31, డిసెంబర్ 2015, గురువారం

సమస్య – 1900 (షణ్మాసము లనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.
ఈ సమస్యను పంపిన కవిమిత్రమా! ధన్యవాదాలు. ఇంతకూ ఈ క్లిష్టసమస్యకు మీ పూరణను సిద్ధం చేసుకున్నారా?

పద్యరచన - 1134

కవిమిత్రులారా,
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ 
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో 
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”

నన్నయ గారి పై పద్యం యొక్క పూర్తి భావాన్ని కాని, కొంతభాగాన్ని కాని తేటగీతిలో చెప్పండి.

30, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య – 1899 (అవనీశ్వరు లెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 1133

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

29, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య – 1898 (భజనాదుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే. 
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 1132

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“చలి”

28, డిసెంబర్ 2015, సోమవారం

సమస్య – 1897 (యాగ మనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.

పద్యరచన - 1131

కవిమిత్రులారా,
“దినదినము గండ మాయెను...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

27, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య – 1896 (ప్రద్యుమ్నుం డొకఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.

పద్యరచన - 1130

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

26, డిసెంబర్ 2015, శనివారం

దత్తపది - 86 (అసి-కసి-నుసి-మసి)

కవిమిత్రులారా,
అసి - కసి - నుసి - మసి
పై పదాలను ఉపయోగించి సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

పద్యరచన - 1129

కవిమిత్రులారా,
“ఇందుఁ గలఁ డందు లేఁడను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి వింటే!”

పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందస్సులో వ్రాయండి.

25, డిసెంబర్ 2015, శుక్రవారం

ఆహ్వానం!


ఈ శతావధానానికి పృచ్ఛకులు కావాలని, వచ్చినవారికి ఆ నాలుగు రోజులు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఆసక్తి కలవారు డా. నలవోలు నరసింహా రెడ్డి గారిని (ఫోన్. 9848898515, 9133072535) సంప్రదించండి. 

సమస్య – 1895 (క్రీస్తు జన్మించె…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.
ఈ సమస్యను పంపిన శశికాంత్ మల్లప్ప గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 1128

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24, డిసెంబర్ 2015, గురువారం

సమస్య – 1894 (కుక్కవొ నక్కవో పులివొ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో. 

పద్యరచన - 1127

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి. 

23, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య – 1893 (శివధనుర్భంగ మొనరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు.

పద్యరచన - 1126

కవిమిత్రులారా,
“ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు....”
ఇది మనుచరిత్రలోని ప్రసిద్ధపద్యానికి ప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ వరూధినీ ప్రవరులను ప్రస్తావించకుండా పద్యాన్ని వ్రాయండి. 

22, డిసెంబర్ 2015, మంగళవారం

ఛందస్సు నేర్చుకుందాం - 1

ఛందస్సు - పాఠం 1

పద్యాలు వ్రాయాలనే ఉత్సాహం ఉండి, క్రొత్తగా ఛందస్సు నేర్చుకొనడానికి ప్రయత్నించే వారికోసం ఈ పాఠాలు. క్లిష్టమైన ఛందస్సూత్రాల లోతుల్లోకి వెళ్ళకుండా సులభంగా అందరూ అర్థం చేసుకొనే విధంగా ఈ పాఠాలు రూపొందుతున్నాయి. ఇవి పండితులకోసం కాక ఔత్సాహికులకోసం నిర్దేశింపబడ్డాయి. ఈ పాఠాల ఆధారంగా  అభ్యాసం చేసి పద్యాలను వ్రాయడానికి ప్రయత్నించవచ్చు. ఏమైనా సందేహాలు కలిగితే నిరభ్యంతరంగా ప్రశ్నించి నివృత్తి చేసికొనవచ్చు.  ఇక మొదలు పెడదామా?
పద్యాల లక్షణాలను తెలిపే శాస్త్రం ఛందస్సు. సాధారంగా ఛందస్సును వ్యాకరణంలో ఒక అంశంగా  పాఠశాలల్లో చెప్తూ ఉంటారు. కాని వ్యాకరణశాస్త్రం, ఛందశ్శాస్త్రం, అలంకారశాస్త్రం ఒకదానికొకటి సంబంధం లేక దేనికదే ప్రత్యేకమైనది.
ఏదైనా ఒక విషయాన్ని ఒక పేరాగ్రాఫ్లో చెప్పాలనుకోండి. ఒక పేరా కొన్ని వాక్యాలతో ఏర్పడుతుంది. ఒక వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి . అలాగే ఒక పద్యం తయారుకావాలంటే కొన్ని పాదాలు (లైన్లు) కావాలి. ఒక పాదం (వాక్యంలో పదాల వంటి) కొన్ని గణాలతో  ఏర్పడుతుంది. గణాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి.  పదాలు ఒక అక్షరంతో (రా, లే, తే, పో మొ.వి), రెండక్షరాలతో (పండు, ఇల్లు, దేవి, భక్తి మొ.వి.), మూడక్షరాలతో (పలక, కడవ, చుట్టము, పద్యము, ఛందస్సు మొ.వి.), నాలుగక్షరాలతో (తలగడ, శునకము, పవనము మొ.వి) ఏర్పడినట్లే గణాలు కూడా ఒకటి, రెండు, మూడు, నాలుగు అక్షరాలతో ఏర్పడతాయి. వీటికి ప్రత్యేకంగా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. (ఈ గణాల గురించి రెండవ పాఠంలో తెలుసుకుందాం).
వ్యాకరణంలో అక్షరాలు అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని మూడు విధాలు. ఉచ్చారణను బట్టి దంత్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు మొదలైన భేదాలూ ఉన్నాయి. కాని ఛందస్సులో అక్షరాలు మొత్తం లఘువులు, గురువులు అని రెండే విధాలు.
లఘువులు :-
ఒక మాత్రాకాలంలో పలుకబడే అక్షరాలు లఘువులు. చిటిక వేస్తే ఆ శబ్దం వినిపించిన కాలాన్ని మాత్రాకాలం అంటారు. లఘువుకు చిహ్నం I.
1) అ-ఇ-ఉ-ఋ-ఎ-ఒ అనే హ్రస్వాలైన అచ్చులు లఘువులు.
2) పై అచ్చులతో కూడిన హల్లులు లఘువులు. ఉదా|| , ఖి,గు,తృ,దె,పొ మొ.వి. కొందరు పొరపాటున ఖ, , , , , , , , , భ మొదలైన మహాప్రాణాలను గురువులుగా భ్రమిస్తారు. కాని ఇవి లఘువులే.
3) క్క, గ్గి, చ్చు, ట్టె, ప్పొ మొదలైన ద్విత్వాక్షరాలు, క్ర, క్ష్మి, చ్యు, స్ఫు మొదలైన సంయుక్తాక్షరాలు లఘువులే.
గురువులు :-
రెండు మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలు గురువులు. గురువుకు చిహ్నం U.
1) ఆ-ఈ-ఊ-ౠ-ఏ-ఐ-ఓ-ఔ అనే దీర్ఘాలైన అచ్చులు గురువులు.
2) పై అచ్చులతో కూడిన హల్లులు గురువులు. ఉదా|| కా, గీ, చూ, తౄ, దే, నై, పో, భౌ మొ.వి.
3) అనుస్వారం (సున్నా)తో కూడిన అక్షరాలు గురువులు. ఉదా|| అం, కిం, చుం, బృం మొ.వి. (ఇక్కడ లఘువు. కాని సున్నా వచ్చి చేరినప్పుడు అంఒకే అక్షరంగా లెక్కింపబడుతుంది. దానిని పలుకడానికి రెండు మాత్రల కాలం పడుతుంది. కనుక అది గురువయింది.)
4) విసర్గతో కూడిన అక్షరాలు గురువులు. ఉదా|| మః, రిః, తుః మొ.వి.  (ఇక్కడ లఘువు. కాని విసర్గ వచ్చి చేరినప్పుడు మఃఒకే అక్షరంగా లెక్కింపబడుతుంది. దానిని పలుకడానికి రెండు మాత్రల కాలం పడుతుంది. కనుక అది గురువయింది.)
గమనిక :- తెలుగులో ప్రత్యేకంగా అరసున్నా ఉంది. ఇది కేవలం కంటికి కనబడుతుందే కాని పలుకబడదు, చెవికి వినిపించదు. అది ఉన్న అక్షరాన్ని పలుకడానికి ఎక్కువ కాలం అక్కరలేదు. కనుక అది ఉన్న హ్రస్వాక్షరం లఘువే. ఉదా|| అఁట (ఈ పదాన్ని పలుకడానికి మనకు కేవలం రెండు మాత్రల కాలమే పడుతుంది. కనుక ఆ రెండక్షరాలు లఘువులే). రాముఁడులో ముఁ’, ఇఁకలో ఇఁమొదలైనవి లఘువులే.
5) పొల్లు అక్షరాలతో కూడిన అక్షరాలు గురువులు.  అచ్చు కలవని కేవల హల్లులు పొల్లు అక్షరాలు.  (క్, గ్, చ్ మొదలైనవి పొల్లులు. ఇవి అనే అచ్చు చేరినప్పుడు క, , చ అనీ, ‘అనే అచ్చు చేరినప్పుడు కి,గి,చి అని అనే అచ్చు చేరినపుడు కే,గే,చే అనీ రూపాంతరం చెందుతాయి. )  దిక్అన్నపుడు దిలఘువు. దీనికి క్అనే పొల్లు అక్షరం వచ్చిచేరినపుడు దిక్అని ఒకే అక్షరంగా లెక్కించాలి. దీనిని పలుకడానికి రెండు మాత్రల కాలం పడుతుంది. కనుక ఇది గురువు. ఉదా|| బగ్, అచ్, బజ్, షట్, గుడ్, సత్, విద్, నన్, అప్, సబ్, నమ్, నిర్, బిల్, బస్ మొ.వి. గురువులు.
6) ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలుగురువులు. ఒక హల్లుకు అదే హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది ద్విత్వాక్షరం. క్క, గ్గి, చ్చు, జ్జె మొ.వి. ద్విత్వాక్షరాలు. చుక్క, అగ్గి, చిచ్చు, గజ్జె మొదలైన పదాలను మనం చుక్-క, అగ్-గి, చిచ్-చు, గజ్-జె అని పలుకుతాము. పొల్లు అక్షరాలతో కూడిన అక్షరాలు గురువులని తెలుసుకున్నాం కదా! దానివల్ల  చుక్, అగ్, చిచ్, గజ్ గురువులౌతాయి. ఆ విధంగా చుక్కఅగ్గి, చిచ్చు, గజ్జె పదాలలో ముందున్న చు, , చి, గ అక్షరాలు గురువులవుతాయి.
7) సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఒక హల్లుకు మరొక హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది సంయుక్తాక్షరం.  చక్రిలో క్రిసంయుక్తాక్షరం. ఈ పదాన్ని మనం చక్-రి అన్న విధంగా పలుకుతాము. పొల్లు అక్షరం కారణంగా చక్గురువవుతుంది. కనుక చక్రిలోని గురువు. అలాగే అగ్ని, సత్య, విద్య, శిల్పి, కర్మ, హర్ష మొదలైన పదాలలో ముందున్న అక్షరాలు గురువులు.  అక్షరమాలలోని క్షసంయుక్తాక్షరమే. కనుక పక్షిఅన్నపుడు గురువే. కొందరు కృ, మృ మొదలైన ఋత్వం ఉన్న అక్షరాలను సంయుక్తాక్షరాలుగా పొరబడి దాని ముందున్న అక్షరాన్ని గురువుగా భావిస్తారు. కాని ఋత్వం హల్లు కాదు, అచ్చు. క్+అ=క అయినట్లు క్+ఋ=కృ అవుతుంది. కనుక వికృతి, అమృతముమొదలైన చోట్ల వి, అ గురువులు కావు.
గమనిక :- అతఁడు త్యాగమూర్తిఅన్నచోట త్యాఅనే సంయుక్తాక్షరం ముందున్న డుగురువు కాదు. ఎందుకంటే అతఁడు అనేది తెలుగు పదం.  దాని తర్వాత ఉన్న త్యాఅనే అక్షరం డుపైన ఒత్తిడి తీసుకురాదు. అతఁడుత్-యాగమూర్తి అని పలుకము. కేవలం ఊనిక లేకుండా అతఁడు-త్యాగమూర్తి అంటాం. కనుక డులఘువే. తెలుగు పదాల తర్వాత సంయుక్తాక్షరం ఉన్నా ఆ తెలుగు పదం చివరి అక్షరం గురువు కాదని గమనించండి.  సూర్యజ్యోతిఅన్నపుడు సూర్య, జ్యోతి అనే రెండు పదాలు సమాసంగా ఏర్పడం వల్ల ర్యగురువు. సూర్యుని జ్యోతిఅన్నపుడు సూర్యునిఅనేది తెలుగు పదమయింది. కనుక అక్కడి నిగురువు కాదు.

గురు లఘువులను గుర్తిద్దాం.....
1) కమల (III) - అన్ని అక్షరాలు అనే హ్రస్వాచ్చుతో కూడినందున అన్నీ లఘువులే.
2) చిలుకలకొలికి (IIIIIII) - అన్ని అక్షరాలు హ్రస్వాచ్చులతో కూడి ఉన్నందున లఘువులే.
3) ద్యుతి (II) - ద్యు అనేది సంయుక్తాక్షరమైనా అది అనే హ్రస్వాచ్చుతో కూడి ఉన్నందున లఘువే.
4) రామా (UU) -  అన్ని అక్షరాలు అనే దీర్ఘాచ్చుతో కూడినందున అన్నీ గురువులే.
5) కావేరీ (UUU) - అన్ని అక్షరాలు దీర్ఘాచ్చులతో కూడినందున అన్నీ గురువులే.
6) శంకర (UII) - సున్నాతో కూడిన శంగురువు. మిగిలినవి లఘువులు.
7) హరిః (IU) - విసర్గతో కూడిన రిఃగురువు. హ లఘువు.
8) అతఁ డనె నఁట (II II II) - , న అక్షరాల తర్వాత అరసున్నా ఉన్నా అవి పలుకబడేవి కావు కనుక అవి ఉన్న అక్షరాలు లఘువులే.
9) వానల్ గురిసెన్ (UU IIU) - నల్, సెన్ పొల్లు అక్షరాలతో కూడినందున గురువులు.
10) ముద్దు పెట్టుకొమ్ము (UI UIUI) - ద్దు,ట్టు,మ్ము ద్విత్వాక్షరాలు కనుక వాటి ముందున్నవి గురువులు.
11) విద్యాలక్ష్మి (UUUI) - ద్యా,క్ష్మి సంయుక్తాక్షరాలు కనుక వాటి ముందున్నవి గురువులు.
12) రాజద్రోహము (UUUII) - రెండు సంస్కృతపదాల సమాసం కనుక ద్రోకు ముందున్న గురువు.
13) రాజుకు ద్రోహము (UII UII) - ‘రాజుకుఅన్నది తెలుగుపదం కనుక కులఘువే.

కొన్ని పద్యాల గురులఘువులను గుర్తిద్దాం....
1) అల్పుఁ డెపుడు పల్కు నాడంబరముగాను
     U I     I  I   I   U I     U U  I  I  I  U  I
   సజ్జనుండు పల్కు చల్లగాను
   U I U    I    U I    U IU I
   కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
   U  I    U   I U  I   I I U   I   U  I  U
   విశ్వదాభిరామ వినుర వేమ.
   U I  U  IU  I    I  I  I  U I
2) కమలములు నీటఁ బాసిన
    I  I  I   I   I   U I   U  I  I
   కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
    I I  U  I  I  U I   U  I  I I   I I   U  U
  తమతమ నెలవులు దప్పిన
   I  I  I  I    I I  I   I   U I  I
 తమ మిత్రులె శత్రు లగుట తథ్యము సుమతీ.

  I I    U  I  I   U I   I  I  I  U I   I      I   I U

సమస్య – 1892 (మారజనకుఁ డతఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మారజనకుఁ డతఁడె మారవైరి.

పద్యరచన - 1125

కవిమిత్రులారా,
పైచిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, డిసెంబర్ 2015, సోమవారం

సమస్య – 1891 (దైవముఁ గొల్వరా దనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
(‘సమస్యాపూరణము’ సమూహంలో సూలూరి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలతో...)

20, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య – 1890 (అర్వాచీనమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

19, డిసెంబర్ 2015, శనివారం

‘ఆంధ్రామృతం’ బ్లాగులో వ్యాకరణ పాఠాలు…

శ్రీ చింతా రామకృష్ణారావు గారి ఆంధ్రామృతంబ్లాగులో సంస్కృత, తెలుగు సంధుల గురించి వివరంగా వీడియో పాఠాలను అందిస్తున్నారు. ఔత్సాహిక కవిమిత్రులకు ఆ పాఠాలు ఎంతో ఉపయుక్తం. ఆ పాఠాలను పరిశీలించి, సాధారణంగా మనం చేస్తున్న నుగాగమ, యడాగమ, ద్రుత సంధిదోషాలను పరిహరించుకోవచ్చు. తప్పక చూడండి.

ఈ పాఠాలను అందిస్తున్న చింతా వారికి ధన్యవాదాలు తెల్పుకుందాం.
క్రింది లింకును క్లిక్ చేయండి.....

సమస్య – 1889 (అమ్మా రమ్మని పిల్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
(‘సమస్యాపూరణముసమూహంనుండి కవిమిత్రునకు ధన్యవాదాలతో...)

18, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య – 1888 (ధనము నమ్మి…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనము నమ్మి ధనము దార కొసఁగె.
(ఈ సమస్యను సూచించిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

17, డిసెంబర్ 2015, గురువారం

సమస్య - 1887 (చేఁదు తీయ నగుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

(ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

16, డిసెంబర్ 2015, బుధవారం

ఆహ్వానం!

ఆహ్వానము
"కోమల సాహితీవల్లభ"
శ్రీ కోడూరి ప్రభాకరరెడ్డి సాహితీపీఠం- ప్రొద్దుటూరు.
తే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు(మియాపూర్)నందు
ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె కు
2015 సంవత్సరమున చేయుచున్న సాహితీపురస్కార కార్యక్రమమునకు 
సాహితీ ప్రియులైన మీ అందరినీ 
సాదరంగా అహ్వానిస్తోంది.
కార్యక్రమ వివరములు.
సాయంత్రంగం.4.00లకు జ్యోతి ప్రజ్వలనము.
తదనంతరము
వేదికనలంకరించువారు.
సభాధ్యక్షులు-ప్రముఖ పదబంధ రామాయణకవి శ్రీ విహారి .
ముఖ్య అతిథిశ్రీ ఎల్లూరి శివారెడ్డి .ఉపకులపతి - తెలుగు విశ్వవిద్యాలయము.
పురస్కృతుని పరిచయం చేయువారు. డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. అనకాపల్లి.
పురస్కార గ్రహీత. ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె .
ఆత్మీయ అతిథులుశ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి.   శ్రీ వై.విశ్వేశ్వర రెడ్డి.
ప్రశంసాపత్ర సమర్పకులుశ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి .
తదనంతరము
ప్రార్థన
వక్తల ఉపన్యాసములు.
సాహితీ పురస్కారము.
ధన్యవాదములు. 
మంగళ గీతాలాపనము.
వివరముల కొఱకు 
సంప్రదించవలసిన దూరవాణి సంఖ్య 9177945559
ఇట్లు
అధ్యక్షుఁడు. కోడూరి ప్రభాకరరెడ్డి
కార్యదర్శి. శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి.
(కార్యక్రమానంతరము అల్పాహారము)

సమస్య - 1886 (పామునుఁ దినఁ గోరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.
ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య...

15, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య - 1885 (అవధానమ్ముల నుండరా దనె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
అవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.

14, డిసెంబర్ 2015, సోమవారం

సమస్య - 1884 (రామచంద్రుని రక్షించు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
రామచంద్రుని రక్షించు రావణుండు.

13, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య - 1883 (కొట్టెడు పతి సుజనుఁ డనుచు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,
నాన్నగారి అస్థికలను త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేయడానికి కాళేశ్వరం వెళ్తున్నాను. అందువల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి పరిస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.