9, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య - 1879 (కమలము వికసించె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కమలము వికసించెఁ జంద్రకాంతులు సోఁకన్. 

25 కామెంట్‌లు:

  1. ద్యుమణి ప్రభవించి నంతట
    కమలము వికసించె, జంద్ర కాంతులు సోకన్
    కమనీయమ్మగు కలువలు
    ప్రమదము నొంది వికసించి రమ్యత గూర్చున్

    రిప్లయితొలగించండి
  2. తిమిరము తొలగెను భానుడు
    కమలము వికసించెఁ ,జంద్ర కాంతులు సోఁకన్
    ప్రమదము నొందుచు కలువలు
    సుమసౌర భములను జిమ్మె సోయగ మందున్

    రిప్లయితొలగించండి
  3. ఖమణి రాకకు పులకించి
    కమలము వికసించెఁ , జంద్ర కాంతులు సోఁకన్
    మమతలు పంచగ కలువలు
    నిముసము యుగమై గడుప నేర మటంచున్

    రిప్లయితొలగించండి
  4. రమణీయంబగు సరసిన
    కమలము వికసించె;చంద్రకాంతులు సోకన్
    యమలిన కలువలు నచ్చో
    తమకము తోడను విరిసెను తారల వోలెన్.

    రిప్లయితొలగించండి
  5. సుమనోహర గంగాతీ
    రమునను మల్లెల వనాంత రమున ప్రియునితోన్
    రమణి కలువ నామె హృదయ
    కమలము వికసించె జంద్ర కాంతులు సోకన్

    రిప్లయితొలగించండి
  6. కమలాప్తుని గనినంతనె
    కమలము వికసించె, జంద్రకాంతులు సోకన్
    ప్రమదముతో పున్నాగము
    కమనీయముగా విరిసెను కాసారమునన్!!!

    రిప్లయితొలగించండి
  7. రమణీయ శరద్రాత్రిం
    గమలాక్ష ముఖారవింద కమనీయ రుచుల్
    తమకమున గన నతివ ముఖ
    కమలము వికసించెఁ జంద్రకాంతులు సోఁకన్.

    రిప్లయితొలగించండి
  8. కమలాప్తుని గాంచగనే
    కమలములు వికసించె , చంద్రకాంతులు సోకన్
    కమలంబులు ముకుళించియు
    విమలంబుగ గలువ పూలు వికసించునుగా

    రిప్లయితొలగించండి
  9. రమణీమణి గౌరీ ముఖ
    కమలము వికసించె; జంద్ర కాంతులు సోకన్
    హిమగిరి వనసీమలలో
    శ్రమ దీరగ చంద్రమౌళి సంశ్లేషమునన్

    రిప్లయితొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    కమలా ! పౌర్ణమి నిశ లో

    కమల వనమున౦ దరయుము కమలము లెల్లన్

    కమలెను | కానీ త్వన్ముఖ

    కమలము వికసి౦చె చ౦ద్ర కా౦తులు సోకన్ ! !

    ........................................................

    { కమల వనము = కమలముల కొలను ;
    కమలెను = క౦దెను, వివర్ణమాయెను ; }

    .......................................................

    ఇది వరకు శ౦కరాభరణములో ఇటువ౦టి
    సమస్య నే ఇచ్చారు సమస్య =

    " భానుడు క్రు౦క౦గ విరిసె పద్మము లచటన్ "
    .....................................................
    వె లు వ డి న నా పూ ర ణ. >>>

    మానిను లొక. సాయ౦త్ర ౦

    బానన జలరుహములు విరియగ. పేర౦ట౦

    బాన౦దమ్ముగ జేసిరి ;

    భానుడు క్రు౦క౦గ విరిసె పద్మము లచటన్ ! !

    ....................................................

    రిప్లయితొలగించండి
  11. సుమముల మధ్యన కమలక
    కమలము వికసించె|”చంద్రకాంతులు సోకన్
    బ్రమలనువీడెడి పడతిగ
    తిమిరమునందలుగు సతిగ దిగులుగ నుండెన్
    **********మధ్యాక్కర**************
    {గురువు శిష్యునితోతెలిపినబోధ}
    2]స్థిమితము నందున మనసు సిద్దముగాగ?నిజమిది
    ప్రమిదకు నూనెయు లేక ప్రజ్వల మొందును జూడ
    సమతల దృష్టియు నిలిపి సౌమ్యత నిండిన దినము
    కమలము వికసించె జంద్ర కాంతులు సోకన్ గనుమనె|



    రిప్లయితొలగించండి
  12. సుమనస్సాయకుని కతన
    తమకముతోడను తపించి తనువు చలించన్
    విమలమగు రోహిణి హృదయ
    కమలము వికసించె జంద్రు కాంతులు సోకన్

    రిప్లయితొలగించండి
  13. {పూరణలోనికమలము.బి.జే..పిగుర్తు.చంద్రులు రెండురాష్ట్రాలముఖ్యమంత్రులుఅన్నభావన}
    3.శ్రమతో గెలువగ భారత
    కమలము వికసించె|”జంద్రకాంతులుసోకన్
    స్థిమితముదక్కెను-ఆంద్రులు
    సమకూర్చిన ముఖ్యులయిన చంద్రులు రాగా|


    రిప్లయితొలగించండి
  14. సమరస స్నేహము లేర్పడె
    హిమా౦శుమాలికిని "మోడీ"కెన్నికలందున్
    అమలిన భారత జనతా
    కమలము.వికసించె జంద్ర కాంతులు సోకన్

    రిప్లయితొలగించండి
  15. తిమిరోన్మధనుని గనుచున్
    కమలము వికసించెఁ ; జంద్రకాంతులు సోఁకన్
    తమకమున విచ్చె కలువలు
    సుమశరుడస్త్రంబు లేయ సోలిరి జంటన్

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులారా,
    నమస్కృతులు. ఈరోజు, రేపు మా నాన్నగారి అంత్యేష్టి కార్యక్రమంలో వ్యస్తుణ్ణై ఉన్నాను. మీ పూరణలను సమీక్షించే అవకాశం, సమయం లేవు. మన్నించండి. రేపటి సమస్యను షెడ్యూల్ చేసాను.

    రిప్లయితొలగించండి
  17. సమయోచిత నిర్ణయమని
    'నమో' పిలువ 'బాబు' వెంట నడచిన ఫలమై
    తమవారలు మంత్రులగుచుఁ
    'గమలము' వికసిసించెఁ 'జంద్ర' కాంతులు సోకన్!

    రిప్లయితొలగించండి
  18. విమల మనస్కుడు పోరుచు
    తిమిరమ్మును పారద్రోల తెలగణ రాత్రిన్...
    సమరమున గెల్వగ కవిత
    కమలము వికసించెఁ జంద్రకాంతులు సోఁకన్ :)

    రిప్లయితొలగించండి
  19. తములమ్మును నమిలెడి యా
    కమలమ్మకు చదువు చెప్ప కార్తిక షష్ఠిన్
    చెమటలు పోయగ నాకున్
    కమలము వికసించెఁ జంద్రకాంతులు సోఁకన్

    రిప్లయితొలగించండి