23, డిసెంబర్ 2015, బుధవారం

పద్యరచన - 1126

కవిమిత్రులారా,
“ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు....”
ఇది మనుచరిత్రలోని ప్రసిద్ధపద్యానికి ప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ వరూధినీ ప్రవరులను ప్రస్తావించకుండా పద్యాన్ని వ్రాయండి. 

29 వ్యాఖ్యలు:

 1. ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు నాదుతాపమున్
  కాంతరొ! తీర్చవేల? దయ గల్గదె నాపయి? నెందుకింతగా
  పంతము? నీదు ప్రేమికుని వద్దకు చేరగ సిగ్గదేలనే!
  చెంతకుచేర రమ్మికను చిక్కదులే యవకాశమింతగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇంతలు గన్నులుండ దెరు వెవ్వరి వేడుదు వోయి, యుక్తితో
  నింతుల తోడమాటగలి పింపు నెపమ్మున జేరినావు నా
  చెంతన, వెళ్ళుమోయి ఘనశీలవతుల్ కదలాడు చోటునన్
  పొంతనలేనిమాటలవి బొంకులనిచ్చట మెచ్చరెవ్వరున్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రేమికుల సంభాషణ
  ఇంతలు గన్నులుండదెరువెవ్వరి వేడెదువేలనోయనన్?
  ఇంతటికళ్ళునన్ విడచి ఇంతిని జేరగ?గ్రుడ్డివాడ|నీ
  చెంతన చేయి బట్టుకొని జీవన తీరము జేర్చమన్న?నీ
  తంతు నెరింగితిన్.తనకు తాళిని గట్టిన దారిజూపెదన్
  2.ఇంతలు గన్నులుండ దెరువెవ్వరి వేడెదు చింత యేలనో?
  గంతలు లేవుగా తనకు కాంతను జూడ నుపాయమందు నా
  చెంతకువచ్చి నీనుడులు జేర్తువ?మీమగవారి బుద్దులే
  నంతముజేతుకావరమునందిన కోర్కెలు నాశనంబుకే.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్రత్యుత్తరాలు
  1. “వరూధినీ ప్రవరులను ప్రస్తావించకుండా” యీ నియమమును విస్మరించి చేసిన పూరణ:

   ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు బ్రాహ్మణోత్తమా
   వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
   సుంతయు భీతి సెందక విశుద్ధ మతిన్ హిమశైలకానలన్
   కాంతల నేకతంబ పలుకంగ నెపంబున గాక నేమనన్
   సవరించిన పూరణ:
   ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు నిర్భయంబుగన్
   వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
   సుంతయు భీతి సెందక విశుద్ధ చరిత్రుల పెద్దవారలన్
   పంతము బూని నిందలిడి ప్రాణము మీదికి దెచ్చుకొంటివే

   తొలగించు
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ (సవరించిన) పద్యం బాగున్నది. అభినందనలు.
   ముందు వ్రాసింది కూడా బాగుంది.

   తొలగించు
 5. ఇంతలు కన్నులుండ దెరువెవ్వరివేడెదు నాదుసోదరా!
  సుంతయులేద నీకుదెలివింతగ చింతనుబొందనెలనో?
  వింతగ నుండెనీయునికి సాంతమువీనుల విందుజేయుమా
  యంతయు నాకుదెలిపి హాయిగ నుండుము లేకదుఃఖముల్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం రెండవ మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించు
 7. ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు కళ్ళజోడుకై
  యింతిని దూలనాడితినదెంతయుపద్రవమయ్యె జూడుమా
  పంతముబూని తా జనెను బాధను బొందుచు బుట్టినింటికే
  వంతల పాలయెన్ బ్రతుకు వైరము గూడదు భార్యతో సుమా

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇంతలు కన్నులుండ దెరువెవ్వరి వేడెదు మోహనాంగ,నీ
  వింతుల బాసలన్ యెరుగవే దయసేయుము సేదదీరు మే
  కాంతము నుంటి వచ్చి నను కాముని బారిని గావు మన్న నో
  కాంతరొ "ఏడ్సుబాధితుడను,క్రమ్మర నీదయ, నాదు భాగ్యమున్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. “ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు దైర్యమున్ననీ
   చెంతనె సాగుచున్నపలు చీకటి మాటవి నీతి చేతలన్
   అంత మొనర్చలేవ? తగునట్టి ప్రతాపము చూపి మోడిజీ
   స్వాంతము లోనికోర్కెనతి సాహస మొప్పగ తీర్చుమిత్తరిన్.

   తొలగించు
  3. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు దీనబాంధవా
  గంతలు గట్టినాకనుల గన్పడ కుంటివి యేడనుంటివో
  సుంతనెరుంగనైతినయ సూత్రము బట్టుకు విశ్వమంతయున్
  బంతిగ జేసి నీవిటుల బాలుడ వైతివి దేమి వేడుకో!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఇంతలు కన్నులుండ తెరువె వ్వరి వేడెదు చాలు వేషముల్
  పొం తన లేని మాటలను బొంకుచునుంటివి మాటిమాటికిన్
  చెంతకు చేరబోకుమిక చిక్కులు దప్పవు వెంబడించినన్
  వింతగు వర్తనన్ వి డిచి బిట్టుగ నిచ్చట నుండి పొ మ్మికన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. నిన్నటి పద్యరచన:

  ఏడాదంతయు చిగురో!
  కాడకు పూతయొ! గనంగ కాయో! పండో!
  వేడుకఁ జేయగ 'చింతకు'
  చూడగ తను పుట్టినిల్లు సుకరమ్మెటులౌ?

  నేటి పద్యరచన:

  ఇంతలుఁ గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు? జాణవందురే!
  చింతలు వీడి కౌగిటను జిక్కిన దక్కును స్వర్గ సౌఖ్యముల్!
  చెంతకుఁ జేరగన్ లలన సిగ్గుల వీడుచు పొందగోరవే?
  పంతమదేలరా? తగనె? భామలఁ గూడని పేడివందునా?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు స్వర్గభూమికై?
  కొంతయు దుడ్డుచేకొనుచు కోరిక తీరగ మందుకొట్టి నీ
  సొంతది కారుగైకొనుచు షోకులు మీరగ సీటుబెల్టు నా
  కింతయు నిష్టముండదని క్రిందను మీదను చూడకుండ నే
  చింతయు లేకయే కులికి చిందుచు కొట్టుము మీడియన్ను ఢీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు రాహులుండ నీ
  గంతులు మానివేయుచును గంగను త్రోయుచు నీదు సిగ్గు నో
  యింతిని రోమునందుజని యింపుగ ముద్దిడి పెండ్లియాడి వే
  సంతును పొంది కాంగ్రెసున చట్టున జేర్చుము సంబరమ్మునన్

  ప్రత్యుత్తరంతొలగించు