27, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య – 1896 (ప్రద్యుమ్నుం డొకఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.

44 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘అందు|న్నాద్యుడు...’ అనండి.

   తొలగించండి
  2. విద్యాలయమున బాలుడు
   ప్రద్యుమ్నుండొకడు, పంచ పాండవులందు
   న్నా ద్యుడు కర్ణుం డనగను
   పాధ్యాయుడు ధర్మజుడని పాఠము జెప్పెన్


   తొలగించండి
 2. విద్యలు పలు, ప్రణయమునకు
  ప్రద్యుమ్నుండొకడు, పంచ పాండవులందున్
  మద్యముడగు పార్థుడు విలు
  విద్యకు,భీముండు మల్ల విద్యకు నిపుణుల్ !!!

  రిప్లయితొలగించండి
 3. విద్యా! పాండవ కులమున
  ప్రద్యుమ్నుండొకడు ,పంచపాండవులందు
  న్విద్యలలో నారితేరె
  ప్రద్యుమ్నుని తండ్రియైన పార్ధుడె సుమ్మా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   ప్రద్యుమ్నుని తండ్రి కృష్ణుడు కదా! మీరు పార్థుడన్నారు.
   మూడవపాదంలో ‘రితేరె’ అని బేసిగణంగా జగణం వేశారు.
   సవరించండి.

   తొలగించండి
  2. విద్యలనన్నిటినేర్చెను
   ప్రద్యుమ్నునిమామయైన పార్ఢుడె సుమ్మీ

   తొలగించండి
  3. సుబ్బారావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. వేద్యం బిది యెల్లరకుం
  బ్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందు
  న్నుద్యోతిత వీరుల నం
  దాద్యుండౌ మధ్యము సఖు తనయుడు సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. విద్యలు నేర్పగ నేర్చెను
  ప్రద్యుమ్నుండొకడు;పంచపాండవులందున్
  నాద్యుడు ధర్మజుడవనిన్
  హృద్యంబుగ నిరువురొక్క కృష్ణుని బంధుల్

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. ప్రద్యుమ్నుడు అనే పేరుగల నటుని పరంగా వ్రాసిన
   పద్యం.

   విద్యాధికుండు నాటక
   పద్యమ్ముల పాడ గల్గి ఫల్గుణ పాత్రన్
   హృద్యమ్ముగ మల్చెడు మా
   'ప్రద్యుమ్నుండొ'కఁడు పంచపాండవులందున్

   తొలగించండి
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. సద్యోజాతు నెదిర్చెను
  ప్రద్యుమ్నుడొక౦డు;పంచ పాండవులందున్
  విద్యోతించిన పార్ధుడు;
  ప్రద్యుమ్నుడు గూలె.శివుడు పార్ధుని మెచ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రద్యుమ్నుని మన్మధునిగాఅన్వయి౦చి
   సమస్యను పూరించితిని

   తొలగించండి
  2. ప్రద్యుమ్నుని మన్మధునిగాఅన్వయి౦చి
   సమస్యను పూరించితిని

   తొలగించండి
  3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. నేను కూడా సగస్రకవులు అనే బ్లాగ్ నడుపుతున్నాను
  వీలైతే చూడగలరు

  రిప్లయితొలగించండి
 9. నేను కూడా సగస్రకవులు అనే బ్లాగ్ నడుపుతున్నాను
  వీలైతే చూడగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణమోహన్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ బ్లాగు చూశాను. మీ సహస్రకవుల్లో ఛందోబద్ధంగా పద్యాలు వ్రాసిన వారుకూడ ఉండడం ఆనందాన్ని కలిగించింది.

   తొలగించండి
 10. విద్యార్థీ ! విను మా విలు
  విద్యను రాముడు విజయుడు, విన నకులుండే
  హృద్యమ్మగునందములో
  ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   నకులుణ్ణి మన్మథునితో పోల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. సద్యము అనగా తక్షణముగా ఏ విద్యా అబ్బదు, సాధన లేక అని ప్రద్యుమ్నుడు అనే వ్యక్తి చెబుతూ పంచపాండవులలో మధ్యముడైన అర్జునునికి విలు విద్య కూడా అధ్యవసానము అనగా ప్రయత్నము వల్లనే అలవడింది అని ఉదహరణగా చెప్తున్నాడు అనే భావనలో రాశాను. భావాన్నీ, పద్యాన్నీ కూడా పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
  కం:
  సద్యమునబ్బదుచదువనె
  ప్రద్యుమ్నుండొకడు;పంచపాండవులందున్
  మధ్యమునకువిలువిద్యయు
  అధ్యవసానమువలననెయలవడెజూడన్

  రిప్లయితొలగించండి
 12. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { కు౦తీ దేవికి తన చిన్న కుమారు డైన.
  .............................................

  నకులుని పై ప్రేమ ఎక్కువ. ప౦చపా౦డవులలో
  .....................................................

  నకులుడు ఒక మన్మధు డని మురిసి పోతూ
  ...............................................

  చెప్పు కొనేదట. ! ! }
  ...........................................................


  హృద్యాకారి నకులుడే

  ప్రద్యుమ్ను౦డొకడు , ప౦చపా౦డవు ల౦దున్

  చోద్య౦బు కాదట౦చు స

  ముద్యత్ప్రేమమున కు౦తి యుత్ప్రేక్షి౦చెన్
  ఉత్ప్రేక్షి౦చు = పోల్చి చెప్పు

  ( ప౦చపా౦డవులలో నకులుడే ఒక మన్మధు

  డని ఆమె భావనము }్

  రిప్లయితొలగించండి
 13. అద్యాపకుడొకనాడనె
  ప్రద్యుమ్నుండు పంచ పాండవు లందున్
  మధ్యముడన విద్యార్థులు
  అద్యాపక గైడు జూడ ?అచ్చైనదదే|

  రిప్లయితొలగించండి
 14. " విద్యున్మాల '' న్నొకడనె
  ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్
  పద్యము నందున గణయతి
  నాద్యంతము జూచు నొక్క డద్దిర యనియెన్

  రిప్లయితొలగించండి
 15. చోద్యమ్మాయెను వినగను
  ''ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్''
  హృద్యమగు భారత గ్రం
  ధాధ్యాత్మము గలుగువార లనరీ రీతిన్.
  అద్యాయనంబు

  రిప్లయితొలగించండి
 16. నిన్నటి దత్తపది:

  అసిఁబోయెను బెదరి తా
  మసి వేకరముల వెలుఁగ మర్కుడు దివిపై
  నుసిఁ బుట్టిన కమలములు వి
  కసితమగుచు జగతికినొక గమనము దెలుపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ (నిన్నటి సమస్యకు) పూరణ బాగుంది. అభినందనలు.
   మొదటి రెండు పాదాలలో గణదోషం. “అసిఁ బోయెను బెదరుచు తా|మసి వేకరముల వెలుంగ...’ అందామా?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   అసిఁబోయెను బెదరుచు తా
   మసి, వేకరముల వెలుంగ మర్కుడు దివిపై
   నుసిఁ బుట్టిన కమలములు వి
   కసితమగుచు జగతికినొక గమనము దెలుపన్

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   అసిఁబోయెను బెదరుచు తా
   మసి, వేకరముల వెలుంగ మర్కుడు దివిపై
   నుసిఁ బుట్టిన కమలములు వి
   కసితమగుచు జగతికినొక గమనము దెలుపన్

   తొలగించండి
 17. అధ్యూడుని కినుక సమసె
  ప్రద్యుమ్నుండొకఁడు, పంచ పాండవులందున్
  మధ్యముడే విజయుడు విలు
  విద్యను గురువైన ద్రోణు పేరిమి పొందెన్
  అధ్యూడుడుః శివుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ‘పేరిమి నొందెన్’ అనేది ‘ప్రేరణ నందెన్’ అంటే బాగుంటుందేమో?

   తొలగించండి