15, అక్టోబర్ 2012, సోమవారం

పద్య రచన - 142

నేటినుండి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:



  1. పాట పాడి కొలుతు బ్రతుకమ్మ నీరూపు
    రంగు రంగు పూల హంగు దీర్చి
    బాట పరువు మమ్మ బాగుగా పూలతో
    నాదు బ్రతుకు లోన, నతులు నీకు.

    రిప్లయితొలగించండి
  2. బతుకమ్మ బతుకమ్మ బంగారు తల్లి
    బత్తితో నినుజేరి భజన చేయుదుము
    పాటలు పాడుచు పరవశించుచును
    వల్లింతుమమ్మ నీ వైభవమ్ములను
    ఆటల నాడుచు నానంద సీమ
    తేలియాడెదమమ్మ నోలలాడెదము
    చల్లగా చూడుమా సంబరాలమ్మ
    చక్కగా బతుకులు సాగించుమమ్మ

    రిప్లయితొలగించండి
  3. సంబరము జరుపు చుండి రి
    యంబరమేయంటు నటు లహాహా యరుపు
    ల్లంబరు పేట్ బతుకమ్మకు
    నంబరములు మేలు రకము నా చ్చా దించీ .

    రిప్లయితొలగించండి
  4. పరచి గుమ్మడాకుల నెల్ల పళ్ళెరమున
    కట్లె పూలను గునుగును కలిపి పేర్చి
    కనుల కింపుగా బొడ్డెమ్మ నునిచి నిలిపి
    దివ్యముగ బతుకమ్మల దిద్ది తీర్చి

    నొసట కుంకుమ కాళ్ళకు పసుపు లద్ది
    సిగన బంతిపూలు తురిమి చీర గట్టి
    ముంగిలి నలికి ముచ్చటన్ మ్రుగ్గు వెట్టి
    పల్లె పట్టణా లందున పరుగు బెట్టి

    తిరుగుచు బతుకమ్మల చుట్టు వరుస దీరి
    పడతు లుయ్యాల పాటలు పాడు కొనుచు
    పంచి పెట్టు కొనుచు తీపి వస్తువులను
    జరుపు కొందురు బతుకమ్మ సంబరమును.

    రిప్లయితొలగించండి
  5. పెద్ద చిన్న యనెడి భేద మించుక లేక
    ఆడువారు మిగుల హర్షమునను
    కూడి యొక్కచోట కుసుమంబు లెన్నియో
    సేకరించి మాల సిద్ధ పరచి

    రమ్యమై వెలుంగు రాశులుగా పేర్చి
    వాటి చుట్టు చేరి వరుసగాను
    భాగ్యమబ్బునంచు భజనలు చేయుచు
    బాధలన్ని మరచి వైభవముగ


    పలురకంబులైన బ్రతుకమ్మ పాటలు
    పాడుచుందు రెంతొ భక్తితోడ
    పడతులందరకును పర్వరాజం బిద్ది
    కాంచగా మన తెలగాణమందు.

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు నమస్కృతులు.
    కొన్ని ముఖ్యమైన పనుల వల్ల గత రెండు రోజులుగా మీ పూరణలను, పద్యాలను సమీక్షించడానికి అవకాశం దొరకడం లేదు. మన్నించాలి.
    బతుకమ్మ సంబరాలపై మేలైన పద్యాలను వ్రాసిన...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సత్యనారాయణ మూర్తి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారూ, బతుకమ్మ పండుగ గురించి రాసిన కవులకు, వారికి ఈ అవకాశం ఇచ్చిన మీకు థాంక్స్. ఈ పండుగను బహుళ ప్రచారంలో తీసుకొచ్చిన కవిత, నందిని సిద్దారెడ్డి గార్లు & తదితరులు ధన్యులు.

    రిప్లయితొలగించండి
  8. గొట్టిముక్కల వారూ,
    ధన్యవాదాలు. ఈ పండుగకు రావలసిన ప్రాచుర్యం ఇంకా రాలేదు.

    రిప్లయితొలగించండి