ్రహించాలి.

    రిప్లయితొలగించండి