29, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 862 (చిత్రమ్మే మాటలాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. చిత్రము లే 'దాన్ లైన్లో '
    గాత్రము వినబడును చూడ కనబడు నేడీ
    సూత్రము వ్యాప్తంబాయెను
    చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రిగారూ, మీ ఇంటర్నెట్ స్పీడు పెంచండి, అప్పుడా ప్రోబ్లెముండదు:-)

    రిప్లయితొలగించండి
  3. ధాత్రిన్ నటీ నటులు బహు
    పాత్రలలో వెల్వరింప ప్రతిభ సినీమా
    చిత్రాలని యీ జగమున
    చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్

    రిప్లయితొలగించండి
  4. చిత్రము నెదురుగ నిడి యుష
    చైత్రసఖుని నతిశయించు ననిరుద్ధుని తోన్
    చిత్రముగ బలుక నెంచెను
    చిత్రమ్మే ! మాటలాడె చిత్రము తోడన్.

    పత్రియును పూలు గణపతి
    చిత్రము కెదురుగను బెట్టి చేసెను పూజల్
    ఛాత్రుడు వరముల నడుగుచు
    చిత్రమ్మే ! మాటలాడె చిత్రము తోడన్.

    రిప్లయితొలగించండి
  5. మిత్రునకంతర్జాలవి
    చిత్రముచూపంగదలచి చిత్రముతోడన్
    పాత్రోచితభాషణములు
    చిత్రమ్మే? మాటలాడె చిత్రముతోడన్.

    గురువుగారు,

    పద్యములో స్పష్ఠత లోపించిందేమో అని నా భావన. ఇంకొక ప్రయత్నము చేస్తాను.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారు,

    మీ నిర్వహణలో మేము పాల్గొన్న అంతర్జాల అష్టావధానము గురించిన ఒక సంపాదకీయము ( జ్యోతిగారిచే ) ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమైనది. చాలా గర్వంగా ఉన్నదండీ.

    మన:పూర్వక ధన్యవాద శతం.

    http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/29102012/4

    రిప్లయితొలగించండి
  7. అంతర్జాల అవధానములా? అంతర్ధాన అవధానములా?

    అంతర్జాల అవధానములని ఒక క్రొత్త ప్రక్రియను మొదలిడుటను చూచేను. అవి ప్రశంసనీయములు కావు. అవధానమునకు కావలసిన ధార మరియు ధారణలు అందులో కనుపింపవు. చిత్తైకాగ్ర్యం అవధానం అని ఆర్యోక్తి. అంతర్జాలములో అట్టి అవకాశము లేదు. కేవలము పద్య రచన మాత్రమే కానుపించును. ప్రత్యక్షముగా చేసి పండితులను ఆకట్టుకొను అవధానములు మాత్రమే ప్రోత్సహింప దగినవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. చిత్రములు జ రుగు చున్నవి
    చిత్రమునే స్క్రీను మీద చేతులు కదిపీ
    చిత్రముగ తోలు బొమ్మల
    చిత్రమ్మే మాట లాడె చిత్రము తోడన్ .

    రిప్లయితొలగించండి
  9. మిత్రుల మేమంత కలసి
    చిత్రమ్మును జూడ గోరి జేరితి మొకచో !
    పత్రమ్ముల పంచె నొకడు
    చిత్రమ్మే మాట లాడె చిత్రము తోడన్ !

    రిప్లయితొలగించండి

  10. నలుని చిత్రపటాన్ని చూచి తన వలపును తెలుపుకుంటున్న దమయంతిని చూచి ఆమె చెలులు...

    ధాత్రీశుఁడు నలుని పటము
    నేత్రోత్సవ మొప్పఁ గాంచి “నిను వలచితి” నం
    చాత్రముగ రాజపుత్రిక
    చిత్రమ్మే! మాటలాడె చిత్రముతోడన్.

    రిప్లయితొలగించండి
  11. మిత్రుడు గీసెను చిత్ర వి
    చిత్రపు బొమ్మలను చలన చిత్రము కొఱకై !
    మిత్రుడ ! కార్టూన్ ఫిల్మది !
    చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.

    రిప్లయితొలగించండి
  12. పుత్రులు విదేశ చరులై
    చిత్రంబుగ 'వీడియో'ల క్షేమము లడుగం
    గాత్రము దీరుట తండ్రికి
    చిత్రమ్మే! మాటలాడె చిత్రము తోడన్!

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘ఆన్‌లైన్’ చిత్రాల పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    చలనచిత్రాలు మాటలాడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మీ మొదటి పూరణను ముందే చూసి ఉంటే నేను నా పూరణను పోస్ట్ చేయకపోయేవాణ్ణి.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘ఆత్రముగా గాంచుచుండి యనిరుద్ధుని తోన్’ అందామా?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    భావం కొంత సందిగ్ధంగా ఉన్నా పద్యం బాగుంది.
    *
    సుబ్బరావు గారూ,
    చిత్రవిచిత్రమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కదిపీ’ అని వ్యావహారికాన్ని ఉపయోగించారు. ‘కదుపన్’ అంటే బాగుంటుందని సూచన.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఏమా ధార! కందం మీ చేతుల్లో అందంగా ఒదుగుతున్నది. సంతషం! చక్కని పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ‘వీడియో చాటింగ్’పై మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఏమి నా భాగ్యము ? గురువుల మన్ననలను పొంద గలిగిన యదృష్తము !
    నేర్పిన గురువుల కృషి ఆ దేవీ కటాక్షము . కృతజ్ఞతా పూర్వక నమస్కృతులు

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ ! ధన్యవాదములు. చై.. లోని ఐకు అని.. లోని అకు యతి కలుస్తుందని నేననుకుంటున్నాను. దయచేసి సందేహ నివృత్తి చేయండి.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా!
    శ్రీ నాగరాజు రవీందర్ గారూ!

    మీ పద్య పాదము -- "చైత్రసఖుని నతిశయించు ననిరుద్ధుని తోన్"

    యతి హల్లునకు హల్లునకు అటులే అచ్చునకు అచ్చునకు కూడా చెల్లవలెను. మీ పాదములో అచ్చునకు అచ్చునకు మాత్రమే చెల్లినది. హల్లునకు హల్లునకు యతి చెల్ల లేదు. అందుచేత సరిజేయవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. నా యొక్క సందిగ్ధమును తొలగించి నందులకు నేమాని గురువర్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. నా మొదటి పద్యము సవరణ తరువాత :

    చిత్రము నెదురుగ నిడి యుష
    ఆత్రముగా గాంచుచుండి యనిరుద్ధుని తోన్
    చిత్రముగ బలుక నెంచెను
    చిత్రమ్మే ! మాటలాడె చిత్రము తోడన్.

    రిప్లయితొలగించండి
  19. చిత్రమ్మును థ్యేటరులో
    మిత్రుండొగి జూచి యడిగె మిక్కిలి బ్రమతో
    సూత్ర మిదేమిటి తెలుపుము
    చిత్రమ్మే మాటలాడె చిత్రముతోడన్.

    రిప్లయితొలగించండి
  20. చిత్రమ్మును థ్యేటరులో
    మిత్రుండొగి జూచి యడిగె మిక్కిలి బ్రమతో
    సూత్ర మిదేమిటి తెలుపుము
    చిత్రమ్మే మాటలాడె చిత్రముతోడన్.

    రిప్లయితొలగించండి

  21. చిత్రములోపల నటన - వి
    చిత్రమ్ముల భావమెన్న చిత్త ప్రవృత్తిన్
    చిత్రపు కలలో మెలిగన
    చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్

    రిప్లయితొలగించండి
  22. పత్రమ్ముల దినములలో
    మిత్రుల కన్నుల కలయిక మితమై యుండన్
    చిత్రము! వ్హాట్సపు విడియో
    చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్

    రిప్లయితొలగించండి