28, అక్టోబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 861

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

20 కామెంట్‌లు:

  1. Yesterday's samasyaapooraNa

    ఎగసిపడు విషాగ్నులనే
    నగజాపతి మ్రింగె మున్ను, నరులా పిదపన్
    పొగ త్రాగుట మొదలిడిరట
    పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, "హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగి్" అని పడింది. చివరి రెండక్షరాలూ ఏమిటవి?

    రిప్లయితొలగించండి

  3. ధరణీసుతను వెదుకమని
    నరవరకుల శశధరుండు జ్ఞానమయ ప్రభా
    కరుడఖిల దనుజ గణసం
    హరు డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారూ,
    టాబ్‌లెట్‌లో టైప్ చేసి పోస్ట్ చేయడం వల్ల అక్షరదోషాలు వచ్చాయి. నా పూర్వ విద్యార్థి ఆ టాబ్‌లెట్‌ను గిఫ్ట్‌గా కొన్నిచ్చాడు. టాబ్‌లెట్ ద్వారా బ్లాగులో కొత్తపోస్ట్ పెట్టగలనా లేదా అని ప్రయోగాత్మకంగా ప్రయత్నించాను. ఆ పోస్ట్‌ను రద్దు చేసి డెస్క్‌టాప్ ద్వారా సవరించిన పోస్ట్ పెట్టాను.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    హరిణమయిన దానవ సం
    హరు డుంగర మిచ్చి పంపె - హనుమంతు నొగిన్
    హరువరి , సరి బలవంతుడు
    హరునంతటి మేటి గాన - యాహవ మందున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  6. సురలోక వందితుడు ముని
    వర శ్లాఘిత పావనుండు పరమ కృపా సా
    గరుడును సీతా మానస
    హరు డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

    రిప్లయితొలగించండి
  7. నిన్నటి పూరణ:
    స్వగతముననిట్లనుకొనెన్
    పొగత్రాగని వాడు,"దున్నపోతైపుట్టున్
    పొగత్రాగువాడునెల్లర
    వగపుకు గురిజేయునట్టిపాపముతోడై!"

    నేటిపూరణ:
    తరుణీమణి సీతఁవెదక
    నరివీరభయంకరుండునంజనసుతుడే
    సరియని తలచి దురిత సం
    హరుడుంగరమిచ్చి పంపె హనుమంతునొగిన్

    రిప్లయితొలగించండి
  8. అ రిలోక భయంకరు డే
    హరు డుం, గర మిచ్చి పంపె హనుమంతు నొగిన్
    నర రూ పుడు ,భగ వంతుడు
    ధరణిని గాపాడు వాడు , ధర్మ జ్ఞుం డున్ .

    రిప్లయితొలగించండి

  9. కురియగ కన్నీరేరై
    ధరణిజకై పొగిలి పొగిలి తపియించుచు తా
    నరుడై మెలగెను హరి! భవ-
    హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

    రిప్లయితొలగించండి
  10. పరవశమునగల సీతను
    సరగున కనుగొను మటంచు సద్బలశాలిన్
    ఖర,దూషణ,తాటక సం
    హరుడుంగ మిచ్చి పంపె హనుమంతునొగిన్.

    రిప్లయితొలగించండి
  11. వర గుణవంతుడు మారుతి
    ధరజాతను వెతుక బోవ తరలెడు వేళన్
    గురికుదిరి యవనిజ మనో
    హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులారా,
    కందాన్ని సాఫీగా నడపగలిగిన వారికి ఈనాటి సమస్య చాలా సులభం. హర శబ్దాన్ని రామపరంగా విశేషణాలను చేర్చి (సుబ్బారావు గారు తప్ప) అందరూ మంచి పూరణ లిచ్చారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘దనుజ సంహరుని’ గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    హరిణమైనది దానవుడు కదా! దానవసంహరుడు కాదు కదా! ఇక్కడ సందిగ్ధార్థం వస్తున్నది.
    ‘హరిణస్వరూప దానవ/ హరుడు...’ అందాం.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘సీతా మానస హరు’ డన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘వర శ్లాఘిత’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం. ‘వరసంస్తుత’ అంటే సరి!
    *
    సహదేవుడు గారూ,
    నిన్నటి సమస్యకు అక్కడే పూరణ ఇస్తే మిత్రులు చూడరేమో అని ఇక్కడ ఇచ్చారా? కొంత వాస్తవముంది. ఒక్కొక్కసారి చూడకపోవడం జరుగుతూ ఉంటుంది. పూరణ బాగుంది. అభినందనలు.
    ఈనాటి సమస్యకు ‘దురిత సంహరుని’ గురించిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో శివుడిని, రాముడిని వేరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    రాముణ్ణి భవహరుణ్ణి చేసారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    సమాసంలో ‘తాటకా సంహరుడు’ అవుతుంది కదా. అలా అంటే గణదోషం. కాబట్టి దానిని ‘ఖర దూషణాది రాక్షస/ హరుడు..’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. హరి యవతార మనగ
    నరుడగు రాముడు తన సతి సంకల్పమునన్ !
    గుఱుతుగ గొనిపోవ లంకకు
    హరుడుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్ !

    రిప్లయితొలగించండి
  14. సందేహాన్ని దీర్చి న గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  15. హరహరనంచును రావణు
    దొరకొని తాదొంగిలించ దోషహరుందే
    సురనుత సీతను వెదకను
    హరుడుంగర మిచ్చి పంపే హనుమంతునొగిన్

    రిప్లయితొలగించండి
  16. "అరె! యా శకుంతల వలెను
    గురుతును పోగొట్టుకొనకు గుహ్యం!" బనుచున్
    నరవరుడా రాక్షస సం
    హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్

    రిప్లయితొలగించండి