29, డిసెంబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1132

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“చలి”

36 కామెంట్‌లు:

 1. భగభగ లాడెడు భాస్కరు
  ని గడ గడమని వణికించె నిజముగ చలియే
  జగమెల్లను దాసోహమె
  పగబూనినచలి పులియది బద్రము నరుడా!

  రిప్లయితొలగించండి
 2. వలచిన చెలిచెంత నుండిన
  చలినిను బాధించదు మరి సంతస మొందన్
  చిలుకల కొలికిని గాంచిన
  కలతలు మైమరచి మిగుల గాదిలి నెమ్మిన్
  -------------------------------------
  సుమములు విరియని కాలము
  హిమమది కురియంగ నిపుడు హేమంత మనన్
  ఖమణియె యలిగెను కావున
  ద్రుమములు రూపమును మార్చె దోస మటంచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యాలు (ముఖ్యంగా రెండవది) బాగున్నవి. అభినందనలు.
   మొదటిపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘వలచిన చెలి చెంతఁ గలుగ...’ అనండి.

   తొలగించండి
 3. చలిగా నున్నది ప్రేయసి
  గిలిగింతలు బెట్టబోకు గీరల తోడ
  న్నలుపుగ మారును దేహము
  లలనా! మరి చెప్పుచుంటి లాస్యంబేలా?

  రిప్లయితొలగించండి
 4. గడగడ వణికెను దేహము
  కడు చల్లగ కొయ్యబారె కరములు చలితో
  నడుగులు ముందుకు సాగక
  జడిపించుచు నుండె సీతు జగతిని రామా!!!

  రిప్లయితొలగించండి
 5. హేమంతము వచ్చెననుచు
  చేమంతులు దెల్పె నదివొ చెన్నుగ తోటన్
  ప్రేమము బెంచును మంటలె
  భాముని కిరణములు సోకి వసుధయె పొంగున్!!!

  రిప్లయితొలగించండి
 6. * గు రు మూ ర్తి ఆ చా రి *

  ఉహుహుహూ యనుచు వడకు నుర్వి జనము
  లెన్ని దుప్పటుల్ గప్పిన. నేమి ఫలము ?
  ప్రొద్దు బారె డెక్కిన లేవ బుద్ది గాక
  ప౦డుకొనిరి మ౦చములను వదలకు౦డ. |
  వెచ్చవెచ్చగ. -- ద౦పతుల్ వీడ కు౦డ
  గట్టిగా నొకరి నొకరు కప్పు కొనిరి ! !

  రిప్లయితొలగించండి
 7. నిజముగ కలిగెను మనసున
  గిజగిజ యను నొకయనుభవ కిలరవ మేదో
  గజగజ వణికితి చలిపులి
  భుజముల వలువలు చెదరగ వొదగగ జేసో

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. ఉత్తర దిక్కున నుహుహూ యనం జలి గాలులు వీచెను గాఢముగను
   రాత్రులన్ని బహు దీర్ఘంబయి తరిగెను బవలు లంబరమణి పాఱఁ జలికి
   శంభుని ఫాలమం దంభుధి గృహమేధి యిండ్లను త్రేతాగ్నులిరికె బెదరి
   సతుల త్రిమూర్తులు సంగతి వదలరాయే శీత లార్తిని నెంత నరులు

   వీధి వీధి వెలగె వెచ్చని మంటలు
   గుంపు గుంపులు జను లింపు గొలుప
   ముద్దుల మురిపెంపు ముచ్చట లాడుచు
   నంత కాగిరి చలి సంతసమున

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూరూ ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. చలిపులి పెట్టెడు బాధలు
  తెలియని వారెవ్వరనగ తెలిపెద వినుమా
  నులివెచ్చని దుప్పటిలో
  చెలికౌగిట బంధియైన చెలికాడొకడే,

  శీతల వాయువుల్ చెలగె చీకటి వేళన జృంభణమ్ముగా
  భూతల మెల్ల , పత్రములు భూరుహ శాఖల వీడె, మంచు ధా
  రాపతితమ్ముగా భువిని రాలుచు జీవుల పై ప్రతాపమున్
  జూపగ శక్తిహీనుడయి సూర్యుడు సైతము ఖిన్నుడాయెనే.

  రిప్లయితొలగించండి
 10. చలిక డుగి లిబెడుతుంటే
  వలరాయడు విరిశరముల బాధిస్తుంటే
  చె లి బిగి కౌగిలి కోరుచు
  విలవిల లాడెనుమ నస్సు విరహము తో డన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘పెడుతుంటే, బాధిస్తుంటే’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. నా సవరణ....
   చలి కడు గిలిపెట్టగ నా
   వలరాయడు విరిశరముల బాధింపంగన్...

   తొలగించండి
 11. చలిపులి చెంతన గిలిగిం
  తల చెలి కౌగిలినిజేర?తమనే వీడున్
  వలపుల తలపులు నిలచిన
  పలుకక,కలబడకవెళ్లు పరుగెత్తకనే
  2.హరిహర సుతునే గొలిచెడి
  పరివారము చెంత రాదు-పరికించంగా
  కురిసెడి మంచే ముంచిన
  కరములు పైకెత్తి మ్రొక్క కనరే చలి యున్.
  3.కష్టము జేయుచున్న “చలి”కౌగిలి జేరక వెళ్లిపోవు|సం
  తుష్టినిసాకువారలను తొందర బెట్టదు యేలనో గదా?
  నిష్టకు దూరముండు,నదినీటను మున్గెడి భక్త బృందమున్
  దృష్టిని మార్పు జేయకను దీక్షను బంచును వింతపంతమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె.ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ముఖ్యంగా మొదటిపద్యంలోని వృత్యనుప్రాస మనోహరంగా ఉంది.

   తొలగించండి

 12. వందనమ్ములు చలీ! వందనములు నీకు
  సంఘమ్మునకొక సంస్కారమొసఁగ
  ఆటపాటలవీడి యమ్మల జేరుచు
  చదువులఁ బిల్లలుఁ జదువు చుండ
  పెద్దలు సైతము బుద్ధిగా చేతుల
  ముడిచెడు వినయమ్ము మోదమొసఁగ
  పాశ్చాత్య పోకడల్ పాటించకుండగన్
  నిండైన వలువల నెలతలలర

  పెద్దలున్ బిల్లలున్ జేర పెందలకడ
  వేడి వేడిగ వంటలున్ విందు జేయ
  ఫ్యాన్లు యేసీలవి పొదుపు బాటపట్ట
  చలికి యరచేతులన్ మోడ్తు సాగిలఁబడి

  ( వాట్సప్ లో వచ్చిన ఓ మెసేజ్ ఆధారం)
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   విచిత్రం! మీరు వాట్సప్‍లో చూశారు. నేను ఫేస్‍బుక్‍లో చూశాను. మీ పద్యం చూడకముందు నేను వ్రాసి పోస్ట్ చేశాను. తీరా మీ పద్యం చదువుతుంటే ఇద్దరం ఒకే భావంతో వ్రాసినట్లు అర్థమైంది. నా పద్యాన్ని తీసేద్దామనుకున్నా... కాని (కొద్దిగా) కష్టపడి వ్రాసింది కదా... ఉండనిద్దాం అనుకున్నా.
   మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
   ‘ఫ్యాను లేసీ లవి...’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

   వందనమ్ములు చలీ! వందనములు నీకు
   సంఘమ్మునకొక సంస్కారమొసఁగ
   ఆటపాటలవీడి యమ్మల జేరుచు
   చదువులఁ బిల్లలుఁ జదువు చుండ
   పెద్దలు సైతము బుద్ధిగా చేతుల
   ముడిచెడు వినయమ్ము మోదమొసఁగ
   పాశ్చాత్య పోకడల్ పాటించకుండగన్
   నిండైన వలువల నెలతలలర

   పెద్దలున్ బిల్లలున్ జేర పెందలకడ
   వేడి వేడిగ వంటలున్ విందు జేయ
   ఫ్యాను లేసీలవి పొదుపు బాటపట్ట
   చలికి యరచేతులన్ మోడ్తు సాగిలఁబడి

   ( వాట్సప్ లో వచ్చిన ఓ మెసేజ్ ఆధారం)

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

   వందనమ్ములు చలీ! వందనములు నీకు
   సంఘమ్మునకొక సంస్కారమొసఁగ
   ఆటపాటలవీడి యమ్మల జేరుచు
   చదువులఁ బిల్లలుఁ జదువు చుండ
   పెద్దలు సైతము బుద్ధిగా చేతుల
   ముడిచెడు వినయమ్ము మోదమొసఁగ
   పాశ్చాత్య పోకడల్ పాటించకుండగన్
   నిండైన వలువల నెలతలలర

   పెద్దలున్ బిల్లలున్ జేర పెందలకడ
   వేడి వేడిగ వంటలున్ విందు జేయ
   ఫ్యాను లేసీలవి పొదుపు బాటపట్ట
   చలికి యరచేతులన్ మోడ్తు సాగిలఁబడి

   ( వాట్సప్ లో వచ్చిన ఓ మెసేజ్ ఆధారం)

   తొలగించండి
 13. రమ్ము కన్నా! చలి! రగ్గును కప్పెద
  .........నని బిడ్డ ప్రక్కలో నమ్మ ప్రేమ
  కార్యాలయమునకు కాలమౌచున్నది
  ........ముసుగు తీయుండను ముదిత పిలుపు
  సలి సంపుతున్నాది యెలిగించు కుంపటి
  .........గుడిసెలో ముసలయ్య గోడు మూల్గు
  చలిచలి! చెలియ! వెచ్చని కౌగి లిమ్మని
  .........ప్రియురాలి బ్రతిమాలు ప్రియుని తపన

  బాల వృద్ధాది భేదమ్ము పట్టబోదు
  పురుషు డాడుది యని మది కరుణ లేదు
  బీద పాట్లను ధనికుల భేషజముల
  సుంత దలుపదు చలిపులి కెంత పొగరు!
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పద్యం స్వభావోక్త్యలంకారంతో శోభిల్లుతూ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి


 14. హిమము కరిగి పోయె హేమంత మరుదెంచె
  ముసలి ముతకలంత ముడుచుకొనుచు
  చలికి తాళలేక విలవిల లాడగ
  కప్పుకొనిరి గాదె కంబళులను.
  2సూర్యుని కొరకెదురు చూచి మురిసె తమ్మి
  చలికి ముడుచుకొనియె కలువ యచట
  పాపలైన గాని పండు ముదుసలైన
  చలిపులికి భయ పడి చాటు దాగె.

  రిప్లయితొలగించండి
 15. పురుషు లెల్ల వినయపూర్వకమ్ముగఁ జేతు
  లను కట్టుకొనుచు నిలబడుచుంద్రు
  స్త్రీలెల్ల నిండుగా చెఱగు కప్పుకొనుచు
  నొంటిసొంపులఁ జూప నొల్లకుంద్రు
  చీకటి కాకుండఁ జేరి యింటికి వేఁడి
  భోజనంబును తినఁ బుద్ధి పుట్టు
  దారి ప్రక్కలఁ జేరి తరుణుల నెల్ల నే
  డ్పించు యువకులు కనుపించ రెచట

  ఫ్యాను లేసీలు వేయక పగలురేయి
  మేలుగాను విద్యుచ్ఛక్తి మిగులుచుండు
  నెల్ల జనులకు సంస్కార మెంతొ నేర్పు
  చలిచెలీ! నీకిదే నమస్కారశతము.

  (ఫేసుబుక్కులో ఒక మిత్రుడు పెట్టిన పోస్టు ఆధారంగా)

  రిప్లయితొలగించండి