12, డిసెంబర్ 2015, శనివారం

సమస్య - 1882 (మిరియములకుఁ దీయఁదనము...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

32 కామెంట్‌లు:

  1. పొరబడి పలికిన చాలదు
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే
    కొరికిన దెలియును కారము
    గరళము కంటెను మెండు గళమును కోయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘గరళము కంటెను కటువయి గళమును కోయున్’ అనండి.

      తొలగించండి
    2. పొరబడి పలికిన చాలదు
      మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే
      కొరికిన దెలియును కారము
      గరళము కంటెను కటువయి గళమును కోయున్

      తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు...ముఖపుస్తకములో మీ పోస్టింగును చూసాను చాలా బాధేసింది. పితృవియోగ సంతాపములో నున్న సమయంలో అక్కరకురాని పరువుతీసే ఇలాంటి సంప్రదాయాలు మూఢాచారాలు ఇంకెంత కాలమో ....మూలిగే నక్కపై ....సామెతలా సాక్ష్యంలేని మోక్షం పేరుతో పబ్బం గడుపుకునే బద్దకస్తుల అరాచకాలకు అంతమెప్పుడో!

    మురిపముగ చెఱుకు తోటను
    విరివిగ నే పంట వేయ విడువదు తనజా
    తిరుచిని ఫలింప జేరదు
    మిరియము లకుదీయదనము మిరుపకు వలెనే

    రిప్లయితొలగించండి
  3. పెరిగెను విజ్ఞాన మనుచు
    పరిశోధన జేయనేమి ఫలితము భ్రమయే
    మిరియము లకు దీయదనము
    మిరుపకు వలెనే పొసగుట మిథ్యయె సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో సమస్యపాదాన్ని స్థానభ్రంశం చేసిన విధానం బాగుంది.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ధన్యవాదము లండీ! మీరు పెద్దలు ఆ సరస్వతీ మాత స్వరూపులు మీరు నన్ను మీరూ అనకూడదని మనవి.

      తొలగించండి
  5. దురదృష్టమేమొ! చీల్చిరి
    వరమగునని పాలక, ప్రతిపక్షము నాడున్
    నిరసననిడ సీమాంధ్రులు
    మిరియమునకుఁ దీయఁదనము మిరపకు వలెనే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సరి పానకమ్ము వోయుచు
    పెరడుననే ప్రేమతోడ పెంచిన గానీ
    మరి రుచి మారుచు నంటున
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

    రిప్లయితొలగించండి
  7. . వరమే కావరమై మై
    మరుపేసహకారమనుచు మనుగడ సాగే
    తరుణము నందనుకొనెనట
    మిరియములకు దీయ దనము మిరపకువలెనే
    2.కరుణయు గలిగిన వైద్యులు
    మరియాదను నిలుపుకొనెడి మంత్రులు,వరుడే
    వరకట్నమెంచ కున్నచొ
    మిరియాలకు దీయదనము మిరపకు వలెనే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సాగే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  8. మిరియము మిరపను రెంటిని
    నిరవుగ మరిపోత బోయ యిక్షుర సంబున్
    న్న రమరలు లేక యంటగ
    మిరియములకుదీయదనము మిరపకు వలెనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...బోయ నిక్షురసంబున్’ అనండి.

      తొలగించండి
  9. మురహరి పై భయభక్తులు
    కర మరుదు గన శిశుపాలు కలుషాత్మునకున్
    దురితు డగుట నలవడునే
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  10. చెఱకు రసమ్మున జేర్చిన
    సరి బెల్లపు పానకమున చక్కగ గలుపన్
    మరి యంటునె నించుకయిన
    మిరియములకు దీయదనము మిరపకు వలెనే!!!

    రిప్లయితొలగించండి
  11. పరుషములు బలుక కుండుట
    కరుణను జూపుటయు కష్ట కాలము నందున్
    దురితులకు నేర్ప వశమే
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.

    రిప్లయితొలగించండి
  12. గరగర మనియెడు గొంతుకు
    మిరియములకు దీయదనము మిరపకువలెనే
    పరిణామము జూపెననుచు
    పరిపరి విధముల దలచుచు వదలక గొంటిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (మీరు మాతృదేశానికి తిరిగివస్తున్నట్టు ఫేసుబుక్ ద్వారా తెలుసుకున్నాను. స్వాగతం!)

      తొలగించండి
  13. ధరపై కనజాల మెపుడు
    మిరియమునకు తీపిదనము, మిరపకువలెనే
    చురుకు మనిపించు నోటికి
    కరమగు రుచినిచ్చు వంట కమ్ముల లోనన్

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ఈనాటి పూరణలలో ఇది ఉత్తమమైనదిగా భావిస్తున్నాను. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. విరివిగ చక్కెర వాడుచు
    మురిపెమ్ముగ బెల్లమందు ముంచగ కడవన్
    నరవర! బెంగాలందున
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. తీయదనమంటే బెంగాల్ యాద్గారే మిష్టిదొయి రావాల్సిందే మరి :)



      జిలేబి

      తొలగించండి


  16. పిరియపు పలుకుల కు రవం
    త రుచికరపు కటు పలుకుల తరుణము గానన్
    పరచుచు పలుకన్ చేరును
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. తురుముచు సన్నని పొడిగా
    కరిగించుచు గరిటలోన కమ్మని సెగలో
    విరివిగ బెల్లము పోయగ
    మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే

    రిప్లయితొలగించండి