30, సెప్టెంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 837 (గాంగేయుం డనఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్. 
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు. 

18 కామెంట్‌లు:

  1. సంగరమున కుత్సాహము
    పొంగగ నరుదెంచు సుగుణ భూషణు గనుడీ
    సింగంబే యాతండని
    గాంగేయుండనగ గ్రీడిగా నెరుగవలెన్

    రిప్లయితొలగించండి
  2. భృంగీశుని యంగభవుడు
    గాంగేయుం డనగ ; గ్రీడిగా నెఱుగ వలెన్
    సంగర రంగమున నతని
    యంగూషపు వేగము గని ; యంబుజ నాభా !

    రిప్లయితొలగించండి
  3. లొంగని యోధుడు వయసుకు
    గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్
    సంగర రంగమ్మొక క్రీ-
    డాంగణమై చెలగు వీరు డవనిని యనఘా.

    రిప్లయితొలగించండి


  4. గంగా దేవికి పుత్రుడు
    గాంగేయుం డనగ, గ్రీ డి గా నె ఱు గ వలెన్
    నం గా ధీ శు డు కర్ణుని
    సం గాతుడు ,కుంతి కొడుకు శం కరు భక్తున్ .

    రిప్లయితొలగించండి
  5. కొంగునబంగారంబై
    సంగరమున శత్రుఁదునుమసారధియగుచున్
    రంగడునడిపెడు నరుఁడని
    గాంగేయుండనగఁగ్రీడిగా నెఱుఁగవలెన్!

    రిప్లయితొలగించండి

  6. హంగుగ గాండీవి యనన్,
    సంగర రంగమున నతని సరిపోల్చంగన్,
    రంగారు యోధుఁడగు నీ
    గాంగేయుం డనఁగఁ, గ్రీడిగా నెఱుఁగ వలెన్!

    రిప్లయితొలగించండి
  7. సంగరమున శాత్రవులను
    దుంగలవలె గూల్చినట్టి దోర్బలశాలిన్
    సింగము రణరంగ మునను
    గంగేయుండనగ, గ్రీడిగా నెరుగవలెన్

    రిప్లయితొలగించండి
  8. ఉత్తర గోగ్రహణం లో..అజ్ఞాత వాసం పూర్తి అయిన పిదప మాత్రమే కిరీటి బయట పడ్డాడని భీష్ముడు దుర్యోధనునికి చెప్పగా
    దుర్యోధనుడు కర్ణునితో...

    సింగమె బయటకు వచ్చెను
    చెంగున యజ్ఞాత వాస చివరను పూర్తై
    సంగర మునకై కనుడని
    గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.

    రిప్లయితొలగించండి



  9. బంగారుతేరునందు గ
    నంగా వచ్చున దెవరొ యనంగా కురురాజా
    రంగమునందిగె బోరన్
    గాంగేయుండనగ గ్రీడి గానెరుగవలెన్ .

    రిప్లయితొలగించండి
  10. గాంగేయుడు త్యాగ ధనుడు
    బంగరు సీవకము వీడి భట్టా రకుడై !
    పొంగారెడు కీర్తి నొందిన
    గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగ వలెన్ !

    సీవకము = కిరీటము

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పద్యము 2వ పాదములో తప్పులు దొరలినవి:
    (1) చెంగున + అజ్ఞాత - అనే చోట యడాగామమురాదు. నుగాగమము చెయ్యాలి.
    (2) అజ్ఞాత వాస + చివరన - దుష్ట సమాసము అవుతుంది.
    అందుచేత 2వ పాదమును ఇలాగ మార్చుదాము:
    "హంగుల నజ్ఞాతవాస మయిపోయె నిదే"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో కొన్ని సవరణలు చెయ్యాలి:
    (1) వయసుకు అనరాదు - వయసునకు అనేది సాధు ప్రయోగము.
    (2) అవనిని + అనఘా - ఇక్కడ యడాగమము రాదు.
    సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    గంగాధరునికి తనయుడు
    గాంగేయుండనగ ! క్రీడి - గా నెరుగవలెన్
    గంగాధరు నంగాంగము
    గొంగను వలె గుంజినట్టి - కుంతీ సుతుడే !
    _______________________________
    గాంగేయుడు = కుమారస్వామి
    గొంగ = శత్రువు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో...

    సింగమె బయటకు వచ్చెను
    హంగుగ నజ్ఞాతవాస మయిపోయె నిదే
    సంగర మునకై కనుడని
    గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులారా!
    నమస్సులు.
    నిన్న రోజంతా విద్యుల్లోపం కారణంగా మీ పూరణలను, పద్యాలను చూసి స్పందించలేక పోయాను. వైవిధ్యంగా సమర్థంగా పూరణలు పంపిన
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    వసంత కిశోర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    మరికొద్ది సేపటిలో కరెంట్ పోతుంది. అవకాశం లభిస్తే సాయంత్రం వరకు ఒక్కొక్కరి పూరణను సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యా మీ సూచనకు ధన్యవాదములు.
    సవరించిన నా పూరణ:

    లొంగని యోధుడు ముదిమిన్
    గాంగేయుం డనఁగఁ గ్రీడిగా నెఱుఁగవలెన్
    సంగర రంగమ్మొక క్రీ-
    డాంగణమై చెలగు వీరు డవనిని వత్సా!

    రిప్లయితొలగించండి
  17. "సింగారమె నీది కదర!
    కంగారేలర! మురారి కాపాడు నినున్!
    వంగెద వానికి నేన"ని
    గాంగేయుం డనఁగఁ;...గ్రీడిగా నెఱుఁగవలెన్

    రిప్లయితొలగించండి