1, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య - 1871 (తండ్రి చావు సుతునకు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
తండ్రి చావు సుతునకు సంతస మొసంగె. 

35 కామెంట్‌లు:

  1. తల్లి దండ్రులు మనపాలి దైవ మనుచు
    భక్తి మీరగ కొలిచిన శక్తి కొలది
    సంత సించిన యాతండ్రి చరమ దశను
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో 'దైవములని' అనండి.

      తొలగించండి

  2. కలడను వాడు ఇచ్చోట కలడా అని
    స్తంభమును పగుల గొట్టిన వచ్చేను
    నారసింహుడు దక్కేను మోక్షము
    తండ్రి చావు సుతునకు సంతస మొసగె

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ భావానికి గోలి వారు చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. చూడండి.

      తొలగించండి
  3. ఎవ్వరైనను బోవలె నెప్పుడైన
    పెద్ద వయసదిగావున పెద్దగాను
    బాధవలదని మనసున బాగ దలచ
    తండ్రి చావు సుతునకు సంతస మొసగె

    రిప్లయితొలగించండి
  4. జిలేబి గారూ ! చక్కటి ఊహ...దానికి నా పద్య రూపము.

    కినిసి దిట్టెడు జనకున కునికి జూపి
    హరియె జంపగ మోక్షమేయందుననుచు
    భక్త ప్రహ్లాదుడే నాడు బరగ దలచె
    తండ్రి చావు సుతునకు సంతస మొసగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ, జిలేబీ గారి భావానికి ఇచ్చిన పద్యరూపం రెండూ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. తండ్రి చావు సుతునకు బాధ్యతల నొసగు
    అక్కచెల్లె౦డ్ర తమ్ముల నాదరించి
    తల్లి పనుపును పాటించి ధర్మ విధిని
    వంశ మర్యాద కాపాడి బ్రతుక వలయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీరు సమస్యను పరిష్కరించలేదు అయినా మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. 1.చరమ దశ యందు శయ్యపై జనకు డుండ
    కళ్ళ నీరు నిండి మనసు కలత బడగ
    మంచి మాట లేక వడలి మరణ మొంద
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.

    2.తనకు యాతన యొసగిన తండ్రి యచట
    మోక్షమందె తాను మొరకు యయ్యు
    నరహరి దయ చే యతనిలో నైక్య మయ్యె
    తండ్రి చావు సుతునకు సంతసమొసంగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పె౦డ్ల మెపుడొ చచ్చెను ,పిల్ల పీచు లేదు ;
    బోలె డాస్తిని తనపేర వీలు నామ --
    వ్రాసి యు౦చె గడచిన స౦వత్సరమున ;
    నెదురు చూడగ వీని చా వెపు డట౦చు --
    వచ్చె న౦తలో హాస్పిటల్ వార్త. " పిన్న
    త౦డ్రి చావు సుతునకు స౦తస మొస౦గె "
    మమత విడి సొమ్ము కాశి౦ప మనుజు డగునె !

    రిప్లయితొలగించండి
  8. బాధగలిగించు సరిగదా పైకముడుగు
    తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె
    మరణ మొందిన తండ్రిదా మరల బ్రదికె
    ననగ సుతునకు నయ్యెడ నాననమున

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మేదినీశుల నలరించె మేఘనాధు
      తండ్రి చావు, సుతునకు సంతస మొసంగె
      పరశు రామునకున్ముని వరుడు సాత్య
      వతుడు దల్లియునన్నల బ్రతుకు నిలిపి

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  10. తాత తండ్రుల యాస్తిని తగులబెట్టి
    బాధ్యత ల వీడి తనయుని బాధపెట్టి
    తల్లిని సతము వేదించి లొల్లిపెట్టు
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మరణ శాసనమ్మున ఆస్తి మనుమలకును
    చెందగావలె నని తండ్రి పొందు పరచి
    నటుల తెలియక వ్యాధితు డైన ముసలి
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  13. వ్యసనమందున మునిగియు-పసనుబాసి
    రోగబాధల నంటగ వేగలేక
    నరక మనుభవంబునుగని-నలుగుచున్న
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.
    2.మధ్యపానము సేవించి మానవతయె
    మరచి భార్య పిల్లలగొట్టు-మనసులేని
    మమతవీడిన మనిషియే –మట్టిగాన
    తండ్రి చావు-సుతునకుసంతస మొసంగె.
    3.ఇంటిపెద్దకు యిల్లాలు యిమడ దనుచు
    సంతు సాకక- వెలయాల సరసనుండి
    అప్పు లంటించి గొప్పగా తిప్పలుంచ?
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.

    రిప్లయితొలగించండి
  14. విరిసి దిరిసెన రూపమై, వెలిగి శశిగ,
    మసలి మృదువుగ నల పరమాత్మ జేర ,
    ఋజను భరియించ వివశుడౌ రీతి గడుపు
    తండ్రి చావు , సుతునకు సంతస మొసంగె.

    రిప్లయితొలగించండి
  15. వైద్యశాలయందున చాల బాధ పడిన
    కన్నతండ్రి కోలుకొనగ కలత పడిన
    ప్రముఖ కార్తీక సోమవారమ్ము నాటి
    తండ్రి చావు సుతునకు సంతసమొసంగె

    రిప్లయితొలగించండి
  16. ఎంత డబ్బున్న నాశకు నంతులేదు
    తాను కూడబెట్టిన సొమ్ము తరగకున్న
    నాస్తి పెంచు దురాశయ మడగక తన
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి నమస్కారములు.
    ఈరోజు గ్రామాంతరము వెళ్ళడము వలన బ్లాగును ఇప్పటివరకు సందర్శించే అవకాశము చిక్కనందున ఆలస్యమైందండి

    ప్రహ్లాదుని వృత్తాంతముగా......

    హరిని కొలుచుటె నేరమ్ము యనుచు పలికి
    తనదు నామమొకటె సదా తలవ మనెడి
    మూర్ఖుడైనట్టి వాడికి మోక్ష మొసగ
    శిష్ఠ రక్షకుడగు హరి చేతులందు
    తండ్రి చావు సుతునకు సంతస మొసగె

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి ప్రణామములు
    నిన్నటి పూరణము


    కొమ్మ మీద జేరి కోకిలమ్మలు పూప
    మావిచిగురు దినెను, మధుకరమ్ము
    మధువు గ్రోల దలచి మందారములజేరె
    నామణి ప్రకృ తెంతొ యంద మొప్పు

    రిప్లయితొలగించండి
  19. దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
    పనికిరాదని ధరియింప బయనమయ్యి
    పుణ్య లోకాల జేరుచు పూతుడవగ
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె

    రిప్లయితొలగించండి
  20. దేహమెంతయొ శుష్కించి దెల్వనగుచు
    పనికిరాదని ధరియింప బయనమయ్యి
    పుణ్య లోకాల జేరుచు పూతుడవగ
    తండ్రి చావు సుతునకు సంతస మొసంగె

    రిప్లయితొలగించండి