25, డిసెంబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1128

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. తల్లి యొడిలోన బాలుడు తనరె చూడు
    ఆతడే యేసుక్రీస్తుగ నవని పుట్టి
    మంచిమార్గము బోధించిమానవులకు
    సాటివారలయందున మేటియయ్యె

    రిప్లయితొలగించండి
  2. పశువుల కొట్టము లోపల
    శిశువొక్కడు పుట్టినాడు చిత్రము నాడే
    క్రిశుమసు పండుగ పేరున
    కుశలమ్మున జనులు జరుపు కుందురు నేడే.

    రిప్లయితొలగించండి
  3. దీన జనుల బ్రోచు మానవుండైతాను
    మరియ తనయు డగుచు మాన్యు డయ్యె
    నేసుక్రీస్తు పుట్టె నిలనుద్ధ రించగన్
    సుపథ మున్ దెలిపెను సుగుణశీలి

    రిప్లయితొలగించండి
  4. నమస్తే.నిన్నటి పూరణలను పరిశాలింప మనవి.

    రంగు లీను చున్న రమణీయతను జూడ
    అలరు చుండు మనము నవని యందు
    చూడచూడ దాని సొబగు హెచ్చుచు నుండు
    చిన్ని సీతకోక చిలుకయదియె

    నలువ సృష్ఠిలోని నయగారమునుగాంచ
    దాని హొయలు చూడ తమియు హెచ్చు.
    తాకినంత తనువు తల్లడిల్లచునుండు
    కమ్మనైన పులుగు కనుల విందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
  5. గొడ్లపాక యందు కూరిమి సుతుడుగ
    ముదిత మేరికపుడు పుట్టె క్రీస్తు
    లోకముద్ధరించు లోకపాలుడు పుట్టె
    ననుచు మురిసి రెల్ల రవని యందు.

    రిప్లయితొలగించండి
  6. అచిరద్యుతి సదృశామల
    రుచినిచయము కందర తటి లోలిత గతినిన్
    ప్రచరింప నేగి తారా
    నుచరులు గాంచిరట క్రీస్తు నుత్సాహముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *

    మరియ మాతకు సుతునివై ధరణి బుట్టి
    శా౦త సహనముల్ దాల్చిన సచ్ఛరిత్ర
    శిలువ యై నేర్పితి మనుజ విలువ లేవొ
    రక్తమును చి౦ది ప౦చితి రక్త మీవు

    ,[ రక్తము = అనురాగము ]

    రిప్లయితొలగించండి
  8. ఏసు,సువార్త బోధనలనెంచెడి సారముహర్షమివ్వగా
    దాసులు జేరిరచ్చట ప్రధాతయు దర్శన భాగ్యమెంచియున్
    బాసటనిల్చు దైవమని ప్రక్కనజేరెనుగొర్రె పిల్ల సా
    వాసపుసద్గుణంబె పరివారము గాచును క్రీస్తురక్షణల్

    రిప్లయితొలగించండి
  9. సగిరెప్రొద్దున పుట్టిన
    యుగపురుషుని దివ్యవాణి యోగ్యడనంగన్
    సగదీర్చగ వచ్చిరటకు
    జగమంతయు మెచ్చునటుల జననికి ముఖ్యుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సగిరెప్రొద్దున’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      సగిరెప్రొద్దు అనే మాటలో ప్రొ సంయుక్తాక్షరం అయినపుడు రె గురువవుతుందనుకొని వ్రాశానండి.మరోమారు పరిశీలించ ప్రార్థన

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      ఆ నియమం కేవలం సంస్కృతసమాసాలకే వర్తిస్తుంది.

      తొలగించండి
    4. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      అగుపించగ తార దివిన
      యుగపురుషుడు పుట్టెననుచు నుత్సాహముతో
      సగదీర్చగ వచ్చిరటకు
      జగమంతయు మెచ్చునటుల జననికి ముఖ్యుల్

      తొలగించండి
  10. కన్నెగర్భమునందున చెన్నుగాను
    బాలయేసు జనించెను పాకలోన
    దేవుని కుమారునిగ కడు తేజమలర
    పేదవారిని సేవించు విధిని పూని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి