2, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 839 (హింస కలుగఁజేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
హింస కలుగఁజేయు హితము భువికి.

28 కామెంట్‌లు:

  1. అఖిల జీవులందు నాత్మనే గాంచెడు
    భవ్య జీవి పొందు పరమ సుఖము
    సాధు వర్తనమ్ము, శాంతియు, సత్య మ
    హింస కలుగ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  2. చండ కౌశికుండు సాధ్వి యానతి జేరె
    వ్యాధుడైన ధర్మ పరుని కడకు
    జీవ లక్షణముల గావించె బోధ; య
    హింస కలుగ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  3. పంట పండు కొరకు వ్యవసాయదారుండు
    పిచ్చి మొక్కలన్ని పీకి వేయు
    చీడ పీడ లన్ని చెలగును గద నిట్టి
    హింస కలుగఁజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు
    మీ పద్యము 3వ పాదములో "చెలగును గద యిట్టి" అని యడాగమము చేస్తే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. సంశయమ్ము లేదు సజ్జన! సత్య మ
    హింస కలుగ జేయు హితము భువికి
    మతము లందునగల హిత వాక్య మిదియైన
    బెరుగుచుండె హింస పృథ్వి పైన .

    రిప్లయితొలగించండి
  6. వంశ వారసత్వ వర రాజకీయాలు,
    హింస,దమన కాండ, హీనముగ-వి
    ధ్వంసమవని జేయు దర్పుల దండించు
    హింస కలుగజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  7. ధైర్య వంతు డయ్యు భీ రుని గానిల

    హింస కలుగ జేయు, హితము భువికి

    ప్రాణ హింస మాను ప్రతిన సే గలిగిన

    హింస కలుగు నెడల హేయ మదియ .

    రిప్లయితొలగించండి
  8. జీవు డొకడె - ప్రాణి జీవ వైవిధ్యము
    నంతరించు హింస యధిక మైన ;
    ప్రాణు లన్నిటికిని పరమ ధర్మమగు న
    హింస కలుగు జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి

  9. (మహాత్ముని యహింసా పద్ధతిలో సహాయ నిరాకరణముఁ జేసిన, భరత భూమికి హితము కలుగఁ గలదని యాశయము)

    తెల్ల దొరలకన్న, నల్ల దొరలు దేశ
    భక్షకులయి రిల్లు వల్లకాడె!
    త్యాగ శాంతి సత్య ధర్మాలకన్న య
    హింస కలుగఁ జేయు హితము భువికి!

    (2)
    హింస కలుగఁ జేయు హితము, భువికి నేమి
    యున్నదయ్య? దానఁ గలుగు నష్ట
    మింత యనియుఁ జెప్ప నేరికి సాధ్య? మ
    హింసయే గెలుచును! హితముఁ గనును!!

    రిప్లయితొలగించండి
  10. తాటకిని వధింప తప్పదు శ్రీరామ
    నాతి యంచు జంక నయము గాదు
    ధర్మ నాశ నులగు దైత్యుల జంపుచో
    హింస కలుగఁ జేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  11. సరియగు సవరణ చూపిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    పంట పండు కొరకు వ్యవసాయదారుండు
    పిచ్చి మొక్కలన్ని పీకి వేయు
    చీడ పీడ లన్ని చెలగును గద యిట్టి
    హింస కలుగఁజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మకు శుభాశీస్సులు.
    నీ పద్యమును మరికొంచెము అన్వయ సౌలభ్యము కొరకు ఇలాగ మార్చేను:

    సాధ్వి హితమును విని చనగ ధర్మ వ్యాధు
    కడకు మౌని చండ కౌశికుండు
    వాని కిటుల చెప్పె జ్ఞానమ్ము నాతడ
    హింస కలుగ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  13. అయ్యా శ్రీ వామన్ కుమార్ గారు! శుభాశీస్సులుమీ పద్యము 2వ పాదము చివర్ వి అని 3వ పాదము మొదటిలో ధ్వంస అని విధ్వంస అనే పదమును వాడేరు. అందుచేత వి గురువు అయి గణ భంగము అయినది. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. తల్లి కెపుడు ప్రేమ తన సంతుపై మెండు
    కంటి యెదుట వారు కలత పడుచు
    గుండె కోత కోయు కండ బలము వీ డ
    హింస కలుగఁ జేయు హితము భువికి !

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    ‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న గీతాతత్త్వాన్ని ప్రస్తావిస్తూ అహింసాదులు లోకహితమని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రాంభట్ల వారి భావాన్ని గ్రహించి మీరు వ్రాసినది సవరణ వలె కాకుండా స్వతంత్ర పద్యంవలె ఉంది. ధన్యవాదాలు.
    *
    ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    చండ కౌశికుని వృత్తాంతంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కలుపుమొక్కల పట్లా, చీడపురుగుల పట్లా హింస మేలు చేస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేను పూరణ వ్రాసి తీరా చూస్తే అది మీ పద్యాన్ని అనుకరించినట్లే కనిపించింది. అందువల్ల దానిని బ్లాగులో ప్రకటించలేదు. మరొకటి వ్రాసే అవకాశం ఇప్పటివరకైతే లభించలేదు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన కుమార్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన ననుసరించి ‘హీనముగను / ధ్వంస...’ అని సవరిస్తే సరి!
    *
    సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    మొదటి పాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో ‘సే’..?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘ధర్మనాశనులు’... ‘ధర్మఘాతకులు’ అయితే...?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం మెచ్చుకొనదగినది.
    ‘బలము వీ డ/హింస’ పదవిభాగం కొద్దిగా సంశయాత్మకం.

    రిప్లయితొలగించండి
  16. భారతీయులుగా అహింస ఓర్పు సహనం అంటూ గత అరవై ఏళ్లలో ఇంటా బయటా చాలా నష్టపోయాము. ఇంట్లో పిల్లల్ని మంచికోసం శిక్షించినట్లే దేశానికి కూడ పరిస్థితులబట్టి కొంత కరకుదనం అవసరమే.
    హద్దుమీరినప్పు డొద్దహింసాదులు
    మెత్తనైన దాని వత్త బుద్ధి
    యగును వలయు నప్పు డడగక వడ్డించు
    హింస కలుగఁజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ ధన్యవాదాలు.
    మీ సూచన అవశ్యం ఆమోద యోగ్యం.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారూ,
    మొదట్లో హీనముగను , ధ్వంస - అనే వ్రాసుకున్నాను.కానీ సందేహించాను. మీరు చెప్పినట్లు గానే పద్యాన్ని మారుస్తున్నాను.

    వంశ వారసత్వ వర రాజకీయాలు,
    హింస, దమన కాండ, హీనముగను
    ధ్వంసమవని జేయు దర్పుల దండించు
    హింస కలుగజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  19. దొరలని మితి మీఱ పరదేశ పాలక
    మధమడంచి స్వేచ్ఛఁ మనకు నీయ
    బాలలూ వినుడిల బాపు పాటించె డ
    హింస కలుగఁ జేయు హితము భువికి!

    రిప్లయితొలగించండి
  20. ధరణిఁ దారుణాల దనుజులు తలపెట్ట
    ధర్మ పాల నెంచి మర్మ మెఱిఁగి
    హరియె వారిఁ గూల్చ నవతార మెత్తగన్
    హింస కలుగ జేయు హితము భువికి!

    రిప్లయితొలగించండి



  21. దీనిని రెండు విధాలుగా పూరించవచ్చును.
    1.
    రక్తసిక్త మైన రణభూమి యీ ధాత్రి
    శాంతి,ప్రేమ కొరకు సకల జనులు
    పరితపించు నట్టి వాతావరణ మన్
    దహింస,కలుగజేయు హితము భువిని.

    2. శాంతి యత్నములను సరకు జేయనివారు
    బద్ధశత్రు లమిత పాపకర్ము
    లైనవారి నెల్ల యని నెదరించెడి
    హింస,కలుగజేయు హితము భువిని.

    రిప్లయితొలగించండి



  22. దీనిని రెండు విధాలుగా పూరించవచ్చును.
    1.
    రక్తసిక్త మైన రణభూమి యీ ధాత్రి
    శాంతి,ప్రేమ కొరకు సకల జనులు
    పరితపించు నట్టి వాతావరణ మన్
    దహింస,కలుగజేయు హితము భువిని.

    2. శాంతి యత్నములను సరకు జేయనివారు
    బద్ధశత్రు లమిత పాపకర్ము
    లైనవారి నెల్ల యని నెదరించెడి
    హింస,కలుగజేయు హితము భువిని.

    రిప్లయితొలగించండి



  23. దీనిని రెండు విధాలుగా పూరించవచ్చును.
    1.
    రక్తసిక్త మైన రణభూమి యీ ధాత్రి
    శాంతి,ప్రేమ కొరకు సకల జనులు
    పరితపించు నట్టి వాతావరణ మన్
    దహింస,కలుగజేయు హితము భువిని.

    2. శాంతి యత్నములను సరకు జేయనివారు
    బద్ధశత్రు లమిత పాపకర్ము
    లైనవారి నెల్ల యని నెదరించెడి
    హింస,కలుగజేయు హితము భువిని.

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    చావు పుటకలే గదా జీవ చక్రము :

    01)
    _______________________________

    హింస్రకములు పశుల - హింసింప కున్నచో
    హేమ మీద ప్రాణు- లిముడు టెట్లు ?
    హింస జేయు క్రియయె - హిండుకునకు పని ! -
    హింస కలుగ జేయు - హితము భువికి !
    _______________________________
    హింస్రకము = క్రూర మృగము
    హేమ = భూమి
    హిండుకుడు = శివుడు(లయకారకుడు)

    రిప్లయితొలగించండి
  25. గోలి వారి స్ఫూర్తితో :

    వ్యవసాయము కూడా హింసే గదా :

    02)
    _______________________________

    కీటకముల కెపుడు - కీడునే దలపెట్టు
    కలుపు మొక్క లన్ని - కాపు పీకు !
    కమత మందు హింస - గలుగక పంటెట్లు ?
    హింస కలుగ జేయు - హితము భువికి !
    _______________________________

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో :

    విశ్వామిత్రుడు రామునితో :

    03)
    _______________________________

    రమణి యంచు విడుచు - సమయము గాదిది
    రక్ష గలుగు జనుల - కక్షయముగ !
    రామ ! రయము జంపు - రక్కసి తాటకిన్
    హింస కలుగ జేయు - హితము భువికి !
    _______________________________

    రిప్లయితొలగించండి