19, అక్టోబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 853 (దేహము లేనట్టివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. సోహంబనుతత్వార్థము
    నాహార్యముగాధరించియనితరమగుప్ర
    త్యాహారయోగముల సం
    దేహములేనట్టివాడె తేజమునొందున్.

    రిప్లయితొలగించండి


  2. ఆహా !యేమని యంటి రి ?

    దేహము లేనట్టి వా డె తేజము బొందున్

    ఓహో ,యేమిది వాక్యము ?

    ఆహాహా సంతసమ్ము నయ్యె ను మదిలో .

    రిప్లయితొలగించండి
  3. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ఆధ్యాత్మిక పరంగా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. మోహము నశించుకొలఁదియుఁ
    గోహమ్మను పృచ్ఛయెసఁగి, కోర్కులడంగన్,
    దేహమ్ముండు దనుక, సం
    దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్.

    రిప్లయితొలగించండి

  5. శ్రీ శంకరయ్య గురువుగారికి దన్యవాదములు


    రిప్లయితొలగించండి
  6. ఆహా భగవానుడు గద
    దే హము లేనట్టి వాడె , తేజము బొందున్
    మోహాదులు లేకుండిన
    దేహము మఱి శుద్ది యగును దిన దిన వృ ద్దిన్

    రిప్లయితొలగించండి
  7. వాహనము లన్న యతనికి
    మోహము లేదంచు మదిని మోదము వీడన్ !
    ఐహిక సుఖముల గోరెడు
    దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్ !

    రిప్లయితొలగించండి
  8. చక్కని పూరణలు చేసిన సంపత్ గారికి, సుబ్బారావు గారికి, మధుసూదన్ గారికి, రాజేశ్వరి గారికి అభినందనలు.

    దేహమనిత్యము యాత్మకు
    గేహంబిదె యనుచు నెరిగి కీర్తించుచు తా
    నూహను దేవుని పై సం
    దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇంతకీ ఆ వాక్యంవల్ల సంతోషం ఎలా కలిగింది? ‘సంతసమ్ము’ను ‘సందియమ్ము’గా మార్చితే ఎలా ఉంటుందంటారు?
    మీ రెండవ పూరణ చాలా బాగుంది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఈరోజు మీ పూరణ రాలేదేమిటా అని చూస్తున్నాను. సంతోషం...
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నిత్యము + ఆత్మకు’ అన్నప్పుడు యడాగమం రాదు కదా. ‘నిత్య మ్మాత్మకు’ అందాం.

    రిప్లయితొలగించండి
  11. మాస్టారు గారూ! ధన్యవాదములు.
    మీరు చేసిన సవరణతో...
    మాకు కరెంటు ఉ 800 గం లకు పోతుంది. ఈ లోగా మీకు సమస్యను మెయిల్ చేసి కార్యాలయమునకు వెళ్ళినాను. కార్యాలయము నుండి వచ్చిన తరువాత నేను ఇచ్చిన సమస్యను చూచి సంతోషించాను. ధన్యవాదములు.

    దేహ మనిత్య మ్మాత్మకు
    గేహంబిదె యనుచు నెరిగి కీర్తించుచు తా
    నూహను దేవుని పై సం
    దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్.

    రిప్లయితొలగించండి
  12. సోదరుల మెప్పు పొందగలిగి నందులకు చాలా ఆనందము గా ఉన్నది ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి
  13. దాహంబు రామ నామము
    సాహస వీరుడు హనుమకు సంకీర్తనలం
    దూహించ! రాముపై సం
    దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్!

    రిప్లయితొలగించండి
  14. "స్నేహము చేయకు దుర్జన
    ద్రోహము గావించబోకు'దోస్తుల' కెపుడున్"
    సహృదయు వాక్కులు విన సం
    దేహము లేనట్టి వాడు తేజము బొందున్.

    రిప్లయితొలగించండి
  15. దాహంబు రామ నామము
    సాహస వీరుడు హనుమకు సంకీర్తనలం
    దూహించ! రాముపై సం
    దేహము లేనట్టి వాఁడె తేజముఁబొందున్!

    రిప్లయితొలగించండి
  16. స్నేహము వైరము నెరుగక
    సోహమ్మను జ్ఞానమున విశుద్ధాత్ముండై
    ఐహిక వికార మయమగు
    దేహము లేనట్టివాడె తేజము బొందున్

    రిప్లయితొలగించండి
  17. కోహమ్మని నాహమ్మని
    సోహమ్మని యెంచి తాను శోభిల్లంగన్
    మోహమయ పంచ కోశపు
    దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్

    రిప్లయితొలగించండి
  18. మోహముతో దేవళముల
    దాహముతో వోట్లకొరకు దండాలిడెడిన్
    రాహులు మూఢతపై సం
    దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్

    రిప్లయితొలగించండి


  19. ఓహోహో అటులనకో
    దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్?
    మీ హామీగొని మేమిక
    యీ హర్మ్యము విడిచెదమిక యీప్సితముగనౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి