28, డిసెంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1131

కవిమిత్రులారా,
“దినదినము గండ మాయెను...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

62 కామెంట్‌లు:

 1. దినదినము గండమాయెను
  మినుముట్టెను ధరలు, పెరిగె మిత్తి ఋణమునన్
  కనుచూపుమేర సుఖజీ
  వనమార్గము తోఁచదయ్యొ బ్రతుకుట యెటులో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దండకారణ్యంలో రాక్షసుల బాధలు పడలేని మునులు రామునకు మొరపెట్టుట.....

   దినదినము గండ మాయెను
   కనికరమే లేక దనుజగణములు మునిజీ
   వనవిధ్వంసముఁ జేతురు
   వనజనయన రాక్షసులను బరిమార్చు మిఁకన్.

   తొలగించండి
 2. దినదినము గండ మాయెను
  నిను సముదాయించ లేక నెచ్చెలి నాకున్
  వినవేలనె నామాటను
  మనమునననుమానమింత మంచిది కాదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

   తొలగించండి
 3. దినదినము గండమాయెను
  మనుజులలో మానవతయె మరుగున పడియెన్
  మనసున పెరిగిన స్వార్థము
  అనునిత్యము సాటిమనిషి యంతము గోరెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘స్వార్థ|మ్మనునిత్యము’ అనండి.

   తొలగించండి
 4. “దినదినము గండ మాయెను దిరుగ బయట
  స్త్రీల మెడనున్న చైనుల చిత్రముగను
  తెంపుకొని పోవు దొంగల తెగలు పెరిగె
  పైడి గొలుసులు మెడపైన వలదు వేయ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ తేటగీతి బాగున్నది. అభినందనలు.
   ‘చైనులు’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు. ‘స్త్రీల మెడ నాభరణముల చిత్రముగను’ అనవచ్చు కదా!

   తొలగించండి
 5. “దినదినము గండ మాయెను దిరుగ బయట
  స్త్రీల మెడనున్న చైనుల చిత్రముగను
  తెంపుకొని పోవు దొంగల తెగలు పెరిగె
  పైడి గొలుసులు మెడపైన వలదు వేయ.

  రిప్లయితొలగించండి
 6. మాస్టరు గారూ మీ పూరణలు చాలా బాగున్నవి.మంచి పద్య ములు వ్రాసిన కవి మిత్రులకు అభినందనలు.


  దినదినము గండమాయెను
  వనరులు కరవాయె చూడ వానలు లేవే
  కనగాను చీడ పీడలు
  వినవా మా రైతు బాధ హే ! విశ్వేశా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   ధన్యవాదాలు.
   రైతుల దినదిన గండాలను ప్రస్తావించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అన్నట్టు... చివరిపాదంలో యతి తప్పింది. “వినవా మా రైతు బాధ విశ్వేశ! హరా!” అందామా?

   తొలగించండి
 7. దినదినము గండ మాయెను జనులబ్రతుకు
  సహనమనునది గానరాదహము దప్ప
  ప్రజల గోడేల పట్టును పాలకులకు
  దేవుడారమ్ము దీనుల బ్రోవ వేగ !!!

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి పద్య రచన లో నా వివరణమామోదయోగ్యమేనా లేక వేరేమైన దోషమున్నదో తెలుప గోర్తాను. వివరణ తిరిగి యీ క్రింద వ్రాసాను.
  “గౌరవ మొప్పగ ప్రభుత్వమిచ్చెనొ, కనుడు (చూడుడు) శునకమును ” అని నా భావము.
  ధీరత్వంబున శునకము
  పౌరగమన నియమ సుపరిపాలన నియతిం
  గోరిన ప్రభుత్వ మిచ్చెనొ
  గౌరువ మొప్పగ గనుండు గ్రామహరీశున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   నిన్న మీకు సమాధానం ‘లేఖిని’లో టైప్ చేసాను. కాపీ, పేస్ట్ చేయడం మరిచిపోయి, సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను.
   అది ‘కనుండు’ అన్న విషయాన్ని గమనించకుండా వ్యాఖ్యానించాను. మన్నించండి. మీ పద్యం నిర్దోషం. ‘గౌరవ మొప్పగఁ గనుండు...’ అంటే సందేహానికి ఆస్కారం ఉండక పోయేదు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అర్ధానుస్వారము పెట్టడము మరచిపోయాను. ఇప్పుడుంచుతాను.

   తొలగించండి
 9. “దినదినము గండ మాయెను దిరుగ బయట
  స్త్రీల మెడనున్నహారముల్ చిత్రముగను
  తెంపుకొని పోవు దొంగల తెగలు పెరిగె
  పైడి గొలుసులు మెడపైన వలదు వేయ.

  గురువుగారు నమస్కారములు
  ఈ మధ్య అనేకసార్లు చైను దొంగలు ఎక్కువైనారని వింటున్నాము
  కాబట్టి చైను అన్నాను. దొంగలు చైన్లే లాకొంటున్నారు. ఆభరణములు అంటే అవి ఏవైన కావచ్చుగదా. అందుకే హారముల్ అని సరిదిద్దినాను.  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
   అయినా మెడలోని ఆభరణాలంటే చైన్లే కదా! ఒక్కొక్క స్థానంలో ఉండే ఆభరణానికి ఒక్కొక్క పేరు.

   తొలగించండి
 10. దినదినము గండమాయెను
  వినువారలు లేరు గోడు, విధివంచితులై
  తనువులు వీడిరి చివరకు
  కనుమరుగైపోవనీరు కర్షకమాన్యుల్ !!!

  రిప్లయితొలగించండి
 11. దినదినముగండమాయెను
  తినవెప్పుడు భోజనంబు తేజా! నీవు
  న్దినిపించుట నే నేరను
  వినవమ్మా నాదు మాట వీనులు సోకన్

  రిప్లయితొలగించండి
 12. 1.దినదినము గండమాయెను
  ననుమానపు భర్తతోడ యాతన పెరిగెన్
  వినుమా దేవా నామొర
  కనికరమును జూపినన్ను కావుము కృష్ణా.
  2.దినదినము గండ మాయెను ద్రిమ్మరిగను
  దిరుగ లేనిక మార్గము తిరము గాను
  జూపుమయ్య నారాయణ జోతలిడుదు
  సరుగునననుబ్రోవగరార సరసిజాక్ష.
  3.దినదిన గండమాయెను
  ఎనలేని వెతలె మిగిలెను యెటు కాలిడినన్
  తనవారికుక్షి నింపగ
  ఘనమయ్యెను ధరలు జూడ గగనంబంటెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   మూడవపద్యంలో ‘దినదినము’లో టైపాటువల్ల ము లోపించింది. ‘మిగిలెను+ఎటు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మిగిలెర యెటు’ అనండి.

   తొలగించండి
 13. దినదినము గండమాయెను
  అణుబాంబుల మ్రోతలెన్నొ యవనిన పెరుగన్
  మనుజుల ప్రాణము లవిసెను
  పెనురక్కసి యుగ్రవాద భీకర లీలన్

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. దినదినము గండ మాయెను
   జనమేజయ గురునికి ముని శాప భయమున
   న్ననిశము శుక యోగీంద్రా
   ననోద్ధితము హరికధా నినద పరితుష్టున్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 15. పద్య రచన
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  దినదినము గ౦డ మాయెను

  మనగా | వేది౦తు రత్తమామలు కట్న౦

  బును తెమ్మనుచు | మగడు త్రా

  గును | నరక౦ బాడ బ్రతుకు కుదరక యున్నన్

  ------------------------------------------------


  దినదినము గ౦డ మాయెను

  మనగా | గమని౦చ దత్తమామల. | స౦పా

  దన బట్టి పోదు | కలనై

  నను మాట వినదు | గ యా ళి నరకము చూపున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 16. దినదినము గండ మాయెను
  మన బ్లాగున రోజు కొక్క సమస్యను ప్రకటిం
  చు నియమమును పాటించుట;
  ఘనులార సమస్యల నొసఁగంగవలె నిఁకన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిజముగ పెక్కులు చిక్కులు
   భజనాదులఁ గోపగించు పరమాత్ముండున్
   కుజనులు సుజనులె సుమ్మీ
   విజయుండా మీనభేద విఫలుండయ్యెన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   పద్యం బాగుంది. కాని ఇక్కడ పెట్టడంలోని ఉద్దేశం బోధపడలేదు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “మన బ్లాగున రోజుకొక సమస్యను ప్రకటిం“ అనాలేమొ గద.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరడిగారుకద సమస్యలనొసగమని. మీమాటనెలా కాదనగలము? అందుకే మూడు సమస్యలను పొందుపరచితిని.

   తొలగించండి
  5. సహదేవుడు గారూ,
   నిజమే. అది పొరపాటే! ధన్యవాదాలు.

   తొలగించండి
  6. కామేశ్వర రావు గారూ,
   అలా అని సందేహం కలిగింది కూడా! ధన్యవాదాలు.
   మొదటిపాదంలో సమస్య లేదు. రెండవపాదంలోని సమస్య బాగుంది. మూడవపాదాన్ని సమస్యగా ఇవ్వలేము కదా! ఇచ్చినా పాదగోపనం క్రింద ఇవ్వవలసి వస్తుంది.
   నాల్గవపాదంలోని సమస్యను గతంలో మీరు పంపినట్లున్నారు. నేను సేవ్ చేసి పట్టుకున్నట్లు గుర్తు.
   దయతో మరికొన్ని సమస్యలను సిద్ధం చేసి పంపించవలసిందిగా మనవి.

   తొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవును ఇచ్చాను, మీరు బాగుంది యని అన్నారు. సమస్యలు స్ఫురించినపుడెల్ల పంపగలను.

   తొలగించండి
 17. దినదినము గండమాయెను
  వనవాసమ్మైన పిదప పాండవ కొమరు
  ల్లునికిన్నజ్ఙాతమున న
  వనిన్ జనములెరుగ కుండు వంతున గడుపన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘పాండవకొమరుల్’ అనడం దుష్ట సమాసం. ‘పాండవు లజ్ఞా|తనివాసులుగా నుండ న|వనిన్...’ అందామా?

   తొలగించండి
  2. ‘పాండవు లజ్జా|త...’ టైపాటువల్ల ‘పాండవ’ అయింది.

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు.పద్యాన్ని సవరించానండి.

   తొలగించండి
  4. దినదినము గండమాయెను
   వనవాసమ్మైన పిదప పాండవు లజ్ఙా
   త నివాసులుగా నుండ న
   వనిన్ జనములెరుగ కుండు వంతున గడుపన్!

   తొలగించండి
  5. సహదేవుడు గారూ,
   ‘అజ్ఞాత’ టైపాటు వల్ల ‘అజ్ఙాత’ అయింది.

   తొలగించండి
  6. గురువుగారూ! నా చరవాణిలో మీరన్న తెలుగుఫాంట్ లేక పోవటం వల్ల అలావ్రాయవలసివచ్చింది. మీ సూచనలోని పదాన్ని కాపీ చేసి సవరిస్తాను.ధన్యవాదములు.

   దినదినము గండమాయెను
   వనవాసమ్మైన పిదప పాండవు లజ్ఞా
   త నివాసులుగా నుండ న
   వనిన్ జనములెరుగ కుండు వంతున గడుపన్!

   తొలగించండి
  7. గురువుగారూ! నా చరవాణిలో మీరన్న తెలుగుఫాంట్ లేక పోవటం వల్ల అలావ్రాయవలసివచ్చింది. మీ సూచనలోని పదాన్ని కాపీ చేసి సవరిస్తాను.ధన్యవాదములు.

   దినదినము గండమాయెను
   వనవాసమ్మైన పిదప పాండవు లజ్ఞా
   త నివాసులుగా నుండ న
   వనిన్ జనములెరుగ కుండు వంతున గడుపన్!

   తొలగించండి
 18. . దినదినము గండమాయెను
  మనుగడకై నప్పుజేయ?మాయగ బెంచే
  పనితనమగు కాల్ మణియే
  తనపాలిట శాపమయ్యుతరచుగ బెరుగన్|
  2.దినదినము గండ మాయెను
  పనిమనిషిగభార్యజేర?వరకట్నము కై
  అనవరతము వేదింపులు
  ధన దాహపు నత్తమామ దౌర్జన్యముతో
  3.దినదినము గండమాయెను
  ఘనమగు తనబాల్య మంత కడుపాకలికై
  తినగూడని తిట్లుదినుచు
  అనవరతము తిండిలేక ఆశగ బ్రతుకన్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వరకట్నముకై’ అనరాదు. ‘వరకట్నమునకై’ అనడం సాధువు.

   తొలగించండి
 19. దినదినము గండమాయెను
  ఘనమగు రైతుల బ్రతుకులు కలికాలములో
  తనవారిమేలుకొరకై
  మననేతలు దోచుచుండ మాన్య కృషి కులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 20. కృష్ణాష్టమి స్పెషల్! 👇

  దినదినము గండ మాయెను
  కనిపెట్టుట కష్ట మాయె ఘనునీ కన్నన్
  మనసార మన్ను తినుచును
  వినయముతో నోట జూపు విశ్వము నంతన్!

  రిప్లయితొలగించండి
 21. దినదినము గండ మాయెను
  కనులందున వత్తులిడుచు కానగ నాకున్
  తినుటకు కంచము లేకయె
  పనిమనిషి కొరకు మొరలిడి ప్రార్థన జేయన్

  రిప్లయితొలగించండి