ఊకదంపుడు గారూ, అద్భుతంగా ఉంది. "గణ చతుర్థి నాడు ఫణి చతుర్థి" సమస్యకు తిరుపతి వేంకట కవులు చేసిన పూరణ స్ఫురణకు వచ్చింది. మీకిష్టమైతే రెండవ పాదాన్ని " చదువు మీద సుంత శ్రద్ధ లేక" అనండి. మీ రెండవ పాదం నిస్సంశయంగా ఛందస్సు రీత్యా నిర్దోషమే ఐనా, ' చిన్న వాడిని తల్లి పట్టించుకోలేదనే అపప్రథ ' ( కుమాతా న భవతి అన్న ఆర్య వాక్యానికి వ్యాఘాతం రాకుండా ఉండేందుకే ) తొలగింపజేస్తే అత్యుత్తమ పూరణగా నిలుస్తుంది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించునీతి దప్పి నట్టి నీచులే భువిపైన
జూదమాడు వారు, సుజన వరులు
సకల జనులు మెచ్చు సన్మార్గ పథమును
వీడ రెపుడు వారు విమల మతులు
కౌరవ సభ లోన గౌరవ నీయులౌ
రిప్లయితొలగించువృధ్ధు లెల్ల రుండ వింత యదియె
కపట చిత్తు డైన కౌరవేంద్రునితోడ
జూద మాడు వారు సుజన వరులు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పొగను త్రాగ నట్టి పురుషోత్త ముడులేడు
రిప్లయితొలగించురేసు లందు గెలువ రోస మనక
వ్యసన పరుల వెంట పరుగులీ నుజగతి
జూద మాడు వారు సుజన వరులు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరుగులెత్తు జగతి... అనండి.
పొగను త్రాగ నట్టి పురుషోత్త ముడులేడు
తొలగించురేసు లందు గెలువ రోస మనక
వ్యసన పరుల వెంట పరుగులెత్తు జగతి
జూద మాడు వారు సుజన వరులు
కొంత మంది జనులు కూలి డబ్బుల తోడ
రిప్లయితొలగించుజూద మాడు వారు;సుజన జనులు
కృషిని సలుపు చుందు రిల యందు మార్చంగ
సాధ్య మౌన వారి సరళి మాన్ప.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలి, యనుజులనక నందర నొడ్డుచు
రిప్లయితొలగించునడవిఁ జేరి వగచె నన్న యొకడు!
యొడ్డు గిడ్డు లేక నుచితంపు రీతిగన్
జూద మాడువారు సుజనవరులు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఒకడు + ఒడ్డు' అన్నప్పుడు యడాగమం రాదు. '... యొక్క |డొక్కు. ..' అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. అక్కడితో ఆ వాక్యము పూర్తయిందండి అందుకు సంధిచేయలేదు.మరోమారు పరిశీలించ మనవి.
తొలగించుసహదేవుడు గారూ,
తొలగించునిజమే... కాని వాక్యం యడాగమంతో ప్రారంభం కాదు కదా!
గురుదేవులకు మరోమారు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించుఆలి, యనుజులనక నందర నొడ్డుచు
నడవిఁ జేరి వగచె నన్న యొక్క!
డొడ్డు గిడ్డు లేక నుచితంపు రీతిగన్
జూద మాడువారు సుజనవరులు!
తనను, సతిని, తమ్ములను ,రాజ్య మోడు,య
రిప్లయితొలగించు\నఘులు ,ఘోర కాననముల నుండి
పిదప దాసులగుచు విరటు కొల్వున బడిన
జూదమాడువారు సుజనవరులు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. కొల్వున బడ్డ' అనండి.
మంచియాటలెంచి మనసున,తనువున
రిప్లయితొలగించుపుష్టినింపువాటి నిష్టబడుచు
కష్టములను నెట్టు గాననే విడచుచు
జూద, మాడువారు సుజనవరులు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్నికలను గెలిచి యిల నేలగను వచ్చు
రిప్లయితొలగించుచోద్యమదియు గెలుపు జూద మదియు
జూదమాడు వారు సుజనవరులు కారు
నీతి గలుగు వారు నేత లవరు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుగురుదేవులసూచన మేరకు పద్యము సవరించితిని
సవరించిన పద్యము
తనను, సతిని, తమ్ములను ,రాజ్య మోడు,య
నఘులు ,ఘోర కాననముల నుండి
పిదప దాసులగుచు విరటు కొల్వున బడ్డ
జూదమాడువారు సుజనవరులు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుధర్మరాజు జూదమాడి యడవుల పాలయ్యారు. బలరాముని రుక్మి తో జూదము రుక్మి వధకు కారణమయ్యింది.
తొలగించుజూదమాడఁ దగదు శోకప్రళయ కార
ణంబు దెలిసి కూడ నవని పతుల
ధర్మ విధి యనంగ ధర్మజ సీరులు
జూద మాడువారు సుజనవరులు.
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూడ యవనిపతుల' అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కూడన్+అవని=కూడనవని. కూడ, కూడన్,కూడను లు సమ్మతమే గద. ముందు “దెలిసితెలిసినవని” అని వ్రాసి “దెలిసితెలిసియవని” అనవలసి వస్తుదేమోనని “కూడన్” వాడాను యతి భంగము కాకుండ.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “కూడ” దృతాంతావ్యయము గద.
తొలగించుకామేశ్వరరావు గారూ,
తొలగించునిజమే. నేనే పొరపాటున అన్నాను. మీరు చెప్పిందే సరి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించుజూద మాడువారు, సుజనవరులెపుడు
రిప్లయితొలగించుఆడ నిష్ట పడరు, చూడ మనకు
నడ్డ దారి లోన నర్థమ్ము నాసించు
వారె కనపడుదురు వీరి గనము.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వేశ్యల దగులు రస వీరులు , సారాయి
త్రాగి ద్రిమ్మరు లయి సాగు వారు
జూద మాడు వారు = " సుజనవరులు - మహా
ఘనులు మరియు త్యాగ ధనులు "
..................................... .....
ఆలుపిల్లల సుక మరయక ,పూర్వపు
టాస్తి చిటికె లోన న౦టు వెట్టు
వ్యసన పరులు ఛీఛి వసుధకు భారము
వారి బ్రతుకు వలన. ఫలము గలదె ?
( రసవీరులు = రసికవీరులు )
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇల్లు నిశ్చయముగ గుల్లచేయుచునుంద్రు
రిప్లయితొలగించుజూదమాడు వారు సుజనవ రులు
వ్య సన మార్గములనుపడకుండ సతమ్ము
సత్య పథములందు సాగుచుంద్రు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లాభమాశ చేత లోభత్వ మెంతురు
రిప్లయితొలగించుజూదమాడువారు.”సుజనవరులు
పరులమేలుకొరకు పాటుబడుట యందు
కష్ట నష్టమైన?యిష్టపరులు.
-------------ఉత్సాహవృత్తం--------
వ్యసన పరుల జూద మాడు వారు.సుజనవరులుగా
మసక జీవితాలుమార్చి|మాన్యులట్లు నేర్పుగా
విసుగు మాన్ప గలిగి,మనిషి పీడ వీడు నట్లుగా
కుసుమ మందుగంధమట్లుకూర్పులుండుజూడగా|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
విధిని దలచి గొలిచి వేరొక జన్మము
రిప్లయితొలగించువలదటంచు నతని వరము గోర
జపము తపము గాగ జరుపుటే వ్యసనమై
జూద మాడువారు సుజనవరులు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భోగ బాగ్యములను పోగొట్టు కొందురు
రిప్లయితొలగించుజూదమాడువారు , సుజనవరులు
పరహితమ్మె తమకు పరమార్థమనుచును
ధర్మపథము విడక తరలు చుంద్రు!!!
అన్నదమ్ములందు చిన్నవాడు, చెడెను
రిప్లయితొలగించుతండ్రి లేక తల్లి దండ నిడక.
వెఱ్ఱి వీడు - వారు విధ్యాధికులు, వీడు
జూద మాడు - వారు సుజన వరులు.
ఊకదంపుడు గారూ, అద్భుతంగా ఉంది. "గణ చతుర్థి నాడు ఫణి చతుర్థి" సమస్యకు తిరుపతి వేంకట కవులు చేసిన పూరణ స్ఫురణకు వచ్చింది. మీకిష్టమైతే రెండవ పాదాన్ని " చదువు మీద సుంత శ్రద్ధ లేక" అనండి. మీ రెండవ పాదం నిస్సంశయంగా ఛందస్సు రీత్యా నిర్దోషమే ఐనా, ' చిన్న వాడిని తల్లి పట్టించుకోలేదనే అపప్రథ ' ( కుమాతా న భవతి అన్న ఆర్య వాక్యానికి వ్యాఘాతం రాకుండా ఉండేందుకే ) తొలగింపజేస్తే అత్యుత్తమ పూరణగా నిలుస్తుంది. అభినందనలు.
తొలగించుఅన్న దాత రైతు అవనికే సుజనుండు
తొలగించువర్షములను నమ్ము కర్షకుండు
జూడ సేద్య మదియు జూదమై చెరగును
జూదమాడు వారు సుజనవరులు
డా. విష్ణు నందన్ గారూ,
తొలగించుధన్యవాదములు. మీ ప్రోత్సాహమునకు సర్వదా కృతజ్ఞుడను.
మీ సూచన మేరకు సవరించినాను
అన్నదమ్ములందు చిన్నవాడు, చెడెను
చదువు మీద సుంత శ్రద్ధ లేక
వెఱ్ఱి వీడు - వారు విధ్యాధికులు, వీడు
జూద మాడు - వారు సుజన వరులు.
భవదీయుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుఆంజనేయ శర్మ గారూ,
తొలగించుకర్షకులకు ప్రతి దినమూ జూదమే , ప్రతి దినమూ గండమే.
మంచి పద్యమునందించినారు ధన్యవాదములు.
ఊకదంపుడు గారూ ధన్యవాదములండీ
తొలగించుఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రైతు + అవనికే అన్నప్పుడు విసంధిగా వ్రాయరాదు. "అన్నదాత యగుచు నవనికే సుజనుండు" అనండి.
ఊకదంపుడు గారూ,
తొలగించుడా. విష్ణునందన్ గారి ప్రశంసకు పాత్రమైన చక్కని పూరణ నందించారు. బాగున్నది. అభినందనలు
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
పరమ దుష్టు లార్య! భాగవతులునైన
రిప్లయితొలగించుజూదమాడువారు, సుజనవరులు
సాటివారి కెపుడు సాహాయ్య మొనరించు
గుణము కలుగు నట్టి గొప్ప వారు